జంకు గొంకు లేక జలసూకరమ్ములు
తప్పు జేయ నెంచ తప్పు కాదు
లంచ మిచ్చి శరణు లలితమ్మకునుమొక్కి
బొంకి నట్టి వాడె పుణ్య జనుడు
10, జులై 2010, శనివారం
8, జులై 2010, గురువారం
సమస్యా పూరణ
హెచ్చిన ధరలను కనుగొని
విచ్చేసెను గుండె పోటు విపరీతము గన్
నచ్చినది తినగ నోచక
పచ్చడి మెతుకులె మనకిక పరమాన్నమయెన్
విచ్చేసెను గుండె పోటు విపరీతము గన్
నచ్చినది తినగ నోచక
పచ్చడి మెతుకులె మనకిక పరమాన్నమయెన్
18, జూన్ 2010, శుక్రవారం
ఆటవెలది
పసిడి పూల పూజ చేసినా ఫలమేమి ?
పంచ భక్ష్య భోజ్య ఫలము లివ్వ
జేరి కొలువ దేవ ! తేరి జుడగ రావు
రక్తి లేని భక్తీ ముక్తి నియదు .!
పంచ భక్ష్య భోజ్య ఫలము లివ్వ
జేరి కొలువ దేవ ! తేరి జుడగ రావు
రక్తి లేని భక్తీ ముక్తి నియదు .!
సమస్యా పూరణలు
కం
" నారద భక్తిని భరించు నారాయణుడే "
" తేట గీతి "
" దొంగ చేతిలో తాళాలు బెంగ లేదు "
౧ కం
భారతిని బొగడ జూచిన
సారస్వత నొంద గలరె సరసతి లక్ష్మీ
తీరిక లేదనే పార్వతి
నారద భక్తిని భరించు నారాయణుడే
గీతి
పసిడి పూతల నగలు బహుళమై లేవు
ముత్యాలు రతనాలు పగడము లసలు లేవు
వజ్ర వైడూర్య మరకత మణులు లేవు
దొంగ చేతిలో తాళాలు బెంగ లేదు
" నారద భక్తిని భరించు నారాయణుడే "
" తేట గీతి "
" దొంగ చేతిలో తాళాలు బెంగ లేదు "
౧ కం
భారతిని బొగడ జూచిన
సారస్వత నొంద గలరె సరసతి లక్ష్మీ
తీరిక లేదనే పార్వతి
నారద భక్తిని భరించు నారాయణుడే
గీతి
పసిడి పూతల నగలు బహుళమై లేవు
ముత్యాలు రతనాలు పగడము లసలు లేవు
వజ్ర వైడూర్య మరకత మణులు లేవు
దొంగ చేతిలో తాళాలు బెంగ లేదు
29, మే 2010, శనివారం
ఆటవెలది
ఆట వెలది
పసిడి పూల పూజ చేసినా ఫలమేమి ?
పంచ భక్ష్య భోజ్య ఫలము లివ్వ
జేరి కొలువ దేవ ! తేరి జూడగ రావు
రక్తి లేని భక్తీ ముక్తి నియదు !
పసిడి పూల పూజ చేసినా ఫలమేమి ?
పంచ భక్ష్య భోజ్య ఫలము లివ్వ
జేరి కొలువ దేవ ! తేరి జూడగ రావు
రక్తి లేని భక్తీ ముక్తి నియదు !
