ఎంత వారలైన కాంత దాసులనుట
వింత కాదు మనకు పంత మేల ?
తనదు పాదమంటి తబిసియౌ మ్రొక్కంగ
కాంత జూచి మౌని కన్ను గొట్టె !
9, జనవరి 2011, ఆదివారం
8, జనవరి 2011, శనివారం
సమస్య " కలహంసల తప్పుగాక కాకుల తప్పా ? "
కిల కిల పక్షుల రవములు
తెలవారగ మేలు గొలుప తరువుల పైనన్ !
కలకంఠి కలలు కరిగెను
కలహంసల తప్పు గాక కాకుల తప్పా ?
-------------------------------
కల భామినులంత కలసి
వల విసురుతు మురిపింపగ వలపులు కురియన్ !
మలహరుని మతి చలించగ
కలహంసల తప్పు గాక కాకుల తప్పా ?
మలహరుడు = శివుడు
తెలవారగ మేలు గొలుప తరువుల పైనన్ !
కలకంఠి కలలు కరిగెను
కలహంసల తప్పు గాక కాకుల తప్పా ?
-------------------------------
కల భామినులంత కలసి
వల విసురుతు మురిపింపగ వలపులు కురియన్ !
మలహరుని మతి చలించగ
కలహంసల తప్పు గాక కాకుల తప్పా ?
మలహరుడు = శివుడు
లేబుళ్లు:
సమస్యా పురాణాలూ
25, డిసెంబర్ 2010, శనివారం
సమస్య " గొడు గెం దుకు కుంభ వృష్టి కురిసెడి వేళన్ "
శ్రీ శంకరయ్య గారి సమస్యకు పూరణ
-------------------------------------
తడిసిన వనితను గని
వడి వడిగా అడుగు లేయ వరిమడులందున్ !
పడగలవు అడుగు తడబడి
గొడు గెందుకు కుంభ వృష్టి గురిసెడి వేళన్ !
-------------------------------------
తడిసిన వనితను గని
వడి వడిగా అడుగు లేయ వరిమడులందున్ !
పడగలవు అడుగు తడబడి
గొడు గెందుకు కుంభ వృష్టి గురిసెడి వేళన్ !
లేబుళ్లు:
సమస్యా పూరణలు
సమస్య " గొడు గెందుకు కుంభ వృష్టి కురిసెడి వేళన్ "
శ్రీ శంకరయ్య గారి సమస్యకు పూరణ
---------------------------------------
నడి రేయి దాటి పోయెను
అడగనిదే వరమీయదు యలివేల్ మం గమ్మైనన్ !
తడియగ వలపుల జడి
గొడు గెందుకు కుంభ వృష్టి కురిసెడి వేళన్
---------------------------------------
నడి రేయి దాటి పోయెను
అడగనిదే వరమీయదు యలివేల్ మం గమ్మైనన్ !
తడియగ వలపుల జడి
గొడు గెందుకు కుంభ వృష్టి కురిసెడి వేళన్
లేబుళ్లు:
సమస్యా పూరణలు
సమస్య " అమెరికా లోన లభియిం చె నావకాయ "
శ్రీ కంది శంకరయ్య గారి సమస్యకు పూరణ
----------------------------------------
తెలుగు వారంత కలసిన వెలుగు బాట
మలచి పూయింఛి రందరు మావి తోట
వెలయు చున్నవి నగరపు వీధు లందు
అమెరికా లోన లభియిం చె నావకాయ
----------------------------------------
తెలుగు వారంత కలసిన వెలుగు బాట
మలచి పూయింఛి రందరు మావి తోట
వెలయు చున్నవి నగరపు వీధు లందు
అమెరికా లోన లభియిం చె నావకాయ
లేబుళ్లు:
సమస్యా పూరణలు
