కొడుకు లుండె గాని కోడలి దాస్యము
మనుమ లున్న నేమి మమత కరువు
ప్రేమ యనగ వరము పిడికె డైనను గన మా
శ్రమము నందు మనకు శాంతి దొరకు
19, మార్చి 2011, శనివారం
13, మార్చి 2011, ఆదివారం
" కలమును త్యజియించి పొందె గవియను పేరున్ "
కల మెందుకు నాసు కవికి
విలసితముగ జెప్పు నతడు విశ్వ జనీనన్ !
కొలువై యుండును సరస్వతి
కలమును త్యజియించి పొందె గవియను పేరున్ !
విలసితముగ జెప్పు నతడు విశ్వ జనీనన్ !
కొలువై యుండును సరస్వతి
కలమును త్యజియించి పొందె గవియను పేరున్ !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
23, ఫిబ్రవరి 2011, బుధవారం
" దిక్కు లేని వాడు దినకరుండు "
నాల్గు దిక్కులందు నలు వైపు లందుండు
ఆది దేవు డనగ నతడె గనుక
జీవ రాసులన్ని జీవించు నతడిపై
దిక్కు లేని వాడు దినకరుండు.
ఆది దేవు డనగ నతడె గనుక
జీవ రాసులన్ని జీవించు నతడిపై
దిక్కు లేని వాడు దినకరుండు.
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
1, ఫిబ్రవరి 2011, మంగళవారం
" తలలు వంచి గగన తలము గనుడు "
కొలను లోన దిగిరి కొమ్మలందరు గలసి
జలక మాడ బోవ చెలువు మీర
నదము నందు కనగ నిండు తారల శశిని
తలలు వంచి గగన తలము గనుడు !
జలక మాడ బోవ చెలువు మీర
నదము నందు కనగ నిండు తారల శశిని
తలలు వంచి గగన తలము గనుడు !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
29, జనవరి 2011, శనివారం
" నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు ! "
వలపు విరహాల సంకెల బిగుసు కొనగ
ముద్దు మురిపాలు పంచగ మంగ చెంత .
కొండ దిగి దిగి నడిరేయి గడచి యైన
నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు.!
----------------------------------
పెద్ద వయసున నేర్చిన విద్య లెపుడు
వమ్ము కాబోదు చదివిన వింత హాయి
వయసు బేధము లెదన విద్య కెపుడు
నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు
ముద్దు మురిపాలు పంచగ మంగ చెంత .
కొండ దిగి దిగి నడిరేయి గడచి యైన
నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు.!
----------------------------------
పెద్ద వయసున నేర్చిన విద్య లెపుడు
వమ్ము కాబోదు చదివిన వింత హాయి
వయసు బేధము లెదన విద్య కెపుడు
నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
