గోడపై నొక చిత్రము జూడ గాను
జలక మాడగ జలజాక్షి కొలను లోన
వలువ లొలిచిన రీతిగ కలిగె భ్రాంతి
పదుగురు గనంగ వనిత వివస్త్ర యయ్యె !
19, సెప్టెంబర్ 2011, సోమవారం
16, సెప్టెంబర్ 2011, శుక్రవారం
" దోచు కొన్న వాడె తోడు నీడ "
మనసు లోన నిలిచి మమకారమును పెంచి
కలిమి లేము లందు కలసి మెలసి
కల్ల కపట మనక యుల్ల మందున ప్రేమ
దోచు కొన్న వాడె తోడు నీడ !
కలిమి లేము లందు కలసి మెలసి
కల్ల కపట మనక యుల్ల మందున ప్రేమ
దోచు కొన్న వాడె తోడు నీడ !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
12, సెప్టెంబర్ 2011, సోమవారం
" గొడ్డురాలైన తల్లికి గొడుకు మ్రొక్కె "
రోడ్డు ప్రక్కన సొగసైన బిడ్డ దొరికె
దైవ మిచ్చిన వరమంచు దత్తు డనుచు
ముద్దుగా పెంచి యాతని పెద్ద జేయ
గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కె !
దైవ మిచ్చిన వరమంచు దత్తు డనుచు
ముద్దుగా పెంచి యాతని పెద్ద జేయ
గొడ్డు రాలైన తల్లికి గొడుకు మ్రొక్కె !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
10, సెప్టెంబర్ 2011, శనివారం
" పండితుని జూచి నవ్వెను పామరుండు "
సీమ చదువులు చదివిన సోముడొకడు
కోన సీమకు చేరెను కోర్కె మీర
గౌతమిని దాటు విధమును గాన నట్టి
పండితుని జూచి నవ్వెను పామరుండు !
కోన సీమకు చేరెను కోర్కె మీర
గౌతమిని దాటు విధమును గాన నట్టి
పండితుని జూచి నవ్వెను పామరుండు !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
6, సెప్టెంబర్ 2011, మంగళవారం
" గాలి కబురు లిపుడు గణన కెక్కె "
చల్ల గాలి కెపుడు మెల్లగా వెంటాడి
ఉల్ల మందు హాయి ఝల్లు మనగ
కొల్ల గొనకు మదిని కల్లలాడి చెలికి
గాలి కబురు లిపుడు గణన కెక్కె !
-------------------------------------
జాలి పడకు మెపుడు నీలి వార్తలు వినుచు
గేలి చేతు రంత బేల వనుచు
రాలు గాయి జనులు రాజిల్ల నీయరు
గాలి కబురు లిపుడు గణన కెక్కె !
ఉల్ల మందు హాయి ఝల్లు మనగ
కొల్ల గొనకు మదిని కల్లలాడి చెలికి
గాలి కబురు లిపుడు గణన కెక్కె !
-------------------------------------
జాలి పడకు మెపుడు నీలి వార్తలు వినుచు
గేలి చేతు రంత బేల వనుచు
రాలు గాయి జనులు రాజిల్ల నీయరు
గాలి కబురు లిపుడు గణన కెక్కె !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
5, సెప్టెంబర్ 2011, సోమవారం
" సరసము దెలియని మగనిని సతి మెచ్చు కొనెన్ "
నిరతము జపములు చేయుచు
పరదారను పలుకరింప ప్రవరుని వలెనన్ !
మురియుచు గరువము నొందుచు
సరసము దెలియని మగనిని సతి మెచ్చు కొనెన్ !
పరదారను పలుకరింప ప్రవరుని వలెనన్ !
మురియుచు గరువము నొందుచు
సరసము దెలియని మగనిని సతి మెచ్చు కొనెన్ !
లేబుళ్లు:
" సమస్యా పురాణములు "
1, సెప్టెంబర్ 2011, గురువారం
" గణ నాయక సుత ! వినాయకా ! వందనముల్ ! "
గణ నాదుడవని నిను
ప్రణతిగ నే కొలువ గలుగు భాగ్యమునిమ్మా !
గణు తింపక దోషములను
గణ నాయకసుత ! వినాయకా ! వందనముల్ !
ప్రణతిగ నే కొలువ గలుగు భాగ్యమునిమ్మా !
గణు తింపక దోషములను
గణ నాయకసుత ! వినాయకా ! వందనముల్ !
లేబుళ్లు:
" సమస్యా పూ రణములు "