Pages

27, ఫిబ్రవరి 2012, సోమవారం

" పూజలు నిష్పలంబు లవి పుణ్య మొసంగవు పాప హేతువుల్ ! "

తేజము ప్రజ్వరిల్లగను ధారుణి నేలెడు భూసురోత్తమా l
లేజవరాలి కోర్కెనిటు లేశము మాత్రము నిచ్చగిం చకన్
రాజిలు నీదు తేజమున రంజిల జేయగ యజ్ణ కోటులం
పూజలు నిష్పలంబు లవి పుణ్యమొసంగవుపాప హేతువుల్ !

24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

" పతిని హింసించు కాంత యే పరమ సాధ్వి "

అలిగి ప్రణ యంపు కలహాన పలుక రాక
కొంటె భావమ్ము మదిలోన కొసరె గాన
కడకు కవ్వించి మురిపించి జడను విసిరి
పతిని హింసించు కాంత యే పరమ సాధ్వి !

23, ఫిబ్రవరి 2012, గురువారం

" పరదారే ష ణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్ ! "

సురలకు పరదారల మది
నరులకు నియమంబు లెన్నొనౌరా యనగా !
పొర బడిన పెండ్లి కన్నను
పర దారేష ణము మేలు ప్రాజ్ఞుల కెల్లన్ !

22, ఫిబ్రవరి 2012, బుధవారం

దత్త పది " హరి , చక్రి, విష్ణు , రామ ",

భక్త సులభుడు రాముడు ముక్తి నియగ
హరిని సేవించి తరియించ పాప హరము
చక్రి గొలిచిన తొలగును వక్ర బుద్ధి
వేరు నామము లెన్నైన విష్ణు మయమె !

18, ఫిబ్రవరి 2012, శనివారం

" నిషిద్ధాక్షరి " శ, ష , సః , హ "

గుగ్గిలము నాయనారట
గుగ్గిలపుం బొగను ముంచి గోపతి ప్రీతిన్ !
గగ్గోలు పడుచు భక్తిని
గుగ్గిలమే గుడిని నింపి గొలిచె కపర్ధిన్ !

16, ఫిబ్రవరి 2012, గురువారం

" రామా నాదరి రాకు రాకు మనియెన్ రంభే భయబ్ర్హాం తయై "

లేమా యేటికి భీతి చెందెదవు నీ లేబ్రాయమున్ మెచ్చితిన్
కామోద్రేకము కాదు కాదిది నినున్ కాంక్షించి మోహంబునన్
భామా వీడను నిన్ను నేనిక నభంబే క్రుంగి భీతిల్లగన్
రామా నాదరి రాకు రాకు మనియెన్ రంభే భయ భ్రాంతయై

13, ఫిబ్రవరి 2012, సోమవారం

" జనకుని జంపి దాశరధి జానకి దెచ్చెను శౌర్య మూర్తియై "

ధనువును వంచి రాజుల మదంబు నడంచి పరాక్ర మంబునన్
జనకుని కూతురైన జలజాక్షిని సీతను వీడ కుండగన్
వనముల యందు గ్రమ్మరుచు వారధి దాటి జయించి నింద్రజిత్
జనకుని జంపి దాశరధి జానకి దెచ్చెను శౌర్య మూర్తియై

"[ దత్త పది ] " ఈగ , దోమ , పేను , నల్లి "

పేను కొరుకుడు నెత్తికి పెత్త నమ్ము
దోమ లన్నియు జేరెను తోక ముడిచి
నల్లులై కుట్టి ప్రాణుల నంచి తినెడి
ప్రభువు లుండిన [ ఈ ] నీగతి ప్రజల కెపుడు

8, ఫిబ్రవరి 2012, బుధవారం

" ఆపన్నుల బందు వయ్యె నారావ ణుడున్ "

రేపన్నది యోచించక
పాపమ్ములు జేయు వారు పరి పరి విధముల్ !
శా పమ్ముల నందు కొనిన
ఆపన్నుల బందువయ్యె నారావ ణుడున్ !

7, ఫిబ్రవరి 2012, మంగళవారం

" శాసన ధిక్కారమే ప్రశ స్తము గాదా "

ఈసున కైక యభీష్టము
కౌసల్యకు కలుగ జేసెకష్టమ్ము మదిన్ !
రోసెను కొమరుని తలచుచు
శాసన ధిక్కారమే ప్ర శస్తము గాదా !
-------------------------------------
మోసము జేయుచు జనులను
వాసిగ చట్టములు జేసి బాధించుట కై !
పాసెము బిగియించి తుదకు
శాసన ధిక్కారమే ప్రశ స్తము గాదా !

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

" పర్వ దినమని యేడ్చిరి సర్వ జనులు "

విశ్వ మంతను పాలించు నీశ్వరునకు
వత్స రమ్మున కొకనాడు యుత్స వమ్ము
స్పర్ధ లేకుండ జరుపుట వ్యర్ధ మనుచు
పర్వ దినమని యేడ్చిరి సర్వ జనులు !
---------------------------------------
కరువు దినములు వచ్చెను బరువు గాను
క్రొత్త పరికిణి పాపకు కొనెద మన్న
ధరలు నింగిని తాకగ తగునె యిటుల
పర్వ దినమని యేడ్చిరి సర్వ జనులు !

4, ఫిబ్రవరి 2012, శనివారం

" జలము పోయగ నగ్ని జ్వాజ్వల్య మయ్యె "

వినత కద్రువ పందెము వెరగు పరచ
తెల్ల యశ్వము తోకను నల్ల దనుచు
రగిలి మండుచు నసూయ పొగలు సెగల
జలము పోయంగ నగ్ని జ్వాజ్వల్య మయ్యె
---------------------------------------------
యాగ మందున సమిధలు నాగ కుండ
హోమ మందున వేయుచు హోత యతడు
ఘ్రుతముగా నెంచి చేకొని మితము మీరి
జలము పోయగ నగ్ని జ్వాజ్వల్య మయ్యె !
--------------------------------------
క్షమించాలి కొన్ని అక్షరాలు " బండిరా , అరుకారం " సరిగా రావటల్లేదు.

1, ఫిబ్రవరి 2012, బుధవారం

" గణ యతి ప్రాసలే లేని కైత మేలు. "

కవుల మదిలోని భావాలు కలత పడగ
చందమే లేని పద్యాల కంద మేది
యతులు ప్రాసలు లేకున్న మతులు బోవు
గణ యతి ప్రాసలే లేని కైత మేలు
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase