Pages

31, మే 2012, గురువారం

" మూర్ఖు డతడు రాజ పూజితుండు "

పశుల గాచు నట్టి పల్లె వాడా తడు
మోస మంది తుదకు క్లేశ పడగ
కాళి వరము నొంది కవనాలు రచియించె
మూర్ఖు డతడు రాజ పూజి తుండు !
-----------------------------------------
విపిన మందు దిరిగి వేటాడి జీవించు
మూర్ఖు డతడు రాజ పూజి తుండు
భక్తి గొలుచు శివుని భక్త కన్నప్పకే
భవుడు మెచ్చి యిచ్చె పరమ పధము !

29, మే 2012, మంగళవారం

" పాల లోచ నుండు పాపి సుమ్ము "

మసన మందు దిరుగ మహదేవు డందురు
పాప హరమె యనెడి భస్మ ధారి
పునుక మాల గళము పూజింతు రేలనో
పాల లోచ నుండు పాపి సుమ్ము !

26, మే 2012, శనివారం

" రంకు నేర్చిన చిన్నది బొంక లేదు "

వంక లెన్నియొ జెప్పుచు జంకు లేక
ఇహము నందున నీరీతి నహము వీడి
సుగుణ వతియైన వనితగ త్రిగుణ ములను
రంకు నేర్చిన చిన్నది బొంక లేదు. !

" మణి రంగము " [ ప్రత్యేక వృత్తము ]

నిండు పున్నమి నీడల లోనా
పండు వెన్నెల పానుపు పైనా
గండు కోయిల గానము వింటూ
గుండె నిండెను కూరిమి తోనే !

22, మే 2012, మంగళవారం

" తప్పు లెన్ను వాడె గొప్ప వాడు. "

విద్య లెన్నొ నేర్పి విద్వాంసునిగ జేసి
నడత నేర్పు నట్టి నలువ యతడు
అహము వీడు మనల రహదారి నడిపించు
తప్పు లెన్ను వాడె గొప్ప వాడు !

21, మే 2012, సోమవారం

" పందిరి మంచమున ముండ్లు పరచుటె మేలౌ ! "

తొందర బడి మరదలు చని
పందిరి మంచమున ముండ్లు పరచు టె మేలౌ !
సందడె సందడి జంటకు
చిందులు వేయగ నటునిటు శివరాత్రి యయెన్ !

20, మే 2012, ఆదివారం

" నాలు గైదు కలుప నలువ దయ్యె "

నాలు గైదు లనగ మరువము యిరువది
ఐదు నాల్గు లన్న నిరువ దౌను
ఇరువ దిరువ దైన వెర గేమి కలుపంగ
నాలు గైదు కలుప నలువ దయ్యె !

18, మే 2012, శుక్రవారం

" శని పట్టిన వారల కగు సకల శుభమ్ముల్ !

దినకరుని తనయు డా తడు
కినుక వహించిన జనులకు కీడులె కల్గున్ !
కనుగొని గ్రహ శాంతి నిడగ
శని పట్టిన వారల కగు సకల శుభమ్ముల్
------------------------------------------
కని విని యెరుగని రీతిగ
మనుజుల బాధించ గలడు మహిమల చేతన్ !
ఘనముగ శాంతిని జరిపిన
శని పట్టిన వారల కగు సకల శు భమ్ముల్ !

17, మే 2012, గురువారం

" పద్య రచన " " ఉత్సాహ "

ముదము గాను నేర్పు నట్టి పూజ్య గురువు లుండ గా
పద్య రచన చేయ గలుగు భాగ్య మబ్బె నాకి కన్
మెదడు పడును బెట్టి యికను మిక్కు టముగ పద్య ముల్
పదము పదము గూర్చి నేను పద్య రచన చేసెదన్ !

" పద్య రచన "" సుగంధి "

నిండు చంద్రు డేమొ వెల్గె నింగి నాట్య మాడ గన్
పండు వెన్నె లంత పిండి పార బోసి నట్టు లే
మెండు కాంతు లీను చుండె మేటి తార లన్ని యున్
రండు రండు మోద మంద రాగ రంజితమ్ము గా !

15, మే 2012, మంగళవారం

" నరక లోకము గల దండ్రు నాక మందు "

నరక నాకము లన్నవి వేరు లేవు
దైవ చింతన లోపించి తర్క మిడుచు
బుద్ధి కర్మల వెంబడి ప్రొద్దు దిరుగు
నరక లోకము గల దండ్రు నాక మందు !

" పద్య రచన " గోమాత

దేవ గణముల నిలయమ్ము ధేను వనగ
క్షీర సాగర మందుండి క్షీర ధాత్రి
గడ్డి పెట్టిన పాలిచ్చు దొడ్డ మనసు
అవత రించెను జగతిని యార్తి దీర్చ !

11, మే 2012, శుక్రవారం

అందరు నందరే మరియు నందరు నందరె యంద రందరే "

కొందఱు కాళి దాసులగు కొందఱు తిక్కన పోతనా ర్యులే
ఎందరొ విశ్వనాధు లన నెందఱొ వేమన రామదాసు లౌ
చందన పుష్ప రాగముల సౌరులు జిమ్మిన పండి తోత్తముల్
అందఱు నందఱే మఱియు నందఱు నందరె యందరం దఱే

" పద్య రచన "

మాయ లోకము సృష్టించి మహిమ జూపి
మాయ శశిరేఖయై తాను మత్తు గొలిపి
వింత వంటకములు వండి విందు జేసి
కయ్య మేరీతి లేకుండ వియ్య మంద
భీమ సేనుని తనయుడు వీరు డనగ !

" ఏడు వంద లనిన నెక్కు వగున ? "

ఏడు వంద లనిన నెక్కువేమి మనకు
ఏడు వేలు లక్షలు ఏడు కోట్లు
ఏడేడు భువనాల నేకమై విరియంగ
ఏడు వంద లనిన నెక్కు వగున ?

9, మే 2012, బుధవారం

" అయ్య వారిని గని నవ్వె యాచ కుండు "

కొండ మీదను కొలువున్న బండ రాయి
ఎదుట నిలబడి వేడిన నుదుటి వ్రాత
ఎంత మ్రొక్కిన మార్చడు వింత గాదె ?
అయ్య వారిని గని నవ్వె యాచ కుండు !

7, మే 2012, సోమవారం

" జారులు చోరులున్ కుటిల చారులు దుష్టులు దుర్మదాం దులున్ ! "

దారుణ మైన దుస్థితికి దోషము లెంచక నెంద రెందరో
మారణ హోమమున్ జరిపి మానని గాయము మాన్ప కుండగా
భారము గల్గదే భువికి పాపుల సంతతి పెంపు జేయగా
జారులు చోరులున్ కుటిల చారులు దుష్టులు దుర్మదాందులున్ !

4, మే 2012, శుక్రవారం

" జార గుణంబు గల్గు సతి సాద్వ్హి యటంచు నుతించి రెల్లరున్ ! '

ఘోరము గాదె నేడిటుల గాదిలి కోడలు ద్రౌపదిన్ సభన్
చీరలు లాగి వేయుటకు చేసిన నేరము దెల్ప కుండగా
వారిజ లోచనిన్ వెఱగు బొందెడి నిందల పాలు జేసి యీ
జార గుణంబు గల్గు సతి సాద్వ్హి యటంచు నుతించి రెల్లరున్ !

" వార కాంతా విమోహమున్ భార్య మెచ్చె "

ఏమి తపములు జేసిన నేమి ఫలము ?
చెలియ ప్రేమను మించిన చెలువ మేది ?
దివిజ లోకాల తేలించు దీప్తి జాలు
వార కాంతా విమోహమున్ భార్య మెచ్చె !

1, మే 2012, మంగళవారం

" పద్య రచన " మేనక విశ్వామిత్రుడు చిన్ని పాప "

భామా వీడుము నన్నిక
నీ మోహము నందు మునిగి నీమము లేకన్ !
కామ గతి తిరిగి యుంటిని
భూమిక చాలించి మరలి పొమ్మిక దివికిన్ !
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase