Pages

24, అక్టోబర్ 2011, సోమవారం

" సొమ్ము లున్న వాడె సుగుణ ధనుడు "

గురువులు శ్రీ " పండిత నేమాని వారి సమస్య
--------------------------------------------
మ్లేచ్చు డనెడి వాడు మేధావి గాకున్న
పదవు లున్న చాలు పట్టు బడక
రాజ కీయ మందు రాయసము దెలిసిన
సోమ్ములున్న వాడె సుగుణ ధనుడు !

23, అక్టోబర్ 2011, ఆదివారం

" నేనే నీవైతి నేమొ ! నీవే నేనే ! "

" శ్రీ పండిత నేమాని వారి సమస్య "
ఏ నాటి బంధమో యిది
నానాటికి కలత పరచె నన్నూ! నిన్నున్ !
నేనే నీవని దలచితి
నేనే నీవైతి నేమొ నీవే ! నేనో !

20, అక్టోబర్ 2011, గురువారం

" మాట దప్పు వాడె మాన్యు డగును "

నీతి నియమ మనగ నీటిమూట లెగద
నేతి బీర లందు నేయి గనము.
మాయ జగతి నందు మంచికి తావేది
మాట దప్పు వాడె మాన్యు డగును

15, అక్టోబర్ 2011, శనివారం

" దామోదరు దిట్టు వాడు ధన వంతుడగు "

శ్రీ కంది శంకరయ్య గారి సమస్య

ఏ మాయలు దెలియక హరి
నామామృత మందు మునిగి నయమగు భక్తిన్ !
ఏ మఱు పాటున నొక పరి
దామోదరు దిట్టు వాడు ధన వంతుడగున్ !

11, అక్టోబర్ 2011, మంగళవారం

" భగవదా రాదనము చేసి పతితు డయ్యె "

" శ్రీ కంది శంకరయ్య గారి సమస్య "
దొంగ సాముల వెంబడి దిరుగు చుండ
గగన మంటిన హోమము లెగసి పడగ
గంగ పూజలు చేయగ భంగ పడుచు
భగవ దారాధానము చేసి పతితు డయ్యె !

9, అక్టోబర్ 2011, ఆదివారం

" దుర్గా భర్గులను గొలువ దురితము లంటున్ "

" శ్రీ చంద్ర శేఖర్ గారి సమస్య "
భర్గుని పూజించిన యెడ
స్వర్గము లభియించు ననుట స్వప్నము నందౌ !
దుర్గతులు దొలగ నందున
దుర్గా భర్గులను గొలువ దురితము లంటున్ !

1, అక్టోబర్ 2011, శనివారం

" కుట్టనిచో తేలు కాదు కుమ్మరి పురుగే "

" శ్రీ పండిత నేమాని వారి సమస్య "
కుట్టును చీమలె యైనను
పెట్టినచో తనదు వేలు పుట్టల యందున్ !
ముట్టిన ముట్టక యున్నను
కుట్టనిచో తేలు కాదు కుమ్మరి పురుగే !

మానినీ మణి భర్తనే మఱచి పోయె "

పుట్టి నింటికి వెడలెను బెట్టు కట్టి
తల్లి యొడిలోన శయనించ తనివి దీర
సేద దీర్చంగ నా తల్లి మోద మలర
మానినీ మణి భర్తనే మఱచి పోయె !
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase