Pages

29, మార్చి 2012, గురువారం

" సిరులు పెరిగె సీత వలన శ్రీ రఘు పతికిన్ ! "

పరమేశు సగము పార్వతి
హరి తోడి దె సిరియన హరిహరులకు వోలెన్ !
వర మాలను వేయగ నే
సిరులు పెరిగె సీత వలన శ్రీ రఘు పతికిన్ !

26, మార్చి 2012, సోమవారం

" మోహ పాశ మ్మె మేలు సన్మునుల కెల్ల "

మధుర మైనట్టి యనుభూతి మనుజ జన్మ
తపము లొనరిం చినను రాదు తధ్య మిదియె
భోగు లైనట్టి వారలె యోగు లైరి
మోహ పాశ మ్మె మేలు సన్మునుల కెల్ల
-------------------------------------------
ఏడు దినముల బ్రతుకున కేది ముక్తి ?
రాజ్య భోజ్యము లనునవి లాల సములు
శమ దమాదుల నీయగ శుక మునీంద్ర
మోహ పాశ మ్మె మేలు సన్మునుల కెల్ల !

24, మార్చి 2012, శనివారం

" చిరు లతయె రావి చెట్టును చీరి యణచె "

మల్లె తీగెలు మామిడి నల్లు కొనగ
వేప చెట్టున తీయని వెలగ కాసె
కలి యుగంబున సాధ్యము కాని దేది ?
చిరు లతయె రావి చెట్టును చీరి యణచె ?

17, మార్చి 2012, శనివారం

" పాడు లోకము రాముని ప్రస్తుతించు "

కరువు కాటకములు లేక కావు మనుచు
రామ కీర్తన జేయగ రాత్రి పగలు
భక్తి మీరగ ప్రజలంత పరవ శించి
పాడు లోకము రాముని ప్రస్తు తించు !

13, మార్చి 2012, మంగళవారం

" దివియె భువి పైన గిరగిర తిరుగు చుండు "

నింగి నగములు తిరగవు నిక్క ముగను
తిరుగు చుండును తానుగా ధరణి యనగ
దివియె భువి పైన గిరగిర తిరుగు చుండు
కనులు దిరిగిన రుజయందు కలుగు బ్రాంతి !
-------------------------------------------
నభము నందున సురలంత విభవ ముగను
మన్ను మిన్నులు నేకమై మలగు నటుల
దివియె భువి పైన గిరగిర దిరుగు చుండు
మభ్య బెట్టును మనలను మాయ చేత !

12, మార్చి 2012, సోమవారం

" ధార్త రాష్ట్రులు నడచిరి ధర్మ పధము

మాయ జూదము నోడించి మహిమ యనుచు
పణము నెపమున నడవికి పంపి రకట
ధార్త రాష్ట్రులు నడచిరి ధర్మ పధము
వినుట కెం తైన చోద్యము వీరి ప్రతిభ !

7, మార్చి 2012, బుధవారం

" భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్బ మయ్యెనే !

ఆర్యుల మాటలన్ వినక నాశగ మందులు సంతుకో సమై
భార్యకు నీయబోయి తనవారడి చేతని తాను మ్రిం గ గా
వీర్యము పుష్టి నొంది తనువెంతయొ శోభను సంతరిం చుచున్
భార్యకు మీసముల్ మొలిచె బాపురె భర్తకు గర్భ మయ్యెనే !
------------------------------------------------------------------
వారడి = లోపము

" నీతి లేని వారె నేత లైరి "

భీతి లేని ఘనులు గోతులు దీయుచు
మోస గించి జనుల కాశ జూపి
రాజ కీయ మందు రాబందు లనబడు
నీతి లేని వారె నేత లైరి . !

6, మార్చి 2012, మంగళవారం

" తెలుగు సాంప్ర దాయ మనంగ వెలుగు జిలుగు "

ఇతర దేశము లందున్న వెతలు పడక
మా తృ భాషను విడనాడ మనకు తగదు
వేద నిధులకు కాణాచి విభవ మొసగు
తెలుగు సాంప్ర దాయ మనంగ వెలుగు జిలుగు

" దత్త పది " " తాజా , బాజా , రాజా , వాజా "

తాజాగా వెలసెను గుడి
బాజాలవె మ్రోగు చుండె భక్తిగ మదికిన్ !
రాజాలగ నందరు నిటు దే
వా జాదర దెచ్చితి వైష్ణవి కొలువన్ !

3, మార్చి 2012, శనివారం

" వర్ణములను వదిలి వేయ వైభవ మగునే ? "

వర్ణములు పలురక మ్ములు
వర్ణిం చుట కెవరి తరము వాసవు కైనన్ !
వర్ణితము కాని దేదన ?
వర్ణములను వదిలి వేయ వైభవ మగునే ?
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase