Pages

13, సెప్టెంబర్ 2012, గురువారం

"బావల భుజియిం చుటే శుభావహ మందున్ ! "

ఆవల యీవల నుండియు
నావలపై యేరు దాటి నడి రేయైనన్ !
పోవలదన శుచి మంతం
బావల భుజియిం చుటే శుభా వహ మందున్ !

12, సెప్టెంబర్ 2012, బుధవారం

" padya rachana "

కాశి యన్న పూర్ణ కానినేయుని గాచె
శాప మిడు నటంచు పాప మడచ
భర్త వచ్చి యడుగ భక్తిగా వడ్డించె
బిక్ష యనగ కాదు ప్రేమ నిష్ఠ !

" వంక యున్న వాడు శంక రుండు "

వెండి కొండ పైన వేవేల నృత్యాలు
మసన మందు దిరుగు మహిమ లనగ
గళము నందు పాము గంగ చెంతన చంద్ర
వంక యున్న వాడు శంక రుండు

10, సెప్టెంబర్ 2012, సోమవారం

" పద్య రచన "

హరి నామము నహ రహమును
స్మరి యించుచు దిరుగు నీవు చంద్ర ద్యుతివౌ !
పరి పూర్ణ మైన భక్తికి
సరి తూగరు వేద విదులు సర్వ జ్ఞుడవౌ !

" " కోడ లున్న చోటు వీడు నత్త "

కొడుకు పెండ్లి జేయ కోడ లింటికి రాగ
కొంగు బట్టి యతడు చంగు మనగ
కన్న తల్లి గుండె ఖంగుమని విలపింప
కోడ లున్నచోటు వీడు నత్త

పద్య రచన

భక్తుల పాలిట శివుడన
శక్తిగ వలవేసి బట్టు జమ పాశమ్మౌ !
భక్తికి సంతస మొందుచు
ముక్తి నొసంగెను మృకండ ముని తనయునకే !

" ఇద్దఱు సతులున్న వాఁడె యిల ధన్యుఁ డగున్ ! "

పెద్దలు జెప్పెద రెప్పుడు
యిద్దఱు సతులున్నవాఁడె యిల ధన్యుడగున్ !
ముద్దుగ యలిగిన నొక్కరు
ఒద్దికగా జేర దగును నొకరికి బదులౌ !
-------------------------------------------
ఇద్దరు భార్యల రుద్రుడు
బద్దము జేసెను శిరమున భాగీ రధి నే !
దిద్దెను సగమని పార్వతి
ఇద్దఱు సతులున్న వాఁడె యిల ధన్యు డగున్ !
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase