Pages

10, సెప్టెంబర్ 2012, సోమవారం

" పద్య రచన "

హరి నామము నహ రహమును
స్మరి యించుచు దిరుగు నీవు చంద్ర ద్యుతివౌ !
పరి పూర్ణ మైన భక్తికి
సరి తూగరు వేద విదులు సర్వ జ్ఞుడవౌ !

13 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆ . వె
మనిష i మనిషి లోన మరుగున పడి యుండు
నివురు గప్పి నట్టి నిప్పు వోలె
దనుజు లనగ వారు దాసోహ మనకుండ
శివుని నైన గాసి చేయ గలరు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణము నుండి సమస్యా పూరణలు
ఈ నాటి సమస్య
" కటిక చీఁకటి నొసఁగె భాస్కరుఁడు వచ్చి"

అస్త మించని రవిబింబ మలుక చెంది
దిశను మార్చగ తేరుపై వెసను మరచి
మబ్బు కన్నెలు ముసిరిన మైక మందు
కటిక చీకటి నొసగె భాస్కరుడు వచ్చి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరా భరణం నుండి ఈ నాటి సమస్య
" పగటి పూట నిద్రింప సంపద పెరుగును "
"
వలదు వలదని పెద్దలు కలత పడరె ?
పగటి పూట నిద్రింప ...సంపద పెరుగును
మూడు సంధ్యల యందున ముచ్చ టనగ
పూజ జేసిన తరియించు పుణ్య ఫలము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం నుండి ఈ నాటి సమస్య

" రామ యనెడి నోరు ఱాతి రోలు "
______________________-

దంచి నపుడు దలచు ధన్యోస్మి యనుమాట
బాధ మరువ నెంచి బరువు గాను
రామ యనెడి నోరు ఱాతి రోలనువారు
మలిన మైన భక్తి వెలితి యనగ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం నుండి
ఈ నాటి సమస్య " రాత్రి యర్ఘ్య మిడెను రవికి ద్విజుడు "_____________________________________

భక్తి మీరి నంత పరమేశు పూజించి
సమయ మెఱుగ నట్టి సంత సమున
రాత్రి యర్ఘ్య మిడేను రవికి ద్విజు డనంగ
మోద మంది యినుడు ముక్తి నిడగ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం నుండ్ ' ఈ నాటి సమస్య '
" మానవతీ లలామ కభిమానమె చాలును చీర యేటికిన్ "
ఉ .
మౌనుల వేషమున్ వెడలి మౌనకయత్రి సతీమ తల్లితో
మానిని విన్నవిం చెదము మాదొక నీమము నగ్న మూర్తివై
బోనము బెట్టు మంచు ముని పుంగవు లెల్లరు కోర నప్పుడా
మానవతీ లలామ కభి మానమె చాలును చీర యేటికిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం నుండి " పద్యరచన "
---------------------------------------
భక్తుల పాలిట కొలువై
యుక్తిగ నీవచట నుండి యూరికి చివరన్
ముక్తికి మార్గము జూపుచు
శక్తులు ప్రసరించి హనుమ శాసించుటకై

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరా భరణము నుండి
సమస్య " భారత యుద్ధమందు దశ వక్త్రుని జంపె నృసిం హుడుద్దతిన్ "
----------------------------------
వారధి దాటుచున్ వెడలి వానర మూకలు లంక గాల్చగా
మేరువు వంటి రావణుని మేదిని గూల్చెను రాముడన్న చో
మారె యుగంబు లందునను మారణ హోమము లెన్ని తీరులన్
భారత యుద్ధమందు దశ వక్త్రుని జంపె నృసిం హుడుద్దతిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " పుడమి వెలుగును మిణుగురు పురుగు వలన "
------------------------------------------------
అలిగిన యెడ విద్యుచ్చక్తి యవిషి యందు
మెలగుటకు వీలుగానక మిణుకు మనగ
సన్న కొవ్వొత్తి కాంతికి సంత సించ
పుడమి వెలుగును మిణుగురు పురుగు వలన

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
న్యస్తాక్షరి " చం - ద - మా - మ " వరుసగా పాదమునకు మొదటి అక్షరములు గా నుండవలెను "
-----------------------------------------------
చందురుని వెన్నెలందున చల్లగాను
దరిని జేరిన యెదపొంగు దయిత చెంత
మాల దొంతర లందున మదిని నిలిపి
మధువు నింపెడి మాటల మదను డనుచు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " కందములను వ్రాయు కవులు గాడిదలు కదా "
----------------------------------------
చందురుని బోలు చందము
మందముగా మనసుతాకి మాధుర్యము గన్
మందార సుమము వంటిది
కందములను వ్రాయు కవులు గాడిదలు కదా ?
కదా = " కాదు "

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య" వీఱ్ఱ వీగెడి వారలే విజ్ఞు లనఁగ "
--------------------------------------
నేటి యుగలక్ష ణమ్మది మేటి యనగ
కపట యుక్తులతో నుండి కల్ల లాడి
దాడి జేయుచు జనులను దండు కొనుచు
విఱ్ఱ వీగెడి వారలే విజ్ఞు లనగ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " శ్రీ పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారి సమస్య
" బిడ్డ లిద్దఱు పుట్టిరి పేడి వలన "
--------------------------------------
నేటి వింతలు తెలుపగ సాటి ఎవరు
నింగి నంటిన తారలు తొంగి చూడ
మంత్ర మయమైన జగతిని మాయ గాక
బిడ్డ లిద్దరు పుట్టిరి పేడి వలన

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase