Pages

31, ఆగస్టు 2011, బుధవారం

"వాన కాలమ్ము వచ్చిన వైద్యు డేడ్చే"

రోజు రోజుకు రోగులు పెరిగి రనగ
పెట్టె నిండెను డాబుగ కట్ట దలచి
పట్టు చీరెలు కొనమని భార్య పోరు
వాన కాలమ్ము వచ్చిన వైద్యు డేడ్చే !

30, ఆగస్టు 2011, మంగళవారం

" కరుణా మయు డన్నవారు కాలాం తకులే "

విరహాగ్నిని రగిలెడి యా
వరూధినిని వలచి కపటి ప్రవరుం డయి గం
ధర్వుడు ముదముగ దలచిన
కరుణా మయుడన్న వారు కాలాం తకులే !

28, ఆగస్టు 2011, ఆదివారం

" చేరె నవరస మ్ములలోన నీరసమ్ము "

రసము లందున శృంగార రసము మిన్న
ముదము కలిగించి గెలిపించు మునుల నైన
కరుణ శాంతము లనునవి కాన లేము
చేరె నవరస మ్ములలోన నీర సమ్ము !

26, ఆగస్టు 2011, శుక్రవారం

" తల క్రిందుగ నిలిపి నెలత తలదువ్వు కొనెన్ "

" కట్ట మూరివారి అవధాన పర్వంలోని సమస్య "

నెల రాజును గని నంతనె
వలరాజును మదిని దలచి పరవశ యగుచున్
కలలందు తేలియాడుచు
తల క్రిందుగ నిలిపి నెలత తలదువ్వు కొనెన్ !

" హస్త గతుడయ్యె సూర్యు డ త్యద్భుతము గ "

సాగర తటిని నేజేరి సౌరు జూడ
అసుర సంధ్యల వలయాలు కసురు కొనగ
కడలి అందాలు సంధ్యకు కన్ను గీటె
హస్త గతుడయ్యె సూర్యుడత్యద్భుతము గ !

21, ఆగస్టు 2011, ఆదివారం

" ఎంత వాడైన తన తల్లి కింతవాడె "

నోట జూపించె లోకాలు మాట లేక
రోట గట్టిన బెడగుచు రాటు దేలె
గట్టి వాడమ్మ నీ తనయు డెట్టి వాడొ
ఎంత వాడైన తన తల్లి కింత వాడె !

" నీతికి చెరసాలె నేడు నేస్తం బ య్యెన్ "

గోతులు తీసెడి నేతలు
భూతములై ప్రజల సొమ్ము భుజియిం చుటకై !
పాతర వేయగ మంచిని
నీతికి చెరసాలె నేడు నేస్తంబ య్యెన్ !

19, ఆగస్టు 2011, శుక్రవారం

" ఎంత వాడైన తన తల్లి కింత వాడె "

14, ఆగస్టు 2011, ఆదివారం

" రక్షా బంధనము నాడు రావలదన్నా "

అక్షయమగు మన ప్రేమకు
యక్షులు గంధర్వులు మిము నరయుదు రన్నన్ !
శిక్షింప వలదు సోదర
రక్షా బంధనము నాడు రావలదన్నా !
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase