Pages

30, ఏప్రిల్ 2010, శుక్రవారం

కందము

" తమ్ముని యక్కను గావున
ఇమ్ముగ నే పొగడదలచి యిచ్చితి నాశీర్వా
దమ్మది ! వందన మది నీకు గాదు
నేమ్మమున దేవికిడితి నిక్కము తమ్మీ ! "

చింతా వారు సవరణ చేసినది
" తమ్ముని యక్కను గావున
ఇమ్ముగ నే పొగడలేదు యిట నాశీర్వా
దమ్మది వందన మది నీ
నెమ్మనమున దీవికిడితి నిక్కము తమ్మీ ! "

23, ఏప్రిల్ 2010, శుక్రవారం

కంద పద్యము . .

ఇత్తరి కందము సీసము
మత్తుగా నే చదివి చదివి మానసమందున్
చిత్తుగ తమ్ముని పొగడగ
సత్తువ నా కలముకేది సత్కవి తమ్మీ ?

సమస్యా పూరణ

అందమైన కందమునడిగా
కిల కిలా నవ్వి కదం తొక్కింది.
తియ్యని తేటగీతిని పిలిచా
మత్తుగా ఉందా ? మధువను కుం టున్నావా ? అంది.
వెలదీ ? మరి నువ్వో ? అన్నా
వెగటుగా చూసి వడి వాడిగా నృత్యం చేసింది.
సీసంలో పోయాలనుకున్నా...ఊ.....హు
ససేమిరా బిగుసుకు పోయింది
మాలలు ,మానినిలు,మాలినిలు,మత్తకోకిలలు ,
నే ఫేసుకి మేమా ? అని గుండ్రంగా తిప్పాయి
మత్తేభ సార్డులాలు  మంజరీ ద్విపదలు
ఎం....త....దురాశ బతకాలని లేదా ? మిగేస్తయవి నిన్ను.
బుదోచ్చిం దా ? సమస్యా పురాణ అంటే నీకెంత పెద్ద సమస్యో  ?
 అందుకే అందరినీ మరుజన్మకు వాయిదా వేసి
పట్టువదలని విక్రమార్కుడిలా
అన్ని చదవడం మొదలుపెట్టా !

9, ఏప్రిల్ 2010, శుక్రవారం

హైకులు

1. అబ్బాయి అమెరిక పయనం
గుండె ఆగిన అమ్మ ఖననం
కోడలు స్వేచ్చా విహంగం .
..............................
౨ నేటి కోడళ్ళ
గుప్పెళ్ళ నిండుగా లా పాయంట్లు
అరణ్య రోదనే అత్తల అగచాట్లు.
..............................
౩.ఆపదలో అంత ఆత్మీయులే
ఆచరణలో తెలుస్తుంది.
అదంతా ఆత్మ వంచన ....అని
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase