అందమైన కందమునడిగా
కిల కిలా నవ్వి కదం తొక్కింది.
తియ్యని తేటగీతిని పిలిచా
మత్తుగా ఉందా ? మధువను కుం టున్నావా ? అంది.
వెలదీ ? మరి నువ్వో ? అన్నా
వెగటుగా చూసి వడి వాడిగా నృత్యం చేసింది.
సీసంలో పోయాలనుకున్నా...ఊ.....హు
ససేమిరా బిగుసుకు పోయింది
మాలలు ,మానినిలు,మాలినిలు,మత్తకోకిలలు ,
నే ఫేసుకి మేమా ? అని గుండ్రంగా తిప్పాయి
మత్తేభ సార్డులాలు మంజరీ ద్విపదలు
ఎం....త....దురాశ బతకాలని లేదా ? మిగేస్తయవి నిన్ను.
బుదోచ్చిం దా ? సమస్యా పురాణ అంటే నీకెంత పెద్ద సమస్యో ?
అందుకే అందరినీ మరుజన్మకు వాయిదా వేసి
పట్టువదలని విక్రమార్కుడిలా
అన్ని చదవడం మొదలుపెట్టా !
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి