Pages

24, జనవరి 2010, ఆదివారం

మీకు తెలుసా ?

శ్లోకం
జయంతి తే సుకృతి నో రస సిద్దా : కవీశ్వరా :
నాస్తి తేషాం యశ : కాయే జరా మరణజం భయం : " అన్నారు.
అంటే రససిద్ధులైన కవీంద్రులెప్పుడును లోకములో జీవించి యే ఉందురు .
వారి కీర్తి శరీరములకు జరామర ణాదుల వలన భయము లేదు. అని

21, జనవరి 2010, గురువారం

మీకు తెలుసా ?

శ్లోకం
ప్రారభ్యతే సఖలు విఘ్న భయేన నీచై :
ప్రారభ్య విఘ్న విహతా విరమంతి మధ్యా :
విఘ్నై : పున : పున : రపి ప్రతి హన్య మానా :
ప్రారబ్ధ ముత్తమజనా న పరిత్యజంతి . అన్నారు.
నీచ మానవులు , విఘ్నములు కలుగునను భయముచే పనులు ప్రారం భి పరు. మధ్యములు విఘ్నములు కలిగినచో ఆరం భిం చిన పనిని మధ్యలో మానివేయుదురు . ఉత్తములు ఎన్ని విఘ్నములు వచ్చినను భయపడక ఆరం భిం చిన పని పూర్తి చేయనిదే వదలరు. అని .

19, జనవరి 2010, మంగళవారం

ఇష్టం

నువ్వంటే .....నా.....కెంతో .....ఇష్టం ...
అందుకే ......నీ ....మనసుకి ....కలిగించను ....కష్టం.
ఈ ఇష్టానికి .....లేదొక .....అర్ధం ...
అనుకుంటే .....నీ ....మనసే ....వ్యర్ధం ....

18, జనవరి 2010, సోమవారం

మీకు తెలుసా ?

శ్లోకం
" కరాగ్రే వసతేలక్ష్మీ: కర మధ్యే సరస్వతీ
కరమూలేతు గోవింద: ప్రభాతే కరదర్సనం "
అన్నారు .అంటే ఉదయం లేవగానే అరచేయిని ఎందుకు చూసుకోవాలి ? ఎందుకంటే అరచేతి చివర లక్ష్మీ దేవి , మధ్య సరస్వతి ,మొదట గోవిం దుడు ఉంటారట అందువల ఉదయం లేవగానే అర చేయి చూసుకోవటం శ్రేష్టమట

అమెరికా

అమ్మని మరిపిం ఛి ఆలిని అం దలం ఎక్కిం చేదే అమెరికా
డాలర్లు కురిపిం ఛి డౌన్ లోడు కాకుండా నిలబెట్టే నిధి అమెరికా
అమ్మా నాన్నా అన్నా చెల్లి అనుబం దాలకతీత మైనదే అమెరికా
పుట్టిం టిని రెట్తిం చినసుఖ సౌఖ్యాల నందిం చే స్వేచ్చా విహంగం అమెరికా
ప్రకృతిలో పరవసించి నిత్య యవ్వనంగా నిల బెట్టగల్ నిధి అమెరికా
కొందరికి అంది చేదేక్కితే మరి కొందరికి అందని ద్రాక్ష అమెరికా

మనవలు

వన్నెల.....హరి...విల్లులు ....
నవ్వుల ....విరి....జల్లులు ...
పసిడి .....పువ్వుల ...రవ్వలు ...
మం చిముత్యాలు ....నా .....మనవలు.
వీరికి ....సాటి....లేరు....మరెవ్వరు ...

1, జనవరి 2010, శుక్రవారం

మనసులొ కురిసిన వెన్నెల: తడి నయనాలు

మనసులొ కురిసిన వెన్నెల: తడి నయనాలు
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase