తొల్లి జన్మల యందున్న దోష మేమొ
మాయ జూదము నందోడి జాయ తోడ
కాన లందుం డి యిడుముల కాల నేమి
పాండు తనయుల మించిన పాపు లెవరు ? "
29, ఏప్రిల్ 2012, ఆదివారం
" మహిళను దూషించు వాడు మాన్యుడు జగతిన్ ! "
అహరహము తగవు లాడుచు
గహనము గా పనులు చేసి గాసించు మదిన్ !
సహనము గోల్పోయి తుదకు
మహిళను దూషిం చు వాడు మాన్యుడు జగతిన్ !
గహనము గా పనులు చేసి గాసించు మదిన్ !
సహనము గోల్పోయి తుదకు
మహిళను దూషిం చు వాడు మాన్యుడు జగతిన్ !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
27, ఏప్రిల్ 2012, శుక్రవారం
" పాద రసమన్న తీయని పాన కమ్ము "
సోము నభిషేక మొనరించు సోమ ధార
బ్రహ్మ కడిగిన పాదాల భద్ర జలము
పరవ శమ్మున పులకించు భక్తి పద్య
పాద రసమన్న తీయని పాన కమ్ము !
బ్రహ్మ కడిగిన పాదాల భద్ర జలము
పరవ శమ్మున పులకించు భక్తి పద్య
పాద రసమన్న తీయని పాన కమ్ము !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
" పద్య రచన " [ చిత్రము నకు తగిన రీతి ]
సంధ్య వెలుగులం దమరెను సౌరు లెన్నొ
నీలి గగనంపు సొగసుల మేలి ముసుగు
గంగ సిందూర లేలేత రంగు తటము
కవుల హృదయాలు పులకించి కావ్య మలర
నీలి గగనంపు సొగసుల మేలి ముసుగు
గంగ సిందూర లేలేత రంగు తటము
కవుల హృదయాలు పులకించి కావ్య మలర
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
" సుగ్రీవుని యెడమ కాలు శునకము గఱచెన్ "
విగ్రహము చెంత నిలబడి
అగ్రజుని పిలువ పొరబడి హన్నా యనగా !
ఉగ్రత నొందుచు పరుగున
సుగ్రీవుని యెడమ కాలు శునకము గఱచెన్ !
అగ్రజుని పిలువ పొరబడి హన్నా యనగా !
ఉగ్రత నొందుచు పరుగున
సుగ్రీవుని యెడమ కాలు శునకము గఱచెన్ !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
26, ఏప్రిల్ 2012, గురువారం
" విపరీతపు బులుసు కూర విస్తరి మ్రిం గెన్ "
కపట ముని కన్ను గీటగ
చపలాక్షి బిలిచె నతడిని సాపాటున కై !
కుపితుడు వడ్డన చేయగ
విపరీతపు బులుసు కూర విస్తరి మ్రిం గెన్ !
------------------------------------------
అపురూప మైన విందుకు
నెప మెన్నక వెడలె యతడు నేర్పుగ తినగన్ !
జపియిం చె యన్న పూర్ణ ను
విపరీతపు బులుసు కూర విస్తరి మ్రిం గెన్ !
చపలాక్షి బిలిచె నతడిని సాపాటున కై !
కుపితుడు వడ్డన చేయగ
విపరీతపు బులుసు కూర విస్తరి మ్రిం గెన్ !
------------------------------------------
అపురూప మైన విందుకు
నెప మెన్నక వెడలె యతడు నేర్పుగ తినగన్ !
జపియిం చె యన్న పూర్ణ ను
విపరీతపు బులుసు కూర విస్తరి మ్రిం గెన్ !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
25, ఏప్రిల్ 2012, బుధవారం
" చేప చన్నులలో బాలు చెంబె డుం డె "
గొల్ల వాడిచ్చె గదయని నల్ల యావు
పసుపు కుంకుమ లలది నే భక్తి గాను
కుడితి త్రాగిం ఛి గోమాత కడుపు నిం డ
చేప చన్నుల లో బాలు చెంబె డుండె
పసుపు కుంకుమ లలది నే భక్తి గాను
కుడితి త్రాగిం ఛి గోమాత కడుపు నిం డ
చేప చన్నుల లో బాలు చెంబె డుండె
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
16, ఏప్రిల్ 2012, సోమవారం
" క్రాంతి యనగ కవుల కల్పన కద ! "
సూర్య చంద్రులనగ సొగసులు విరజిమ్ము
కనుల కింపు గాను కనగ శోభ
భ్రాంతి వీడి మదిని పరికించి శోధించ
క్రాంతి యనగ కవుల కల్పన కద !
కనుల కింపు గాను కనగ శోభ
భ్రాంతి వీడి మదిని పరికించి శోధించ
క్రాంతి యనగ కవుల కల్పన కద !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
11, ఏప్రిల్ 2012, బుధవారం
" కనరాని విశేషములను కవి గాంచు కదా ! "
మనమున పొంగిన భావము
దనుజులు దివిజులు గగనము తారా పదమున్ !
కనులకు విం దొన రించగ
కనరాని విశేషములను కవి గాంచు కదా !
దనుజులు దివిజులు గగనము తారా పదమున్ !
కనులకు విం దొన రించగ
కనరాని విశేషములను కవి గాంచు కదా !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
3, ఏప్రిల్ 2012, మంగళవారం
" పురుష గర్భమే సృష్టికి పుట్టినిల్లు "
నలువ జనియించె విష్ణువు నాభి నుండి
కడలి యందుండి ప్రభ వించె కల్ప తరువు
యాగ జలమున మాంధాత యవన సుతుడు
పురుష గర్భమే సృష్టికి పుట్టి నిల్లు !
కడలి యందుండి ప్రభ వించె కల్ప తరువు
యాగ జలమున మాంధాత యవన సుతుడు
పురుష గర్భమే సృష్టికి పుట్టి నిల్లు !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
2, ఏప్రిల్ 2012, సోమవారం
" రామ నామ మనిన రక్తి రాక్షసులకు "
రామ మహిమను దెలిసిన రావ ణుం డు
కోరి మరణించి తరియించ పోరు సలిపి
శాప నిష్క్ర్యతి కలిగించు పాప హరము
రామ నామ మనిన రక్తి రాక్షసులకు
కోరి మరణించి తరియించ పోరు సలిపి
శాప నిష్క్ర్యతి కలిగించు పాప హరము
రామ నామ మనిన రక్తి రాక్షసులకు
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "