Pages

28, జులై 2012, శనివారం

" వరలక్ష్మీ వ్రతము జేయ వలదంద్రు బుధుల్ ! "

ధరలో నోములు పూజల
తరుణుల కింపైన వ్రతము తరియిం చంగన్ !
స్థిర మైన భక్తి మరచిన
వరలక్ష్మీ వ్రతము జేయ వలదం ద్రు బుధుల్ !

22, జులై 2012, ఆదివారం

" పద్య రచన "

కప్పురపు విడెము గాంచిన
నొప్పుగ తినగోరు తపన నోరూరంగా
చప్పున కనబడె ప్రేయసి
తెప్పలుగ కురిసె మనమున తీయని కోర్కెల్ !

" పద్య రచన "

సప్త వర్ణముల్ విర జిమ్మె చక్క దనము
మబ్బు కన్నెల వలయాలు మనసు పడుచు
విపిన మందున తరువులు వేడ్క మీర
కాన రాకుండ క్రమ్మెను గగన మంత !

21, జులై 2012, శనివారం

ఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల ? "

కూడు బెట్టు మనకు కోట్లకు పడగెత్త
జనులు మెచ్చి తుదకు వనదిదాటి
తల్లి చెల్లి యనక తంటాలు పడియైన
ఆంగ్ల భాష యుండ నాంధ్ర మేల ? !

20, జులై 2012, శుక్రవారం

" పద్య రచన " " భగత్ సింగ్ "

దేశ దాస్యము తొలగించ దీక్ష బూని
ఊరికి సైతము వెఱవని ధీరు డతడు
భగత సింగను పుత్రుడు భాగ్య మనగ
భువన మంతట గరువంపు ముద్దు బిడ్డ !

" ముగిసె నాషాఢ మని యేడ్చే ముద్దు గుమ్మ "

విరిసె మదినిండ వలపులు వెల్లువగను
ఊ ర్ధ్వ లోకాల దేలుచు నూటి [ఊ టి ] కేగి
క్రొత్త జంటగ దిరిగిరి మత్తు గాను
ముగిసె నాషాఢ మని యేడ్చేముద్దు గుమ్మ !

తండ్రి నేర్పు విద్య తప్పు గాదె ! "

మంచి మాట వినక మాయ లందున దేలి
చేయి కాలి నంత చేత గాక
తండ్రి జెప్పినపుడు పెడచెవి నిడకుండ
తండ్రి నేర్పు విద్య తప్పు గాదె !

" మాట తప్పు వాడు మంచి వాడు ! "

కలసి యాడి పాడి కలలందు కరిగించి
మమత లెన్నొ పెంచి మాట మార్చి
మోస గించ లేక విసుగు నభినయిం ఛి
మాట తప్పు వాడు మంచి వాడు !

" తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల "

ఆధునిక మని యాతల్లు లంగ లార్చి
యితర దేశము లందున వెతలు దీరు
నమ్మ ప్రేమకు తాకట్టు మమ్మి యనగ
తల్లి బాసను రోసిరి పిల్ల లెల్ల !

10, జులై 2012, మంగళవారం

" పద్య రచన " " రూపాయి "

ధనమే జగతికి మూలము
జను లన్నము దినుట కైన చతురుని కైనన్ !
కనుగొనె రూప్యము నెవ్వడొ
మనుజుని ప్రాణమున కైన మనుగడ కైనన్ !
--------------------------------------------
డాలరు బడాయి పోకడ
చాలదు కొలువంగ నిలను చక్రికి నైనన్ !
రాలును రూప్యపు విలువకు
మేలగు సంస్కృతి మనదని మెప్పులు ధరలో !

8, జులై 2012, ఆదివారం

" పద్య రచన "

ముసి ముసి నగవుల సొగసులు
అసితోత్పల కనుల మెరుపు నాశలు దీర్చన్ !
మిస మిస బుగ్గల నిగ నిగ
దశ దిశ లకు వెలుగు నిచ్చు తన్మయ మొంద న్ !

" వంట జేయ లేని వాడు మగడ ?

అలసి వచ్చి యుంటి నాలస్యము గ నేను
లేశ మాత్ర మైన లేక రుషయు
కొలువు జేయ కున్న కోపించ లేదన
వంట జేయ లేనివాడు మగడ ?

" పద్య రచన "

తెల్లని మల్లెల పరిమళ
ముల్లము రంజించు నల ముముక్షువు కైనన్ !
మల్లియ మాలిక లన్నను
మల్లేశుడు ముదము జెంది మది పొం గారన్ !

5, జులై 2012, గురువారం

" పద్య రచన "

ఉదయమ్మున నీదు గుడికి
మది నిండుగ కొలువ నెంచి మంత్రమ్ము లచే !
కదలవు మెదలవు రాయివి
పదిలము గా మాదు బ్రతుకు పండించు మికన్ !

" సానిన్ గొల్చిన లభించు సంపద లెల్లన్ ! "

మానసమున పూజించెద
కానుక లేమీయ లేను కరుణించు ప్రభూ !
మానుము కినుక గిరినివా
సానిన్ గొల్చి న లభించు సంపద లెల్లన్ !

3, జులై 2012, మంగళవారం

" గురు పత్నిని గోరువాడె గుణ వంతుడగున్ ! "

గురువు నెడ భక్తి నిండుగ
పరి చర్యలు సలుపు చుండి పరమ ప్రీతిన్ !
సరియగు దక్షిణ నీయగ
గురు పత్నిని గోరువాడె గుణ వంతుడగున్ !

2, జులై 2012, సోమవారం

" పద్య రచన " కూలి వారి ఆర్తి "

మండెడు యెం డన మాడుచు
కండలు కరిగించు మనల కరుణిం చరుగా !
బండల గుండెలు వారివి
దండిగ దోచిరి ధనమద దైత్యు లట న్నన్ !

" పద్య రచన " విశ్వ కవి రవీంద్రుడు "

అన్ని కళలకు కాణాచి యంగి రసుడు
నెన్న లేని ఘనత యది మేరు నగము
విన్న విం చగ నాతడు విశ్వ కర్మ
విన్ను వెలుగంటు యశమది వేల్పు చెట్టు !

1, జులై 2012, ఆదివారం

" తులను పట్టు నెడల గలుగు సుఖము "

ఇంటి దీపము గద యి ల్లాలి సుగుణమ్ము
కంటి వెలుగు గాదె కన్న సంతు
మంచి ముత్యము వలె మాటను పలుకు హి
తులను పట్టు నెడల గలుగు సుఖము !

పద్య రచన "

చంద మామను బిలిచెను సంత సమున
చేత జిక్కించు కొన గోరి చేయి జూపి
గగన మందున్న చంద్రుడు కలత పడెను
చిన్ని పాపను తానెట్లు చేర గలడు ? !

" శస్త్ర సన్యాసమే మేలు క్షత్రియు లకు "

అస్త్ర శస్త్రము లనునవి నాత్మ విద్య
జగతి పాలించు ప్రభువుకు శాంతి పధము
శాంతి సౌఖ్యము లొన గూర్చ సాటి యేది
శస్త్ర సన్యాసమే మేలు క్షత్రియు లకు !
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase