Pages

22, ఆగస్టు 2012, బుధవారం

" పద్య రచన "

దశ రధ తనయుడు రాముడు
దశ కంఠుని తలలు గూల్చి దర్ప మడంచెన్ !
యశ మును బొందెను దశ దిశ
వశు డయ్యెను హనుమ భక్తి వాల్లభ్యమునన్ !

" రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్ ! "

పాముల గళమున దాల్చెడి
సోముడు భక్తికి వశుడట శోభలు గూర్చన్ !
ప్రేమగ గొలిచిన దైవము
రామునకున్ భక్తులు గద రాక్షలు లెల్లన్ !

13, ఆగస్టు 2012, సోమవారం

" నాకు నీకు మాకు మీకు మనకు "

నాది నాది యనక నారాయణుని పైన
కొంత యైన మదిని చింత లేక
స్వార్ధ బుద్ధి వీడ సౌఖ్యమ్ము కలుగును
నీకు నాకు మాకు మీకు మనకు !
--------------------------------------
నీకు నాకు పెండ్లి నిర్ణయ మెన్న డో
వాదు లాడ వలదు వలపు వీడి
కలసి మెలసి యున్న కలుగును సుఖములు
నాకు నీకు మాకు మీకు మనకు

4, ఆగస్టు 2012, శనివారం

" శ్రావణ మేఘములు గురియ సాగె సుమములన్ "

ఈ వనపు విరుల సొగసులు
భావజుని యెదను విరియు వాసంతములై !
రేవెలుగు శీత లములన
శ్రావణ మేఘములు గురియ సాగె సుమములన్ !
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase