బండ రాయని తెలిసియు బదులు రాక
గుండె నిండుగ నాశలు మెండు గాను
మండు టెండను నడచుట మరచి పోయి
కుంటి వాడెక్కె తిరుమల కొండ పైకి
......... ......... ........
.అర చేతను స్వర్గ ముందని
చెర బట్టుకు బడుగు జనుల చేకొని పోవన్
తెర పడదు కుటిలమున కర
మరలెఱుగని నియంతలు గన మాన్త్రికులేగా
[ దత్త పది = అర , చేర , తెర , మర ]
2 కామెంట్లు:
అరమర యేలరా? మదిని హాయిగ నన్గని కావ నీశ్వరా!
చెరచెర రాగదే కృపను? శ్రీకర సత్పద సేవఁ జేతునం
తె; రహి వహింతునయ్య!నిను తిన్నగ చేరుచు.దుష్టునైన నన్
మరలిచి; కావుమయ్య! శుభమార్గ ప్రదీపక! వేణు గోపకా!
దత్త పది " అర,చెర,తెర,మర. ఇది కంది శంకరయ్య " గారిచ్చినది
వేణు గోఫ మకుటం తో నీ పద్యం చాలా బాగుంది తమ్ముడు ఈ దీపికలొ గొప్ప పండితుని పూరణలు నా జన్మ ధన్య మైంది .
కామెంట్‌ను పోస్ట్ చేయండి