కలిమి యున్నంత కాలమ్ము కపటమైన ప్రేమ
చెలిమి చేయంగ వత్తురు చెరువు నిండ
బలిమి లేనట్టి తరుణమ్ము బదులు రాక
కలిమి యెడబాసి నప్పుడె కలుగు సుఖము
...... ....... ..... ........ ...........
చూపు కలిసి నంత చక్కన్ని చుక్కను
పెండ్లి యాడ గోరి పిచ్చినాకు
చూపు కలవకుండ చేపట్టె నొకచుక్క
సెంటి మెంటు చేసె సెటిలుమెంటు.
....... ......... ........ ..........
తండ్రి పేరు జెప్పి తనయుండు వెడలంగ
బలిమిలేదు గాని కలిమి గలదు
పైసలున్న చాలు పరమాత్మ దిగిరాడె
పేరు లేని వాడె పేర్మి గనెను
1 కామెంట్‌లు:
రాజేశ్వరి గారూ,
బాగుంది. మీరు పూరణలు ఇస్తున్నప్పుడు ముందు సమస్యను పేర్కొనండి. క్రింది విధంగా ...
సమస్య -
కలిమి యెడబాసినప్పుడే కలుగు సుఖము.
పూరణ -
కలిమి యున్నంత కాలమ్ము కపటమైన ప్రేమ
చెలిమి చేయంగ వత్తురు చెరువు నిండ
బలిమి లేనట్టి తరుణమ్ము బదులు రాక
కలిమి యెడబాసి నప్పుడె కలుగు సుఖము
కామెంట్‌ను పోస్ట్ చేయండి