14, జులై 2010, బుధవారం
వాన ముచ్చట్లు
దినమంతా దివాకరుని కోపాగ్నికి మాడిన భూమాత కరుణించిన వరుణదేవుని చల్లని చిరు జల్లులకి పులకించి పరవసించి వెద జల్లే కమ్మని పరిమళాలు ఏ పూలకైనా ఉంటే ఎంత బాగుండును ?ఆ మట్టి వాసన ఆశ్వాదించాలే తప్ప వర్ణనా తీతం .ఇక చిన్న నాటి అనుభవాలు వర్షంలొ తడుస్తు కాగితం పడవలు వేస్తు అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు తిట్టిన కొద్దీ మరింత పరుగులు పెడ్తు అదొక తీయని స్మృతి మరి ఓణీలు చీరలు నును సిగ్గుల దొంతరలు ఒలికిస్తు హైస్కూలుకి కాలేజీలకీ ఒకచేత్తో ఒయ్యారంగా పుస్త కాలు మరొక చేత్తొ కుచ్చెళ్ళు ఒడిసి పట్టుకుని ఎత్తెత్తి అడుగులు వేసుకుంటు తడిసిన బట్టల్లో దాచ లేని అందాలని విశ్వ ప్రయత్నం చేస్తు వాటిని కన్నులతో తాగే పురుష పుంగవులను తప్పించు కుంటు తడిసిన వాలు జడలను విరిసి సువాసనలను వెద జల్లే పూల దండలను సవరించు కుంటు వాలు చూపులు విసురుతు కించిత్ గర్వం గా హంస నడకలు .అదొక అందమైన అనుభూతి ఇక ఆఫీసులు ఉద్యోగాలు ఎక్కే బస్సు దిగే బస్సు ఇదే పరిస్తితి ఐనా కాస్త మోతాదు ఎక్కువ మరి శ్రీ వారితొ సినిమాకో షికారుకో స్కూటరు మీద వెళ్ళా మనుకోండి అప్పుడు " చిట పట చినుకులు పడుతూ ఉంటే " అన్నట్టు ఏముందీ ? బొత్తిగా శ్రీవారి భుజం మీద వొరిగి పోయి మన గతుకుల రోడ్ల పుణ్యమా అని మరింత అతుక్కు పోవడమే ఇల్లు జేరేసరికి ఏముంది ? ఆరిన బట్టలు మిగిలిన మధురమైన అనుభవాల అనుభూతులు ఇక కార్లొ వెళ్ళా మంకోండి మనం తడవక పోయినా తడిసి వెడుతున్న వాహనాలు పరుగులు పెడుతున్న జనాలు నీటిని తుడుస్తున్న వైఫర్లు వినిపించె సన్నని సంగీతం స్టీరింగు ముందున్న శ్రీ వారికి మరింత దగ్గరగా అతుక్కు పోయి చలి కాచు కోవడం ఇలా చెప్పుకుంటూ పోతే చదివే ఓపిక ఉండాలే గానీ తీయని భావ పరం పరలు కోకొల్లలు. ఏమో బాబు నాకైతే అన్నిటికన్న " స్కూటరు అనుభూతులే అత్యంత ప్రీతి కరం.
4 కామెంట్లు:
హైస్కూలుకి కాలేజీలకీ ఒకచేత్తో ఒయ్యారంగా పుస్త కాలు మరొక చేత్తొ కుచ్చెళ్ళు ఒడిసి పట్టుకుని ఎత్తెత్తి అడుగులు వేసుకుంటు తడిసిన బట్టల్లో దాచ లేని అందాలని విశ్వ ప్రయత్నం చేస్తు వాటిని కన్నులతో తాగే పురుష పుంగవులను తప్పించు కుంటు తడిసిన వాలు జడలను విరిసి సువాసనలను వెద జల్లే పూల దండలను సవరించు కుంటు వాలు చూపులు విసురుతు కించిత్ గర్వం గా హంస నడకలు
:)))
correcte
మీ వర్ణనలు బాగున్నై
అక్కా! నీలో ఇంతటి కథన నైపుణ్యమా! అయ్య్య్య్య బాబోయ్య్య్య్!
అమ్మాయిల అనుభూతులు బాగా చెప్పారండి .
కామెంట్‌ను పోస్ట్ చేయండి