" ఇదిగో లంచం తీసుకుని ఆ కిటుకేమిటో చెప్పవే నెమలీ "
కంద - గీత - గర్భ ఉll
ఓ నెమలీ! సఖీ! ఎటుల నోచి; మదీయుని; కృష్ణుఁ జేరి; శ్రీ
జ్ఞాన మతిన్ సదా చతుర! కామ్య ఫలంబును చక్క నందితో?
నీ నమనంబునన్ శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు. పో
నీనునినున్. కృపన్ తెలిపి నేర్పును గొల్పుము దివ్యుఁ జేరగా!
కll
నెమలీ! సఖీ! ఎటుల నో
చి; మదీయుని; కృష్ణుఁ జేరి; శ్రీ జ్ఞాన మతిన్.
నమనంబునన్ శిరము నే
ర్పుమెయిన్ దగఁ జేరినావు. పోనీనునినున్.
తే.గీll
ఎటుల నోచి; మదీయుని; కృష్ణుఁ జేరి;
చతుర! కామ్య ఫలంబును చక్క నంది
శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు.
తెలిపి నేర్పును గొల్పుము దివ్యుఁ జేర!
కంద - గీత - గర్భ ఉll
లంచము నిచ్చెదన్. కలుగు లాభము నిచ్చెద. గాంచుమమ్మ! బా
లంచు మదిన్; ననున్ వెలుగు లందును నీ కృప వెల్లు వైనచో
లంచము నిచ్చు నా హరియు లాస్యము సేయును. హాయిఁ గొల్పు చా
లంచననౌన్ గదా! శిఖిరొ! డంబము చాలును.చెప్పు మమ్మరో!
కllచము నిచ్చెదన్; కలుగు లా
భము నిచ్చెద; గాంచుమమ్మ! బాలంచు మదిన్.
చము నిచ్చు నా హరియు లా
స్యము సేయుచు ; హాయిఁ గొల్పు; చాలంచన నౌన్.
తే.గీll
కలుగు లాభము నిచ్చెద గాంచుమమ్మ!
వెలుగు లందును నీ కృప వెల్లువైన.
హరియు లాస్యము సేయును; హాయిఁ గొల్పు.
శిఖిరొ! డంబము చాలును. చెప్పవమ్మ!
జైశ్రీరాం.
జైహింద్.

1 కామెంట్‌లు:
నెమలేమి లంచ మడిగెనొ
కమనీయపు కిటుకు చెప్ప కవి వర్యుల కున్
తమ మానస ముప్పొంగగ
రమణీయపు కావ్యమిచ్చె నెమలి లంచమ్మనగా
కష్మించాలి ఇది చంధో బద్ధంగా గా లేక పోవచ్చును . ఊరికె కవిత లాంటిది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి