Pages

20, సెప్టెంబర్ 2010, సోమవారం

ప్రోమ్ [ PROM ]

అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. కాలేజీలో గానీ హైస్కూల్లో గానీ విధ్యార్దీ విద్యార్ధినులు కలిసి చేసే "బాల్ డ్యాన్స్". మన ఇండియాలో (హైదరాబాదు లాంటి చోట్ల) ఈ పద్ధతి ఉందో లేదో అంతగా తెలియదు గానీ కొన్ని కొన్ని పండుగల సందర్భాన్ని బట్టి క్లబ్బుల్లోను, బారుల్లోను ఈ డాన్సులు చేయడం పరిపాటి. 12వ (ట్వెల్త్) క్లాస్ చదువుతున్న మనవరాలు మనవడు "నానమ్మ! ఈ రోజు మా స్కూల్లో 'ప్రామ్' ఉంది వస్తావా?" అని అడిగారు. సరే! అదేమిటో సరదాగా చూద్దామని బయలుదేరాను. ఐతే ఈ కార్యక్రమానికి ముందుగా కొంచం చెప్పాలి.

అదేంటంటే... ఒక వారం పది రోజుల ముందు నుంచే ఇంట్లో పెద్ద హడావుడి. మనవడు మనవరాలు రోజు ఏదో ఒకటి షాపింగు. ప్రామ్కి ప్రత్యేకంగా సూటూ, బూటూ, టై ఇలా కొత్తవి కొనాలని మనవడు. పెద్ద గౌన్, మ్యాచింగు జ్యుయలరీ, తగిన చెప్పులు, బ్రేస్ లెట్టు కొనాలని మనవరాలు. ఇలా అన్ని ఇద్దరు కొన్నారు ఇక్కడ బంగారాలు అసలు ఊ..హు.. అస్సలు వాడరు. అవి ఇనప్పెట్టికే అంకితం. ఐతే ఇవన్ని ఎవరి స్థోమతుని బట్టి వారు కొనుక్కుంటారు. వీరి గౌన్లు వందల మీదే ఉంటాయి. ఆ ఒక్క రోజు కోసం ఎంతైన ఖర్చు పెడతారు. అబ్బాయిలు అమ్మాయికి టికెట్ కొనాలి ౬౦ ౭౦ ౮౦ -90 డాలర్లు ఉంటుంది. అమ్మాయిని అబ్బాయి ఆమె ఇంటికి వెళ్ళి తన కారులో గానీ లిమొ లో గానీ తీసుకుని స్కూలుకి వెళ్ళాలి.

అప్పుడు ఆమె చేతికి అతగాడు ఒక పువ్వు (బట్టతో చేసినది చాలా అందమైనవి ఉంటాయి) రాఖీ లాగా కడతాడు. అది ౩౦ ౪౦ -50 డాలర్లు ఉంటుంది (అందాన్ని బట్టి). అమ్మాయి అబ్బాయి కి ఒక పిన్ను కోటుకి పెడుతుంది. సరే అందరు కలిసి ఒక చోట జమ అవుతారు (అదే పిన్నలు పెద్దలు). అక్కడి నుంచి స్కూలుకి తమ తమ కార్లలో జేరాక ప్రిన్సిపాల్ అందరికి చెబుతాడు. ఏ హోటల్కి వెళ్ళాలి? ఎన్ని బస్సులు వెడుతున్నాయి?ఎంత వరకు ఉండాలి? అని అన్నీ చెబుతాడు. తర్వాత అందరు జతలు జతలుగ చేతులు పట్టుకుని ఒక పద్ధతి ప్రకారం లైను గా వెడుతుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

అప్పుడప్పుడే యవ్వనంలో అడుగిడుతున్న లేలేత వయసుల చిన్నారులు తెల్లటి దంతపు బొమ్మాల్లాంటి ఆడ పిల్లలు అదే రంగులో కలిసిపోతూ నల్లని సూటులొ మరింత అందంగా వెలిగి పోతున్న అబ్బాయిలు. కొంచం రంగు తగ్గినా ఆ డ్రస్సుల్లో సీతా కోక చిలుకల్లా కలువ కన్నెల్లా మెరిసి పోతు పార్ట్నర్ తో కలిసి వెడుతుంటే రెండు కళ్ళు చాలవనిపించింది (ముఖ్యం గా ఇక్కడ పిల్లలు చాలా అమాయకంగా, ఫ్రీ గా ఉన్నట్టుగా అనిపుస్తుంది. వారికి పిచ్చి ఆలోచన్లు కుళ్ళు స్వభావాలు ఉండవు చాలా ప్లైన్ గా ఉంటారు టీచర్లతో కూడా ఎంతో ఫ్రీగా ఫ్రండ్సు లాగ ఉంటారు). అలా వెళ్ళి వారి వారి బస్సుల్లో హోటల్కి చేరతారు. వారితో పాటు కొందరు టీచర్లు కుడా వెడతారు.అక్కడ వారికి కేటాయించిన టేబులు దగ్గర తింటు తాగుతూ జంటలు జంటలుగా డాన్సులు చేసి రాత్రి 12:00-1:00 గంట టైము కి మళ్ళీ స్కూలు దగ్గర దింపేస్తారు. ఇలా ఒక రోజు జూనియర్లకి మరొక రోజు సీనియర్లకి చూడముచ్చట గా ఉం టుం దన్న మాట మాట

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase