వలపు విరహాల సంకెల బిగుసు కొనగ
ముద్దు మురిపాలు పంచగ మంగ చెంత .
కొండ దిగి దిగి నడిరేయి గడచి యైన
నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు.!
----------------------------------
పెద్ద వయసున నేర్చిన విద్య లెపుడు
వమ్ము కాబోదు చదివిన వింత హాయి
వయసు బేధము లెదన విద్య కెపుడు
నవ్వి పోనిమ్ము లేదులే నాకు సిగ్గు
2 కామెంట్లు:
మొదటి పద్య భావం కళ్ళముందు కనపడుతుంది. వయసు పిలుపు చూపింది పూరణ నచ్చింది.
dhanya vaadamulu
కామెంట్‌ను పోస్ట్ చేయండి