మట్టి పెకలించ పెకలించ మణులు పుట్టు
తమసు తరిగించి తరిగించి తనరు వెలుగు
జలము మరుగంగ మరుగంగ జలద మలర
కట్టె మదియింప మదియింప గలుగు నిప్పు
28, మే 2011, శనివారం
23, మే 2011, సోమవారం
" బిడ్డ గన్న తల్లి గొడ్డు రాలు "
మంత్ర పటిమ వలన తంత్ర మొల్లని కుంతి
కవచ కుండ లముల గనెను సుతుని
గంగ లోన విడచి భంగ పడెను గాన
బిడ్డ గన్న తల్లి గొడ్డు రాలు .
కవచ కుండ లముల గనెను సుతుని
గంగ లోన విడచి భంగ పడెను గాన
బిడ్డ గన్న తల్లి గొడ్డు రాలు .
లేబుళ్లు:
" సమస్యా పూరణలు. "
21, మే 2011, శనివారం
" కవిని పెండ్లి యాడి కాంత వగచె "
మగని చెంత జేరి ముదముగ నా యింతి
తనదు కోర్కె తెలుప తెలివి గాను
కతలు కవిత లల్లి కలవర పరచగ
కవిని పెండ్లి యాడి కాంత వగచె !
తనదు కోర్కె తెలుప తెలివి గాను
కతలు కవిత లల్లి కలవర పరచగ
కవిని పెండ్లి యాడి కాంత వగచె !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "
5, మే 2011, గురువారం
" చీర విడిచి వెడలె జిగురు బోడి . "
భర్త మీద యలిగి పంతము గ నా యింతి
పట్టు చీర కొనగ గుట్టు గాను
పర్సు తెరిచి చూడ పైకమ్ము మరువగ
చీర విడిచి వెడలె జిగురు బోడి !
పట్టు చీర కొనగ గుట్టు గాను
పర్సు తెరిచి చూడ పైకమ్ము మరువగ
చీర విడిచి వెడలె జిగురు బోడి !
లేబుళ్లు:
" సమస్యా పూరణలు "