దినకరుని తనయు డా తడు
కినుక వహించిన జనులకు కీడులె కల్గున్ !
కనుగొని గ్రహ శాంతి నిడగ
శని పట్టిన వారల కగు సకల శుభమ్ముల్
------------------------------------------
కని విని యెరుగని రీతిగ
మనుజుల బాధించ గలడు మహిమల చేతన్ !
ఘనముగ శాంతిని జరిపిన
శని పట్టిన వారల కగు సకల శు భమ్ముల్ !
1 కామెంట్లు:
చీకటనేది సమస్య అయితే వెలుగే పరిష్కారం
అజ్ఞానం సమస్య జ్ఞానం పరిష్కారం
Nice " సమస్యా పూరణలు "
thanks for sharing
?!
కామెంట్‌ను పోస్ట్ చేయండి