Namaskaramu.Madam garu mee blog chaalaa chaalaa bagundi madam garu. Mee blog choosi anandam vesindi.
Madam garu recently i am conducted my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.
Madam garu please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your inspirational and valuable comment in english language.
శంకరాభరణము నుండి " సమస్య " అవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్ -------------------------------------------------- శివ నామము జపియించగ నవిరళ మగు భక్తితోన నానందించ న్నవనీతము వంటి మనము నవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్
రాజేశ్వరి మేడమ్ గారూ నమస్కారము. మేడమ్ గారూ ఇది నేను సేకరించిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారు (అన్నపూర్ణ) ప్రత్యేక తపాలా కవరు. ఈ ప్రత్యేక తపాలా కవరుని తూర్పు గోదావరి జిల్లా స్టాంపులు మరియు నాణేల సేకరణ కర్తల అసోసియేషన్ ఇటీవల జరిగిన సేకరణల ఎక్సిబిషన్ సందర్భముగా విడుదల చేసింది. ఈ కవరుని నేను నా భారతీయ సంస్కృతి బ్లాగులో షేర్ చేసాను. రాజేశ్వరి మేడమ్ గారూ ఈ పోస్టుని చూసి మీ కామెంట్స్ తెలుగులో ఇవ్వగలరు. అలాగే మీకు నా భారతీయ సంస్కృతి బ్లాగు కనుక నచ్చితే నా బ్లాగులో మెంబర్ గా జాయిన్ అవ్వగలరు అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చెయ్యగలరు.
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " అతడు శంభుఁడు మాధవుఁడై వెలుంగు -------------------------- నామ ములుపెక్కు లున్నను నాధు డొకడె శక్తి యుక్తులు గరపిన భుక్తి యొకటె ప్రాణు లన్నిట నాతడు త్రాణ యనగ అతడు శంభుఁడు మాధవుఁడై వెలుంగు
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " జారుల మాటలను వినని జాతి నశించున్ " ------------------------ చోరపు బుద్ధిని రావణు డారాముని జేతజిక్కి లంకను కూలెన్ ఔరా హితమును జెప్పెడి జారుల మాటలను వినని జాతి నశించున్
44 కామెంట్లు:
శ్రీ రాజేశ్వరి అక్కయ్య గారు మీ పద్యము చాలా బాగున్నది, పద్యములో టైపాటు భారమై , భరమై అని పడినది.
Respected Rajeswari Madam garu
Namaskaramu.Madam garu mee blog chaalaa chaalaa bagundi madam garu. Mee blog choosi anandam vesindi.
Madam garu recently i am conducted my Third Seminar on Indian Heritage and Culture. In this seminar i am sharing my collections relating to our culture and many children actively participated in my seminar and they cleared their doubts about our heritage through me.
http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html
Madam garu please look into my Third Seminar on Indian Heritage and Culture post and share your inspirational and valuable comment in english language.
సీతాపతినే కొలిచిన
నేతావున నున్నగాని నేతగ తానై
ఆతాటకి వధ చేయగ
పాతక నాశను డనుచు భక్తిగ బొగడన్
సుజనరంజని పద్యం - హృద్యం
శంకరయ్య గారి శంకరాభరణము నుండి
కైలాసము పైన శివుడు
బాలేందుడు తలను మెఱయు బార్వతి తోడన్
శైలపు జల్లదనంబున
నీలోకము లెల్లగాచు నిటలాక్షుం డై
సుజనరంజని వారి సమస్య "
ప్రియుడా రమ్మనెను తల్లి ప్రేమగ తనయున్ "
----------------------------------------
నయముగ జెప్పెను సుతునకు
జయమును సాధించ వలెను సాహస క్రీడన్
రయముగ బోవలె షణ్ముఖ
ప్రియుడా రమ్మనెను తల్లి ప్రేమగ తనయున్
లంక తంబాకు కొనెదము ఎంకి రావె
వంట జేయగ సీతను నింట విడచి
రచ్చ బండకు పోయిరా రామ నీవు
వచ్చెదము మేమిక మన రావణుని కలసి
సుజనరంజనివారి దత్తపది
" రామ , సీత , రావణ , లంక "
శంకరాభరణం నుండి
సమస్య " ఎవడో యెవ్వడొ యెవ్వడో యెవడొ తానెవ్వాడొకో యెవ్వడో "
----------------------------
కవనం బల్లెడి కావ్యకంఠ మునులన్ గాంచన్ ముదం బొందగా
దవనిన్ గాంచిన బంధముల్ తనయులున్ తండ్రైన దారైనచో
భవబంధ మ్ములు నాదినేననుచు సంబంధంబు సౌఖ్యం బహో
యెవడో యెవ్వడొ యెవ్వడో యెవడొ తానెవ్వాడొకో యెవ్వడో
శంకరాభరణము నుండి పద్య రచన
------------------------------------
కనులు మిరుమిట్లు గొలుపుచు కాంతు లీను
శంఖ చక్రమ్ము లిరువైపు జగతి గాచు
మణి మయమ్ముల మెండైన మహిమ గలుగు
నేడు కొండలు దాటిరా లేను నేను
సుజనరంజని వారి సమస్య
" క్రోధంబే సుగుణమగును కోమలి కెపుడున్ "
-----------------------------------------
బాధించు పగను పురుషుని
క్రోధంబే , సుగుణ మగును కోమలి కెపుడున్
బేధము లెంచక మృదువుగ
సాధించక చెలువు మీర సంతస మొందున్
సుజనరంజని వారి సమస్య
" తప్పులు జేసెడి మనుజుడె ధన్యుండిలలో "
--------------------------------------
నప్పును కలియుగ మందున
తప్పులు జేసెడి మనుజుడె ధన్యుండిలలో
జెప్పితి నలనాడు నలువకు
తప్పింపగ తరము గాదు ధర్మ మెవరికిన్
శంకరాభరణము నుండి
" అంశము " వాస్తు దోషము " నిషిద్ధాక్షరములు " శ, ష,స " " చందస్సు " ఆటవెలది
---------------------------------------
రమ్య హర్మ్య మందు రారాజు వలెనుండ
కోరు కొనుచు నొకడు భూరి గీము
పండి తుండు పలికె పదిలమ్ముగా లేదు
నమ్మి యుంటి వేని వమ్ము గాదు
-----------------------------------
పద్య రచన
--------------
ఆది శంకరు వలెనీవు యవత రించి
బూది నలదితి వీవయ్య మోద మలర
సంధ్య వార్చగ నీకెంత సంబ రమ్మొ
ముద్దు లిచ్చిన మాకంత ముదము పౌత్ర
శంకరాభరణము నుండి
సమస్య " అమ్మాయని పిలిచి నంత నాగ్రహ మందెన్
---------------------------------------
నెమ్మిని కోరగ నూర్వసి
అమ్మాయని పిలిచి నంత నాగ్రహ మందెన్
అమ్మవని తెలిపె పార్ధుడు
కమ్మని శపియించె పేడి గాసిలి మనమున్
శంకరాభరణము నుండి
దత్తపది " కాకి- జాజి- పాపి - వావి "
-----------------------------------
వావి వరుసలు లేకను పాపి వలెను
ఆశ్రమంబున నిలువగ యాజ్ఞ సేని
జాజి సుమమను బ్రమలోన మోజు బడగ
సమసి కూలెను కాకిలా సైంధ వుండు
శంకరాభరణము నుండి " సమస్య "
జయనామాబ్ధమున జయము సాధింతివా ? "
-----------------------------------------
రయమున వచ్చెను మన్మధ
పయనించగ జనుల నిచ్చ భగవత్ కృపచే
శయనించె మింట తారలు
జయనామాబ్ధమున జయము సాధింతివా ?
శంకరా భరణము నుండి " చిత్ర రచన "
----------------------------------------
అలిగితి వాసతి పైనను
వెలసితి వీలోయ లందు వేడుక పుట్టన్
కలియుగ మనితెలి సికొనుము
కలుగదు నీపైన జాలి కాళికి నైనన్
శంకరాభరణము నుండి
సమస్య " మత్తేభమునకు గణములు మసజస తతగల్
--------------------------------------------------------------
సొత్తగు సభరన మయవలు
మత్తేభమునకు గణములు, మసజస తతగల్
మత్తగు శార్దూల మునకట
పుత్తడి వంటిది తెలుగని పొంగుచు పలుకన్
శంకరాభరణము నుండి
" సమస్య " అవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్
--------------------------------------------------
శివ నామము జపియించగ
నవిరళ మగు భక్తితోన నానందించ
న్నవనీతము వంటి మనము
నవలీలగ మోక్ష మబ్బు నజ్ఞానమునన్
శంకరాభరణము నుండి
" దత్తపది .గుణము - తృణము - పణము - రణము
--------------------------------------------
గుణములు శకునికి మాయలు
తృణములు గావని తెలియక తొందర పాటున్
పణముగ బెట్టెను సకలము
రణమున గెలువంగ వేరు రక్షణ గలదే ?
శంకరాభరణము నుండి
" దత్తపది .గుణము - తృణము - పణము - రణము
--------------------------------------------
గుణములు శకునికి మాయలు
తృణములు గావని తెలియక తొందర పాటున్
పణముగ బెట్టెను సకలము
రణమున గెలువంగ వేరు రక్షణ గలదే ?
శంకరా భరణము నుండి
దత్త పది " అన్నము - కూర - పప్పు - చారు . "
------------------------------------------------
మాయ క్రీడను చేకూర మతిని వీడి
పణము సతినేల యనుతల పప్పు డైన
సభను కడు పరా భవమందె చారు శీలి
అన్న మురవైరి మొరవిని యాద రించె
శంకరాభరణము నుండి
సమస్య " చంద్ర వంశ్యుఁడు శ్రీరామ చంద్రుఁడు గద "
----------------------------------------
విష్ణు శాపవ శంబున వెలసె నరుడు
రఘు కులంబున జనియించి రాఘ వుండు
నొక్క వంశజు డననేల నిక్కము గను
నవత రించిన యవనిపై యాద్యు డతడు
చంద్ర వంశ్యుఁడు శ్రీరామ చంద్రుఁడు గద
శంకరాభరణము నుండి
సమస్య " వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశమంద జేయురా
-----------------------------------------------
రసధుని వంటిబ్లాగు మన లాక్షణికుండగు శంకరార్యులున్
విసుగను మాటలేకను గవేషణ జేయుచు పద్యకావ్యముల్
రసమయ వీధులందునను రాగము చిందుచు సంచరించగా
వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశమంద జేయురా
రాజేశ్వరి మేడమ్ గారూ నమస్కారము. మేడమ్ గారూ ఇది నేను సేకరించిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారు (అన్నపూర్ణ) ప్రత్యేక తపాలా కవరు. ఈ ప్రత్యేక తపాలా కవరుని తూర్పు గోదావరి జిల్లా స్టాంపులు మరియు నాణేల సేకరణ కర్తల అసోసియేషన్ ఇటీవల జరిగిన సేకరణల ఎక్సిబిషన్ సందర్భముగా విడుదల చేసింది. ఈ కవరుని నేను నా భారతీయ సంస్కృతి బ్లాగులో షేర్ చేసాను. రాజేశ్వరి మేడమ్ గారూ ఈ పోస్టుని చూసి మీ కామెంట్స్ తెలుగులో ఇవ్వగలరు. అలాగే మీకు నా భారతీయ సంస్కృతి బ్లాగు కనుక నచ్చితే నా బ్లాగులో మెంబర్ గా జాయిన్ అవ్వగలరు అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చెయ్యగలరు.
http://indian-heritage-and-culture.blogspot.in/2015/10/srimati-dokka-seethamma-garu-annapurna.html
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " అతడు శంభుఁడు మాధవుఁడై వెలుంగు
--------------------------
నామ ములుపెక్కు లున్నను నాధు డొకడె
శక్తి యుక్తులు గరపిన భుక్తి యొకటె
ప్రాణు లన్నిట నాతడు త్రాణ యనగ
అతడు శంభుఁడు మాధవుఁడై వెలుంగు
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య. " ర " పలకడం రాని విద్యార్ధి " " లావే యీశ్వల ములాలీ లక్షించు హలీ "
--------------------------------------
ఏవే దంబుప ఠించిన
భావము తెలియంగ లాదు భాషయు నసలే
బ్లోవుము మోదము నొందగ
లావే యీశ్వల ములాలీ లక్షించు హలీ
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్ "
--------------------------------------
ఉబ్బుచు తబ్బిబ్బ గుచును
డబ్బులలో మునిగి తేలి డంభము లందున్
గుబ్బలు విరుచుకు దిరిగిన
జబ్బలు దాఁ జఱచి యబ్బి జబ్బుల నుబ్బెన్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " 1.మత్తేభము 2. కందము
నవనీ తమ్మట రావణాసుర సుకన్యాసక్త చిత్తం బిలన్ "
నవనీతము రావణుని మనము స్త్రీల యెడన్
-------------------------------------
అవనిజ రాముని పత్నిగ
నవనీతము,రావణుని మనము స్త్రీల యెడన్
పవనము వీచిన జాలును
సవనము జేయుచును వెంట సరస మటంచున్
------------------------------------
అవనీ జాతయె పావనం బనుచు లోకంబం తశ్లా ఘించినన్
స్తవనీ యంబగు రామచం ద్రుమది లోసంతోష ముప్పొంగ గా
నవనీ తమ్మఁట,రావణాసురు సుకన్యా సక్త చిత్తంబిలన్
కవనం బల్లుచు కావ్య కన్నియల భోగాలం దునన్ దేలెడిన్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య "
బమ్మెర పోతన్న వ్రాసె వ్యాకరణమ్మున్ '
------------------------------------
ఇమ్ముగ భాగవ తమ్మును
బమ్మెర పోతన్న వ్రాసె , వ్యాకరణమ్మున్
నెమ్మిని స్కందుని దయగని
కమ్మగ పాణిని దెలిపెను కాక మటంచున్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " పురుషునకుం దాళిబొట్టు భూషణము సతీ "
----------------------------------
దురమందున వీరత్వము
పురుషునకుం,దాళిబొట్టు భూషణము సతీ
తరుణికి వరమట గళమున
పరపురుషుడు గాంచినంత భక్తిని మ్రొక్కున్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " అన్నను భర్తగాఁ గొనిన యన్యులమిన్న యదృష్ట రాశియౌ "
---------------------------------------------
వెన్నెల రాత్రులందు తన వేణువు నూదుచు మైకమం దునన్
కన్నెల గుండియల్ చెదరి కాంతుని సన్నిధి జేరగో పికల్
వెన్నుని ప్రీతిపా త్రమగు ప్రేయసి నెంచగ సంతసించు మా
యన్నను భర్తగాఁ గొనిన యన్యులమిన్న యదృష్ట రాశియౌ
-------------------------------- "
" అన్నను పతిగాఁ గొనెఁ జెలియ యదృష్టమునన్ "
కం.
మిన్నగ మనసుకు నచ్చిన
సన్నని చిరునగవు చాటు సరసము నందున్
వెన్నెల జల్లు విరియుగో
పన్నను పతిగాఁ గొనెఁ జెలియ యదృష్టమునన్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " " హారము కోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్ "
-------------------------------
తారకు వంటి రక్కసుల ధాత్రిని దారుణ ఘోర కృత్యముల్
భారమె యైననేమి బహు ప్రాపక మందున సాహసం బునన్
వీరులు గాదలంచి మది వేడుక నొందుచు దుష్టదైత్య సం
హారము కోసమై ప్రజ లహర్నిశముల్ కృషి చేయఁగాఁ దగున్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య . దత్తపది " అసి-కసి-నుసి-రసి "
----------------------------
అసితో త్పలముల కన్నులు
కసిరెను ప్రియభా షణముల కలహింపంగా
విసిరెను సిరిమల్లెల సొగసు
రసికత్వము విరిసె పుష్ప లావిక ముఖమున్
శంకరాభరణము నుండి.శ్రీ శంకరయ్యగారి సమస్య " మరుభూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్ "
------------------------------------------------"
సురలే మెచ్చగ శారదా సుతులు తాశోభిల్ల పాండిత్యమున్
వరమీ యంగది గంతముల్ వెలయు ప్రవాహంబు గాదే యిలన్
ధరణీ మాతయె ప్రీతిగా కవనముల్ తాదాత్మ్యమున్ చెందగా
మరుభూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్
----------------------------------------
కం.
శరనిధి గర్భము నందున
పరిమితమను మాట లేక పగడము లెన్నో
తరుణము వెదకెడి కవులకు
మరుభూమిని దొరకుగాదె మాణిక్యమ్ముల్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " కుంజరయూధమ్ము దోమ కుత్తుకఁ జొచ్చెన్ "
----------------------------------------
పంజరపు జంట చిలుకలు
రంజిల్లుచు పలికె నంట లౌల్యము తోడన్
మంజులము చోద్యము వినఁగ
కుంజర యూధమ్ము దోమ కుత్తుకఁ జొచ్చెన్
GAJALS
----------
నినుప్రేమగ పలకరించు నేస్తముంది నీలోనే
మధువుచిలుకు రసరమ్యపు భావముంది నీలోనే
కలలవంటి అలలపైన తేలియాడ వలదంటిని
కల్లలైన లోకంలో దొరకనంది నీలోనే
నమ్ముకున్న వారంతా నరలోకపు రక్కసులే
వమ్ముగాదు నామాటలు వెతకమంది నీలోనే
ప్రాణమిడిన పిల్లలైన త్రాణకాదు మనకెప్పుడు
కట్టుకున్న ప్రేమవిలువ మిగలనంది నీలోనే
ఈఒంటరి పయనంలో ఎవరికెవరు ఏమికారు
బ్రమలువీడి ధర్మనిరతి సాగమంది నీలోనే
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " రాముఁడు రాక్షసుండగును రాక్షస కాంతగ సీతయయ్యెడిన్ '
------------------------------------------------
"నీమము దప్ప కుండగను నేరము లెంచక రాక్షసాం గనల్
గోముగ జెప్పుచుం డిరట కోరిన వన్నియు మోదమం దగా
ప్రాపుగ సంతసం బునను రావణు చెంతను చేరి నంతనే
రాముఁడు రాక్షసుండగును రాక్షస కాంతగ సీతయయ్యెడిన్
శంకరాభరణము నుండి శ్రీ గరికపాటి వారి అవధానంలో పూరించిన సమస్య "
జుట్టును లేనివాఁడు తనజుట్టును దువ్వెను మాటిమాటికిన్ "
------------------------------------
పట్టిన పట్టువీ డకను బాగుగ నల్లని క్రాపుదు వ్వుచున్
గట్టిగ నూనెరాసు కొని కాంతుడు హేలగ వెక్కిరించగన్
వట్టిది గుండుగీ యగనె వాసిన గట్టిన కుండరీతిగా
జుట్టును లేనివాఁడు తన జుట్టును దువ్వెను మాటిమాటికిన్
------------------------------------
మరియు కం." జుట్టు లేనివాఁడు జుట్టు దువ్వె "
--------------------------------------
ఆలి లేని యింట నారిపోయిన వంట
ప్రేమ నిండు కున్న క్షేమ మేది
కలహ మందు భార్య గయ్యాళి కాకున్న
జుట్టు లేనివాడు జుట్టు దువ్వె
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " " వనము "
-----------------------
వనమున పూసిన సుమములు
వనమున శోభించు నంట వనదేవతకై
వనమున సంతస మొంధుచు
వనమున తమతల్లి యొడిని పరవశ మొందున్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " జారుల మాటలను వినని జాతి నశించున్ "
------------------------
చోరపు బుద్ధిని రావణు
డారాముని జేతజిక్కి లంకను కూలెన్
ఔరా హితమును జెప్పెడి
జారుల మాటలను వినని జాతి నశించున్
ఏరుల పారే సలిలము
తీరుల వ్యవహార భాష తీపొలికించున్ ,
మారి , ప్రజల భాషా పూ
జారుల మాటలను వినని జాతి నశించున్ .
ఏరుల పారే సలిలము
తీరుల వ్యవహార భాష తీపొలికించున్ ,
మారి , ప్రజల భాషా పూ
జారుల మాటలను వినని జాతి నశించున్ .
dhanya vaadamulu raajaa raavugaaru
కామెంట్‌ను పోస్ట్ చేయండి