మదిలోని ఊసులన్నీ మాటల అలలైన వేళ...
శంకరాభరణము నుండి .సమస్య " మధిరా పానమ్ము ముక్తి మార్గమ్ము కదా ! " -------------------------------------------ఎద మండెడి యడియాశల మధిరా పానమ్ము , ముక్తి మార్గమ్ము కదా వదలక శివ పాదమ్ముల సుధనే గ్రోలంగ మిగులు సోముని కృపయే
పద్య రచన అంశము " క్రికెట్టు " -----------------------------------జేసెడి పనులను వీడుచు మీసమ్ము లనుమెలి వేసి మీరిన బెట్టున్ రోసముగ క్రికెటు గెలిచిన భాసముగా ముదము నొంది పలువురు మెచ్చన్
శంకరాభరణము నుండి పద్య రచన .అంశము " గళ్ళ నుడికట్టు " ---------------------------------------మోదము నొందుచు మదికి వి నోదము కలిగించు నంట నూతనరీతిన్నాదము జేయుచు గడులను సాదరముగ నింపి నంత సంతస మొందన్
శంకరాభరణము నుండి సమస్య " హరియించున్ ఘన పాతకమ్ములను హత్యా ద్యూత చౌర్యమ్ములే "-----------------------------------------------పరమేశున్ భజియించగా మనసు భావా వేశముల్ వీడుచో హరియించున్ ఘన పాతకమ్ములను హత్యా ద్యూత చౌర్యమ్ములే పరిమార్చున్ కడదేరు నంత వరకున్ బాధించగా నుండవే వరదుం డానతియిచ్చి నంత తడవున్ భాసించి సౌఖ్యం బిడన్
శంకరాభరణం నుండి పద్య రచన " తెలుగు మహా సభలు " ---------------------------------------తొలిపలు కులుసభ యందున కలవరపడి మాతృ భాష కైమోడ్పు లనన్ తెలుగును వీడకు మెన్నడు వెలిగించును బ్రతుకు బాట వేలుపు లెపుడున్
శంకరాభరణము నుండి సమస్య " టీవీ లుండెనట మునికుటీరము లందున్ --------------------------------------------ఆవెనుకటి యుగము లములలో నీవేలే తలచితివని నేపిలు వంగన్ భావన మందసము లవలె టీవీ లుండెనట ముని కుటీరము లందున్
చాటువు మీసము పస మగమూతికి వాసము పస యిండ్లకెల్ల వనితల కెల్లన్ వేసము పస బంట్రౌతుకు గ్రాసము పస కుందవరపు కవి చౌడప్పా
శంకరాభరణము నుండి దత్తపది " పసి కసి రసి మసి " ------------------------------------రూపసి యగుసీతను గని పాపపు మసిమనసు తోడ బాధించె సతిన్ శాపము గాదని రసికత కోపము వలదంచు కసిరె కూరిమి నుండన్
శంకరాభరణము నుండిసమస్య " హరిని పూజింత్రు నాస్తికు లనవరతము ----------------------------------------------గొప్ప కొఱకని కొందరు కోరి కోరి హరిని పూజింత్రు నాస్తికు లనవరతము దైవ మన్నది చాందస భావ మనుచు యెదను భీతిగ పలుకును మోద మలర
Cheap Travel System
9 కామెంట్లు:
శంకరాభరణము నుండి .సమస్య
" మధిరా పానమ్ము ముక్తి మార్గమ్ము కదా ! "
-------------------------------------------
ఎద మండెడి యడియాశల
మధిరా పానమ్ము , ముక్తి మార్గమ్ము కదా
వదలక శివ పాదమ్ముల
సుధనే గ్రోలంగ మిగులు సోముని కృపయే
పద్య రచన అంశము " క్రికెట్టు "
-----------------------------------
జేసెడి పనులను వీడుచు
మీసమ్ము లనుమెలి వేసి మీరిన బెట్టున్
రోసముగ క్రికెటు గెలిచిన
భాసముగా ముదము నొంది పలువురు మెచ్చన్
శంకరాభరణము నుండి
పద్య రచన .అంశము " గళ్ళ నుడికట్టు "
---------------------------------------
మోదము నొందుచు మదికి వి
నోదము కలిగించు నంట నూతనరీతి
న్నాదము జేయుచు గడులను
సాదరముగ నింపి నంత సంతస మొందన్
శంకరాభరణము నుండి
సమస్య " హరియించున్ ఘన పాతకమ్ములను హత్యా ద్యూత చౌర్యమ్ములే "
-----------------------------------------------
పరమేశున్ భజియించగా మనసు భావా వేశముల్ వీడుచో
హరియించున్ ఘన పాతకమ్ములను హత్యా ద్యూత చౌర్యమ్ములే
పరిమార్చున్ కడదేరు నంత వరకున్ బాధించగా నుండవే
వరదుం డానతియిచ్చి నంత తడవున్ భాసించి సౌఖ్యం బిడన్
శంకరాభరణం నుండి
పద్య రచన " తెలుగు మహా సభలు "
---------------------------------------
తొలిపలు కులుసభ యందున
కలవరపడి మాతృ భాష కైమోడ్పు లనన్
తెలుగును వీడకు మెన్నడు
వెలిగించును బ్రతుకు బాట వేలుపు లెపుడున్
శంకరాభరణము నుండి
సమస్య " టీవీ లుండెనట మునికుటీరము లందున్
--------------------------------------------
ఆవెనుకటి యుగము లములలో
నీవేలే తలచితివని నేపిలు వంగన్
భావన మందసము లవలె
టీవీ లుండెనట ముని కుటీరము లందున్
చాటువు
మీసము పస మగమూతికి
వాసము పస యిండ్లకెల్ల వనితల కెల్లన్
వేసము పస బంట్రౌతుకు
గ్రాసము పస కుందవరపు కవి చౌడప్పా
శంకరాభరణము నుండి
దత్తపది " పసి కసి రసి మసి "
------------------------------------
రూపసి యగుసీతను గని
పాపపు మసిమనసు తోడ బాధించె సతిన్
శాపము గాదని రసికత
కోపము వలదంచు కసిరె కూరిమి నుండన్
శంకరాభరణము నుండి
సమస్య " హరిని పూజింత్రు నాస్తికు లనవరతము
----------------------------------------------
గొప్ప కొఱకని కొందరు కోరి కోరి
హరిని పూజింత్రు నాస్తికు లనవరతము
దైవ మన్నది చాందస భావ మనుచు
యెదను భీతిగ పలుకును మోద మలర
కామెంట్‌ను పోస్ట్ చేయండి