మంచి మంచి యన్న మనుగడ యేముంది
కంచి కేగునట్టి కతల కతన
వేంకటేశు డైన వినడు ముడుపులేక
ధనమె గొప్ప మంచి తనము కంటె
....... ......... .......................
.సమస్య " వేళ గాని వేళ బిలువ దగునె "
బాసు పిలిచె నంత బలిమిగ నిశిరాత్రి
వళ్ళు మండి భార్య గొళ్ళె మేసె
తిరిగి వచ్చి నంత తెరువదు తలుపెంత
వేళ గాని వేళ బిలువ దగునె ?
...... ......... ......
సమస్య " రాదా ఇటు రమ్మటంచు రాముడు పిలిచెన్ !
బంధించకె ప్రియ సఖి నను
సాధారణ దోషమునకు చంపెద వేలా ?
నాదగు హృదయము నీదిక
రాధా ఇటు రమ్మటంచు రాముడు పిలిచెన్
1 కామెంట్లు:
ధనము కలిగి జ్ఞాన ధనము లేకున్నచో;
మంచి యున్న గాని మనగ లేఁడు.
జ్ఞాని యుర్విపైన ఘనుడురా! సుజ్ఞాన
ధనమె గొప్ప మంచి తనము కంటె
నీదు భక్తి మెచ్చి నిత్యంబు రక్షింతు
నైన గాని పిలుతు వేని రాను.
భక్త! యర్థ రాత్రి పవ్వళించిన నేను.
వేళ గాని వేళ బిలువ దగునె ?
రాధా ఇటు రమ్మటంచు రాముడు పిలిచెన్.
( ఈ సమస్యను నేను శంకరాభరణంలో పూరించాను)
కామెంట్‌ను పోస్ట్ చేయండి