నాన్నమ్మ చచ్చి పోయిందని
బాబి గాడు బాగా ఏడ్చాడు
నాన్నమ్మ చచ్చి పోయి నందుక్కాదు
రాత్రికి తనెక్కడ పడుకోవాలని ?
-----------------------------
భార్య చని పోయినందుకు
బాధ గా లేదు
ఇక నుంచి ఒంటరి గా
ఎల్లా బ్రతకాలని ?
మదిలోని ఊసులన్నీ మాటల అలలైన వేళ...
9 కామెంట్‌లు:
ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://teluguwebmedia.in యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి praveensarma[at]teluguwebmedia.in అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
ఇట్లు నిర్వాహకులు
good thinking
శంకరాభరణము నుండి శ్రీశంకరయ్యగారి సమస్య " భగణంబందున నాస్తిరా గురువు విద్వాంసుల్ వినన్ జెప్పితిన్
-----------------------------------------
గగనం బంటిన కావ్యముల్ మనకు నేగంధర్వ పుణ్యంబహో
యుగమం తన్వెలు గొందుచుం డెనుమ హాయోగ్యం బటంచున్ ధరన్
భగవంతున్ కృపనొంది పల్కిరక టాభాగ్యం బుగాదో చినన్
భగణంబందున నాస్తిరా గురువు విద్వాంసుల్ వినం జెప్పితిన్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్ "
---------------------------------------------
భామల్ చెంతన జేరిమోద మలరింపంగన్ మదిన్ మైకమున్
సీమల్ నిండిన భారతీయ వనితల్ సేమంబు గాగంధముల్
క్రీముల్ వ్రాయగ సోయగంబ నుచుతా క్రేంకారమున్ జేయగన్
దోమల్ గుట్టిన రాత్రి జీవితము నిర్దోషంబు నారోగ్యమున్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ గారి సమస్య." నిదురించిన వాఁడు కీర్తినే గడి యించున్ "
----------------------------------
సదమల హృదయుడు జగతిని
దొరకుట సులభమ్ము గాదు దొరతన మందున్
పదవులు దక్కిన చాలని
నిదురించిన వాఁడు కీర్తినే గడియించున్
శంకరాభరణము నుండి శ్రీ పార్వతీశ శర్మగారి సమస్య " " మార్తాండుఁడు గ్రుంకె నదిగొ మధ్యాహన్నమునన్"
--------------------------------
కర్తవ్యము నెరవేర్చగ
మార్తాండుఁడు గ్రుంకె , నదిగొ మధ్యాహ్న మున
న్నార్తిగ పరుగిడె నపరకు
భర్తీ జేయగ తనవిధి భర్తగ తానై
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " తల్లికి మీసములు మొలిచెఁ దండ్రికి లేవే "
---------------------------------------
ఉల్లము క్షోభిత మొందగ
తల్లికి మీసములు మొలిచెఁ , దండ్రికి లేవే
చెల్లని మాటలు దేనికి
కల్లలు పలుకంగ వలదు కలత పడంగన్
శంకరాభరణము నుండి సమస్య " పాలను జూడంగ పిల్లి భయపడి పాఱెన్
----------------------------------------
కాలిన మూతిని తలచుకు
నాలుకతో తడుము కొనుచు నడయాడంగన్
వాలము భీతిగ ద్రిప్పుచు
పాలను జూడంగ పిల్లి భ్యపడి పాఱెన్
samkarabharaNamu numDi
ఉల్లము రంజిలు రీతిగ
మల్లియ తీగియకుఁ గలిగె మామిడి కాయల్
కల్లలు మెండగు యుగమిది
యెల్లెడలకు వింత వార్త యెరిగింప దగున్
కామెంట్‌ను పోస్ట్ చేయండి