Pages

29, నవంబర్ 2011, మంగళవారం

" తెలుగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్ "

" లక్కాకుల వెంకట రాజారావు గారి సమస్య "
---------------------------------------------

వెలయాలి వలపు వెంబడి
కులుకుచు పరుగిడిన భంగి కూరిమి తోడన్ !
తెలుగున విభవము తెలియక
తెలుగేలా ? యాంగ్ల భాష తియ్యగ నుండన్ !

7 కామెంట్‌లు:

Saahitya Abhimaani చెప్పారు...

తెలుగు భాషాభిమానం ఉండటం ఎంతైనా అవసరం. భాషాభిమానం అంటె వేరే భాషల మీద ముఖ్యంగా ఆంగ్ల భాష మీద విషం చిమ్మటమే అనుకుంటే అది పొరబాటు. ఆంగ్ల భాష ఇంతగా తెలుగునే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేకానేక భాషల్లో కలిసిపోయి ప్రభావం చూపిస్తున్నది. దీనికి కారణాలు అనేకం.మనం మన తెలుగును అభివృధ్ధి చేసుకోవటానికి ప్రయత్నించటంలో ఆంగ్లాన్ని తిట్టటమే మొదటి మెట్టుగా భావిస్తే ఆ ప్రయత్నాలు వికటిస్తాయే కాని సఫలీకృతం కావు.

Saahitya Abhimaani చెప్పారు...

చలం గారు అన్నట్టుగా వ్యావహారిక తెలుగు అంటే ఇలా వ్రాయాలి అని కొన్ని లెక్కలు వేసి చెప్పేవాళ్ళవల్ల ఆ వ్యావహారికం గ్రాంధికానికన్నా ఏమీ పెద్దగా బాగుపడలేదు. ఆయన తనదైన శైలిలో అద్భుతంగా వ్రాసి, తెలుగులో వ్రాయటం అంటే ఇలా ఉండాలి అని ఒక మార్గదర్శనం చేశారు.అప్పటివరకూ చందస్సు, సంధులు అనుకుంటూ కొలతలేసి వ్రాసేవాళ్ళంతా ఆయన ధాటికి తలలు వంచి పక్కకి తొలగిపొయ్యే పరిస్థితి ఏర్పడింది.ఎప్పుడైతే భాష కొలతల మధ్య నలుగుతుందో అప్పుడె ఆ భాష అభివృధ్ధి చెందటం కాదుకదా, సామాన్య ప్రజలకు దూరమయ్యి క్రమేణా కనుమరుగవ్వుతుంది. అటువంటి గతి తెలుగుకు పట్టకుండా చూసుకోవాలి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు .శివరామ ప్రసాద్ గారూ ! మీరింతగా స్పందించి నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్య వాదములు.
నిజమే ఒక పెద్ద వస్తువుని చూపించే టప్పుడు , మరొక చిన్న వస్తువుని కుడా చూపించాలి కదా ! " చిన్న గీత , పెద్ద గీతా లాగ .అందుకే ఒక భాషని పొగడ డానికి మరొక భాషని ఉపమానం గా చెప్పడం జరిగింది. అంత మాత్రానఏభాషాతక్కువని కాదు.
నిజానికి మన ప్రభంధ కవుల గ్రంధా లన్నీ సంస్కృత పరమైనవీ , ఛందో బద్ధ మైనవీ కదా ! అవి వెలుగు చూడాలంటే కొంతైనా తెలియాలి ! సామాన్యులకు దూర మౌతాయని అలాగే ఉంచేస్తే ఎలా ? ఇక పొతే నేను పోల్చింది " వెలయాలి వలపు తొ " అదేమీ తక్కువ కాదండి బాబు ! రాజ్యాలు , సామ్రాజ్యాలు , మునులు , కవులు , ఎందరు ? ఎం దరిని ఆకట్టుకుని చరిత్రలో నిలిపింది ? మరి గొప్పదే కదా ? కాదంటారా ? [ తమాషాకి మాత్రమె .క్షమించాలి ] మీ స్పందనకి మరొక మారు ధన్య వాదములు + కృతజ్ఞతలు

కమనీయం చెప్పారు...

దీన్ని కేవలం సాహితీ వినోదం గానే తీసుకోవాలి.ఇందులో పాల్గొనే వారెవ్వరూ ఇంగ్లిష్ కి వ్యతిరేకులు కాదు.తెలుగును కూడా ఆదరించమనే అందరి కోరిక. పై సమస్యకు నా పూరణ.

సులువుగ శాస్త్రముల జదువ
నలవి యగును గాదె ఆంగ్ల మందే యనుచున్
బలుకగ జక్కగ మరచిరి
తెలుగేలా యాంగ్ల భాష తీయగ నుండన్.
------------------

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
అవును దేనినీ కించ పరచె ఉద్దేశ్యం కాదు. నేను చెప్ప లేక పొయినా విషయాన్ని చక్కగా వివరించారు ధన్య వాదములు.

Saahitya Abhimaani చెప్పారు...

ఈ బ్లాగులో ఉన్న పూరణలో ఉన్న పోలిక బాగాలేక స్పంధించవలసి వచ్చింది. ఎంత వినోదమైనా విపరీతపు పోలికలు తేవటం ఎబ్బెట్తుగా ఉన్నది. . అలా చెయ్యటం వల్ల కొత్తగా తెలుగు మీద ప్రేమ అంకురించదని నా అభిప్రాయం.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
మీరన్నది నిజమే ఏదైనా అతి పనికి రాదుకదా . చక్కగా తెలియ జెప్పిఇకముందు పొరబడకుండా మంచి పని చేసారు ధన్య వాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase