Pages

9, నవంబర్ 2012, శుక్రవారం

481 కామెంట్‌లు:

«అన్నిటి కంటే పాతది   ‹పాతవి   481లో 201 – 400   కొత్తది»   సరి కొత్తది»
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" ఇతఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే "
-----------------------------------
కతలను జెప్పగ నాతడు
వెతలను పోగొట్టు నంట వేయి విధమ్ముల్
గతులను మార్చగ నిరతము
ఇతఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" ఇతఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే "
-----------------------------------
కతలను జెప్పగ నాతడు
వెతలను పోగొట్టు నంట వేయి విధమ్ముల్
గతులను మార్చగ నిరతము
ఇతఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
తోచె సమస్యల గణన చతుర్వింశతియై " [2400]
------------------------------------
"దాచిన కవనము లన్నియు
పూచిన మందారములయి పులకించ మదిన్
జూచిన గురువుల బ్లాగున
తోచె సమస్యల గణన చతుర్వింశతియై

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పద్య కవనం నుండి "ఎల్.ఎన్. ముర్తి గారి సమస్య
" తలరాతల భాష నెఱుగ తత్తర పడగా "
------------------------
పిలచిన పలుకని దైవము
కలతలు రేపుచు జనులకు కల్లొ లితమౌ
తలపుల మైకము నందున
తలరాతల భాష నెరుగ తత్తర పడగా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పద్య కవనం నుండి " ఎల్.ఎన్. మూర్తుగారి సమస్య "
" పూల తావు లంది ముదిత యేడ్చె "
-------------------------------------
విరహ వేద నందు వేవేల తలపులు
కొసరి కొసరి మనసు కోరి కోరి
అలసి సొలసి తుదకు కలుషిత మైపోయి
పూల తావు లంది ముదిత యేడ్చె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " న్యస్తాక్షరి
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా " ఏ-కా-ద-శి " ఉండవలెను
-------------------------------------
ఏడు గడయని ప్రీతిగ నెదను నమ్మి
కాల మంతయు స్వప్నమై కరగి పోయె
దశమి పూజలు విజయమై దిశను మార్చి
శివుని గొలిచిన నీవైన జిష్ణు వనుచు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
"దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మికన్ "
-----------------------------------------
ఎన్నగ చోద్యమంట నిది నెన్నడు గాంచని వింతయే యనన్
దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మికన్
మిన్నున మేఘముల్ విరిసె మేలగు వర్షము కుంభ వృష్టి యై
వెన్నయు క్షీరమున్ కుడువ వెన్నుని కేతగు ప్రీతి జెందగన్
-------------------------------------------------------
దున్న పాలు పిండ దుత్తఁ దెమ్ము
=================================
పిచ్చి ముదిరె నాకు ప్రేమించితిని గాని
తాళి చుట్టి నంత కేళి యనగ
వెన్న తినగ పాము మన్నుతిన్న టులుండె
దున్న పాలు పిండ దుత్తఁ దెమ్ము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" శుకయోగికి నల్లుడయ్యె సురనది కొడుకే "
--------------------------------
పికమది కాకికి సరసన
బకముండును హంస వోలె బహు సుందరమౌ
పికబకము లెవరి కెవరట
శుకయోగికి నల్లుఁడయ్యె సురనది కొడుకే

క్షమించాలి దీనికి ఏర్ధము లేదు .రాయాలని రాసాను అంతె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

samkaraabharaNamu numdi Sree Samkarayya gaari samasya .
" virasambagu rachana yoppe veenula vimdai "
--------------------------------------
పరుసము పైడిగ జేయుచు
మురిపించును ముదిత మనసు మోదం బందున్
సరసము వికటించిన తరి
విరసంబగు రచన యొప్పె వీనుల విందై.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ధౌమ్యుని హితోప దేశముల్ తనరి వినగ
అన్న ముచ్చటిం చినరీతి యాచ రించ
జావ డములేక సోదరుల్ సంత సమున
విరటు కొలువున జేరంగ జినుని పలుకు
-----------------------------------
జావడము = పిరికితనము, బేలతనము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ధౌమ్యుని హితోప దేశముల్ తనరి వినగ
అన్న ముచ్చటిం చినరీతి యాచ రించ
జావ డములేక సోదరుల్ సంత సమున
విరటు కొలువున జేరంగ జినుని పలుకు
-----------------------------------
జావడము = పిరికితనము, బేలతనము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ధౌమ్యుని హితోప దేశముల్ తనరి వినగ
అన్న ముచ్చటిం చినరీతి యాచ రించ
జావ డములేక సోదరుల్ సంత సమున
విరటు కొలువున జేరంగ జినుని పలుకు
-----------------------------------
జావడము = పిరికితనము, బేలతనము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ పోచిరాజు కామేశ్వర రావుగారి సమస్య
" కానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్ "
--------------------------------------------
వానలు లేవటంచు నిల వాకొను టేలనొ యజ్ఞయా గముల్
మానగ,పాడిపంట లిటు మౌనపు రోదన జేయుచుం డగన్
పానము జేయగా జలము వాగులు వంకలె యింకిపో యినన్
కానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అరయగ విరటుని కొలువున
ధర నేలెడి ప్రభువె యైన ధర్మజు డనగా
మురహరి కృపతో నాలుగు
చెరగుల మౌనము గనుండి శ్రేయము నొందెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi Sree Samkarayyagaari samasya
" patini sahOdara yanuchu bhavaaniye pilichen
----------------------------------------
కతికితె యతకదు మనువని
సతమత మాయెను సుదతులు సారూప్యము నన్
వెతలను మరచియె తారా
పతిని సహోదర ! యనుచు భవానియె పిలిచెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi Sree Samkarayyagaari samasya " bakshyamula naamudamutODa vamDa dagunu "
---------------------------------
నేతి గారెలు బూరెలు ప్రీతి గాను
నూనె వంటలు తినుటకు నోచు కొనగ
నీటి కూరలు నారలు పోటి పడిన
బక్ష్యముల నాముదముతోడ వండ దగును

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" కాంతకై తపింతురు వార్ధకమున మిగుల "
------------------------------
కనులు మూసి తెరువగనె కరిగి పోవు
ఆశ చావక బ్రతుకుపై క్లేశ పడుచు
తిరిగి రానట్టి యవ్వన తేరు సొగసు
కాంతకై తపింతురురు వార్ధకమున మిగుల

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ గుఱ్ఱం జనార్ధన రావుగారి సమస్య " మాధవుఁడే కీర్తి నందె మదనాంతకుఁడై "
---------------------------------
రాధా మాధవ ప్రణయము
గాధలుగా మిగిలి పోయె కలవర పడగన్
బాధించగ మదిని దలచి
మాధవుడే కీర్తి నందె మదనాంతకుడై

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మేలిమి బంగారము వలె
నీలపు టాకాశ మంత నెనరులు విరియన్
మాలిమి జేయుచు జనులకు
శూలిని మించిన కీర్తి శోభిల్ల దగున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య
" తాతా యని ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్ "
--------------------------------------
శీతల పానీ యమ్ములు
ప్రీతిగ గ్రోలంగ నెంచి భేషగు నంచున్
నేతలు కూడగ నొకదరి
తాతా యని ప్రేమతోడ తరుణిని బిలిచెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi Sree Samkarayya gaari samasya
" bhaaratamu vraasi vaalmeeki vaasi kekke "
భరత వంశపు రాజుల భవ్య చరిత
భారతము , వ్రాసి వాల్మీకి వాసి కెక్కె
రమ్య రసభరి తంబగు రామ చరిత
పూజ నీయులు మనపాలి తేజ మలర

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ తోపెల్ల సుబ్రమణ్య శర్మ గారి సమస్య
" జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కను ముక్తి కాంక్షతో "
---------------------------------------------
" దారులు మారిపో యినవి దారుణ సంస్కృతి తాండవిం చగా
మీరిన నాగరీ కమున మేలని కోర్కెల దాహమం దునన్
చోరులు మిన్నగా పెరిగి చోద్యమ నంగధ నాశతోడ పూ
జారులఁ జూచి భక్త జనసంఘము మ్రొక్కెను ముక్తి కాంక్షతో

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీమతి గుఱ్ఱం సీతాదేవిగారి సమస్య " ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే "
-------------------------------------
ఆహా యేమది చిత్రము
ద్రోహుల శిక్షించుట ఘనదోషము గాదే
ఈహా మృగముల చందము
సౌహార్ధము లోన ముంచి సంతస మొందన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

padya kavanam numDi
------------------------
పండిన రాజకీయ హిత వాదుల కోరిక తీరినంతనే
మెండుగ భారతా వనికి మేలగు మార్పులు సంతరించగన్
ఎండిన గడ్డియైన జయహే భరతావని యంచు పాడగా
పండుగ జేయుచుం డిరిల పావన గంగకు స్వేచ్చ యబ్బగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

స్వర్ణ యుగమని స్వాతంత్ర్య సంత సమున
వీణ తంత్రులు మీటిన వేడు కనుచు
దొరల పాలన త్రచ్చన దురిత ములను
మొదలు నరుకగ కూలెను మురియి దనుక

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుడు మెచ్చన్
---------------------------
సోముని చల్లని కిరణము
ప్రేమగ తనువంత ప్రాకి ప్రీతి నొసంగెన్
నీమము దాటక వెలుగుల
కాముఁడు వెన్నెలలు గురిసెఁ గంతుఁడు మెచ్చన్ శ్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" ఎలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచు "
--------------------------------
పిండి వంటలు భుజియించి మెండు గాను
మంది రమ్మున గణపతి మత్తు గాంచి
యల్ప ప్రాణిని నాకెట్లు సాధ్య మగును
నెలుక వడఁకె వినాయకుఁ డెక్కు ననుచు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ పూసపాటి సూర్యకుమార్ గారి సమస్య "
ద్రౌపది మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె
-------------------------------------------
పంచ పాండవు లకుభార్య పతివ్రత యన
ద్రౌపది , మెడలోఁ గృష్ణుఁడు తాళిఁ గట్టె
సత్య భామరుక్మిణి యను సతుల కపుడు
సురలు మెచ్చగ శుభమంచు వరము లిడగ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" గాజులు గల్లనఁగఁ గ్రీడి గాండివ మెత్తెన్ "
--------------------------------
సీజను మొదలయి నంతనె
తేజముతో నాడెదరట ధీరత్వము నన్
మోజున గెలుపును బొందగ
గాజులు గల్లనఁగఁ గ్రీడి గాండివ మెత్తెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య
" తాతా యని ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్ "
---------------------------
శీతల పానీ యమ్ములు
ప్రీతిగ గ్రోలంగ నెంచి భేషగు నంచున్
నేతలు కూడగ నొకదరి
తాతాయని ప్రేమతోడ తరుణినిఁ బిలిచెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ గుఱ్ఱం జనార్ధన రావుగారి సమస్య
" గురువా రమ్మని పిలువఁగఁ గుపితుండయ్యెన్
-------------------------------
పరిసరములు మైమరచియు
సరసమ్ముగ జూద మందు సారా కొట్టున్
నిరతము నెలవై యుండిన
గురువారమ్మని పిలువఁగఁ గుపితుండయ్యెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

జంకిన జీవిత మంతయు
శంకించు చుగడచి పోవు సౌఖ్యము లేకన్
కింకరు వలె భీతిల్లక
జింకను గని తత్క్షణమ్మె సింహము పారెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " బి,వి,వి,హెచ్,బి.ప్రసాద రావుగారి సమస్య "
----------------------------------------------
అక్కర లేనిదె మిక్కిలి
మక్కువ జూపించి నంత మాయగ దోచున్
ఎక్కువ తీపిని తినగను
చక్కెర చేదనుట విబుధ సమ్మతమె కదా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పదిలము పైటను మరువకు
మదినిండుగ మైకముండు వందన మిడుచున్
చెదరిన తగవే యిహమున
ముదితల కాలక్ష ణమ్ము ముప్పును దెచ్చున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi Sree gu~r~ram janaardhana raavugaari sanasya . " ramgani chee yaniri paamDu

చెంగున వేశ్యను జేరగ
పొంగెడు మదినిండ ప్రేమ పోటీ పడగన్
బంగరు పూవుల గొలిచెడి
రంగని ఛీ యనిరి పాండురంగని భక్తుల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " శ్రీ మతి గుఱ్ఱం సీతాదేవి గారి సమస్య " తద్దినమే శుభమిడునట తధ్యము సుమతీ "
------------------------------------------------
పెద్దలు జెప్పగ వింటిని
ముద్దుగ కన్నియలు చేరి మోజగు నాటల్
చద్దిని నూయల లూగిన
తద్దినమే శుభ మిడునట తధ్యము సుమ్మీ .


రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పద్య కవనం నుండి
-------------------------------------------
వలపుల బాటలందునను వాసిగ దేలుచు నాక మందునన్
కులుకుచు గాలి తేలుచును కోరిన రీతిగ మైక మొందగా
నలువ దిగాలుగా గనియె నాయకునిన్ సృజియించి వెంటనే
పలుకగ బోవ నెంచి మది భారము చెందగ చింత జేయుచున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi
----------------------
సంత సించగ పేదల సగటు బ్రతుకు
ధరలు తగ్గిన , జగమెల్లఁ దల్ల డిల్లె
దోచు కొనుచున్న సర్కారు దొరల కనగ
మోజు పెరిగెను ధనముపై రోజు రోజు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ గుఱ్ఱం జనార్ధన రావుగారి సమస్య
" సత్కార్యమ్ములె మన కపజయ కారణముల్ "
---------------------------------------
సత్కవులను సేవించిన
సత్కార్యమ్ములె , మన కపజయ కారణముల్
సత్కారము మాని బుధుల
చీత్కారము జేయ తగదు చేజేతులతో

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

rasadhuni vaari samasya " bEyani gouravimchiri kaveeSwarunin sabhalOna nellarun
-------------------------------
వ్రాయగ పద్య కావ్యములు పండితు లెల్లరు మెప్పు పొందగా
వోయని రాజరాజు లట భూరిగ కానుక లీయ మెండుగన్
శ్రేయము గోరుచున్ ప్రజల శేముషి కోరెడి ముఖ్యకారణం
బేయని గౌరవించిరి కవీశ్వరునిన్ సభలోన నెల్లరున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

padya kavanam numDi
జంపాలు పాడంగ వసంత మందున్
పంపా నదీతీర కపాల మాలిన్
నింపాది గాసేద గనేష రక్షన్
సంపాదనే లేకనె సౌఖ్య మబ్బున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

Rajeshwari Nedunuri వలపుల బాటలందునను వాసిగ దేలుచు నాక మందునన్
కులుకుచు గాలి తేలుచును కోరిన రీతిగ మైక మొందగా
నలువ దిగాలుగా గనియె నాయకునిన్ సృజియించి వెంటనే
పలుకగ బోవ నెంచి మది భారము చెందగ చింత జేయుచున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

dhanikomDa vaari samasya " maataku jUpe nagnatanu maaninitaa nabhivRddhi chemdagan "
------------------------------------------
జాతక రూపమున్ గనగ జానకి పొంగుచు సంతసం బునన్
ప్రీతిగ ముద్దులా డుచును వేయివర మ్ములపంటలౌ గదా
ఖ్యాతిని బొందగో రుచును కానన లందున రామ సంతతిన్
మాతకు జూపె నగ్నతను మానిని తా నభివృద్ధి చెందగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

PADYA KAVANAM VAARI SAMASYA " pati bOleDi patini gOru paDatuku kalarE "
----------------------------
కతలను జెప్పుచు నిరతము
నతి వినయము జూపు చుండి నటనలు చేయన్
పతితల వెంబడి తిరిగెడు
పతి బోలెడు పతిని గోరు పడతులు కలరే ?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi .Sree Samkarayya gaari samasya
------------------------------------
తొలగి చీకటి తెరలన్ని వెలుగు చిమ్మె
మత్తు వీడిన ప్రాణుల చిత్త మలర
పక్షి గణములు కిలకిల పరవ శించ
బాల భానుఁడు నేలపై పరుగు లెత్తె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi
ఘనముగ లక్ష్మిని కొలిచిన
మనమున కలుషితము వీడి మానవ సేవన్
వినయము నమమత పంచక
ధనలక్ష్మీ వ్రత మొసంగు దారిద్ర్యమునే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

sAMKARAABHARAnAMU NUMDI
----------------------
వీసె నూనెను త్రాగిన వెగటు బుట్టు
నేయి తినినంత వాంతులు నిశ్చ యమ్ము
కోరి తినినచో తీపిని మరల మరల
జిహ్వికకు పంచ దారయె చేదు గాదె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

samkaraabharanamu numdi
----------------------
నిండు పున్నమి వెన్నెల నిదుర రాక
వలపు మత్తున పొరబడి తలచె , తల్లి
తండ్రితో రతికేళినిఁ , దనయ కోరె
తాను తనపతి చెంతకు తనరు మదిని

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

Samkaraa bharaNam vaari samasya " palalammunu gOri chiluka phalamula rOsen
--------------------------
కొలిచెడి దైవము తల్లిని
పిలిచెద రటమమ్మి జేసి వెంగము లాడన్
త్తలచిన గుండెకు బరువై
పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ ప్రసన్న కుమారాచారి గారి సమస్య
" సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్ "
-------------------------------------------
నింగిని కోరిక లంటిన
భంగము వాటిల్లి నంత భాధలు పడగన్
ఖంగున దైవము దయగన
సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డిగారి సమస్య
" కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్ "
---------------------------------------
ధరణిని లెక్కలు వ్రాసెడి
గురువే యని తలచి భక్తి కొలిచెడి వారల్
వెరగున టక్కరి వాడగు
కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖ్మ్ముల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi Sree gu~r~raM janaardhana raavugaari samasya
" poDi yonarchu vaani bogaDa vaSame "
---------------------
ఎరుపు రంగు వచ్చి యెఱ్ఱగా వేగిన
మంచి కంది పప్పు కొంచ మైన
యెండు మిర్చి యుప్పు దండిగా జతజేసి
పొడి యొనర్చు వానిఁ బొగడ వశమె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " గుఱ్ఱం జనార్ధన రావుగారి సమస్య
" పట్ట పగలు వెన్నెలవిరిసెన్ " [ఛందో గోపనము ]
-----------------------------------
తెల్లని మబ్బుల పయనము
చల్లని మలయా నిలముల సౌరులు విరియ
న్నుల్లము రంజిలు రీతిగ
వెల్లువ గాపట్ట పగలు వెన్నెల విరిసెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

Samkaraa bharaNamu numDi
-----------------------
వరములు పొంద గోరుచును పండిత పామరులైన వారిలన్
సరసి జనాభుడో యనగ సామిని మించినసామి వైఖరిన్
తరువుల నీడ తీరుగను తాపసివోలె జపమ్ము జేయగన్
పరమ పదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

padya kavanam vaari samasya " kujana bhUshaNammu kUrchu mElu "
------------------------------
నమ్మ కమ్ము బెంచి నట్టేట ముంచెడి
మోస గాని కంటె క్లేశ మేది ?
తేనె పూయు కత్తి తీపికబురు లేల
కుజన భూష ణమ్ము కూర్చు మేలు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

aakaasa vaani vaari samasya " raala gaamcha jeevitaalu velugu '
--------------------------
వాలు గంటి చూపు వలవేసి పట్టంగ
సంత సించి మదిని సొంత మనకు
వెలది మనసు రాయి వేదన మిగులంగ
రాల గాంచ జీవితాలు వెలుగు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆకాశవాణి వారి సమస్య
'" అద్ది సువర్ణ మాలికయె యైనధనుల్ కొనరైరి గాయిటన్ "
-------------------------------------------
విద్దెల వెన్నినేర్చినను వేయివిధమ్ముల మెప్పుపొందినన్
ముద్దుగ ప్రేమవాం ఛలను మోదము నొందగ మొగ్గుజూ పుచున్
కొద్దిగ రాగద్వే షముల కోమల మైనర సానుభూ తుల
న్నద్ది సువర్ణ మాలికయె యైనధనుల్ కొనరైరి గాయిటన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

వాట్సప్ వారి చిత్రానికి "
---------------------
భండనము ధరియిం చకనిటు
యెండనబడి చెప్పు కుట్ట నేటికి వెలయౌ
బండల నడుమను బ్రతుకును
కండలు కరిగించి దుడ్డు గాదిలి ప్రజకున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కంద యాగం
------------
వీక్షిం చగలే రెవ్వరు
సాక్షము జెప్పంగ నింక సాటెవ రన్నన్
మోక్షం బీయగ మనకమ
లాక్షుండు గలడు మేటి లౌల్యం బందున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం లోని " మిట్టపెల్లి సాంబయ్యగారి సమస్య "
" వేంకట పతికి భామలు వేయి మంది "
--------------------------------
ఒక్క సతితోన వేగంగ నోర్వ లేక
మ్రొక్కు చుందురు జనులెల్ల ముక్తి కొఱకు
నెదను వైశాల్య మెంతేని పదిల పఱచె
వేంకట పతికి భామలు వేయి మంది

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం నుండి " ఒక అవధానంలో ఇచ్చిన సమస్య
" సవతిని గని సీత మిగుల సంతసమందెన్ "
--------------------------------
భవుని శిరమున గంగట
సవతిని గని, సీత మిగుల సంతస మందె
న్నవనిని మెచ్చగ తనపతి
హవనము నందైన గాని హాటక ప్రతిమన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి "శ్రీ మిట్టపల్లి సాంబయ్య గారి సమస్య "
" అమ్మాయని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్
----------------------------------
కమ్మని పాలను త్రాగిన
నెమ్మిని నీయొడిని మరచి నీమము లేకన్
పొమ్మిక యాశ్రమ మునకని
యమ్మా యని పిలువని సుతుఁ డతిపూజ్యుఁ డగున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్ "
--------------------------------------
సదమల హృదయము తోడను
చదువరులకు హాయి నిచ్చు చందనము వలెన్
పదుగురు దూషణ జేసెడి
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

rasadhunivaari pUraNa
మోతుబరు లేమి జేసిన
చేతలలో నలిగి నలిగి సేవలు జేయ
న్నూతము నిచ్చిన చాలును
జోతల నర్పింతు రంట జూల్ జలాల్

జూల్ జలాల్ = ఘనత గలవాడని , గౌరవనీయుడని, భగవంతుడని

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

Samkaraa bharaNamu numDi
--------------------------
ఆంగ్ల పదము బలుక నదలించు పంతులు
తెలుగు భాష వినగ తెగులు రాగ
బెత్త మెత్తి కొట్టి బెదిరించు గావున
బడి యనంగఁ బ్రజలు భయ పడుదురు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సూర్యుని రాక నెరుంగని
భార్యను సేవించు నట్టి భర్త తరించున్
కార్యా చరణము జేయగ
కార్యమ్ముల భర్త వోలె కాఫీ కలుపన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మక్కువ జూపగ జగతిని
మిక్కిలి సంతసము తోడ మీరిన ప్రేమ
న్నెక్కెను గరుడుని వేగమె
ముక్కోటికి సిద్ధ మీవ భూరి మురారీ !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో శ్రీ మద్దూరి రామమూర్తి గారి సమస్య " పద్యమ్మును వ్రాయువాఁడు పాతక మందున్ "
----------------------------------
హృద్యమగు చిత్ర సీమని
విద్యను చులకనగ జేసి వేదుఱు పనులన్
మధ్యము క్లబ్బులె నయమని
పద్యమ్మును వ్రాయువాఁడు పాతక మందున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...


రాజేశ్వరి నేదునూరిజనవరి 09, 2018 5:27 AM
జూద మాడెడి వారికి మోద మలరు
గెలుపు నోటము లన్నవి కీలక ములు
ఆస్తు లడుగంటి పోయిన పస్తు లున్న
తర్ష మదితీర దఁటత్రాగ ద్రాక్ష రసము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పదవులు పొందిన చాలదు
సదమల హృదయమ్ము తోన సంతస మొప్పన్
పదుగురి క్షేమము గోరుచు
చదువుకు వినయమ్ము నీయ సంస్కార మగున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

దివిలో దేవత లందరు
భువిలో లేనట్టి వింత భోగము లందున్
చవిగొని సరసము లాడుచు
కవితలలో లేని తలఁపు కైతల కెక్కెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆట వెలది
-----------
గురువు లేని విద్య గుడ్డివిద్య గనెంచి
వరమ టంచు కొలువ పరమ భక్తి
నిహము పరమ నంగ నిష్టతో నేర్పును
గరళ కంఠు కన్న గురువు మిన్న
--------------------------
తేట గీతి
-----------
తెలుగు టీచరు క్లాసన్న వెలుగు మనసు
పద్య మనగను పాడును హృద్య ముగను
పలుకు నేర్పెడి గురువంట నలువ రాణి
పొంగి పోవును మదినిండ నింగి వరకు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నీచపు మాటల చంపుచు
దాచిన ద్వేషమ్ము నంత ధాటిగ విసరన్
తోచని మంచే కానక
కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi
-------------------
దూర దేశము పోయెడి దుహిత గాంచి
హితము కోరుచు మదినిండ సంత సమున
బంధ మెడబాసి మనలేక బహుళ ప్రీతి
దు:ఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu నుండి
----------------
నిద్దుర మానిమీ రినసు నీతము నందున కల్లలాడ కన్
బుద్ధిగ పూజలన్ కొలిచి భూరిగ తన్మయ మొందుచున్ మదిన్
వద్దన కుండగన్ పరమ భక్తిని వేడుచు ప్రీతిగొల్పి నన్
తద్దినమే శుభంబు లిడు ధారుణి లోని జనాళి కెప్పుడున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ధర్మము నొకపా దమునను
మర్మము తోనడచు చుండ మంచియె కరువై
నోర్మిని లేనట్టి జనులకు
దుర్మార్గము గాదు గురుల దూషించినచో

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

Chamdassu numDi .dhanikomDa vaari samasya
-----------------------------------------
నారద మౌనివే గమున నాకము నందున దేవతా గణం
బేదరి నుంటిరో యనుచు భీతిగ నూహను గాంచినం తనే
సాదర మందునన్ నలువ చక్కగ నవ్వెను మైకమం దునన్
శారద మధ్యమున్ గొనుచు జక్కని కైతల బల్కుచుండెడిన

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చుక్కను మించిన యందము
మక్కువ పెండ్లాడి నాడ మానిని నిన్నే
నిక్కము దరిజే రగరమ
ణక్కా యిటు రమ్మని మగఁడాలిని బిలిచెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవునుకదా మర్చిపోయాను . ధన్య వాదములు GPS . గారు
---------------------------
దారులు వెదకుచు నెగిరెను
నీరముపై నున్నకలువల నేత్రము లన్నీ
ద్వారము ముంగిట గలమం
దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

దారులు వెదకుచు నెగిరెను
నీరముపై గల కలువల నేత్రము లెల్లన్
ద్వారము ముంగిట గలమం
దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

samkaraabharaNamu numDi
చిత్రమ్మే సుతులన్ గనంగ సుఖమే జేగంట మ్రోగించినన్
శత్రుత్వ మ్మనగన్ దలంచ వలదే చాలంగ డాలర్లకై
మిత్రత్వమ్ముగపో వనెంచి మురిపెం బేపెద్ద లేమెచ్చగన్
పుత్రోత్సాహము పొంగి పొర్లు గదరా పోఁగాలమే వచ్చినన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశ వాణి వారి సమస్య
" రాలను పూలు పూచినవి రమ్య సుగంధములన్ వెలార్చు చున్ "
-----------------------------------------
వేలుపు లందరున్ గలసి వేదిక నొక్కటి నిల్పగా దివిన్
చేలము లేధరిం చగను చేడియ లెల్లరు చేటుగా మదిన్
మేలము లాడుచున్ తుదకు మీరిన షోకుల వన్నెగత్తె లౌ
రాలను పూలు పూచినవి రమ్య సుగంధములన్ వెలార్చు చున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ " గుఱ్ఱం జనార్ధన రావు గారి సమస్య "
" ' సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ "
----------------------------------------------
కంసారిన్ భజియింప గోరిన మదిన్ కల్లోలమే నిండగా
హింసావా దమునం దుఘోర కలియౌ హీనంబు గాభీతి లన్
మాంసాహా రముకో సమంచు మనగో మాతన్ వధించంగ నే
సంసారుల్ గనలేని చింత యెపుడున్ సన్యాసికే సొంతమౌ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

రగిలే మోహము నందున
వగలా డినివెంబ డించి వాంఛిత మందున్
గగనపు కోర్కెలు నిండగ
జగమెరిగిన బ్రామ్మణునకు జందెం బేలా ?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

wari Nedunuri
9:04 AM (1 hour ago)
to padyamairhyd
పచ్చని సోయగం బులను పంచగ కోరుచు పారవశ్య మున్
వచ్చెను గాది పర్వమిల , భాద్రపదాన చిగుళ్ళు వేయగన్
నచ్చెన టంచుగౌరి సుతు డాడుచు వేడుక మీరగా మదిన్
మెచ్చగ పిండి వంటలను మిక్కిలి ప్రీతిగ నారగించ గన్
aakaaSavaaNi vaari pUraNa

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చవులూ రించెడి కవితలు
నవనీతపు పలుకు లందు వ్రాయుట ఘనమౌ
రవిగాంచని తావు లైనను
కవిగాంచు నటంచు తెల్పి గణుతించు రుగా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తే.గీ .
తపము జేయగ పార్వతి తనరి మదిని
శివుడు పెండ్లాడె, చక్కని సీత నపుడు
ధనువు విరిచిన మోదము ధరను నిండ
మౌని యాజ్ఞను తలదాల్చి మనువు నొప్పు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవిరళముగ కవనమ్ములు
సవివరముగ తెలిపె నంట సంతస మొప్పన్
కవులం దరిలో మిన్నగ
రవి చెప్పెను విష్ణు కధలు రంజిల్ల జనుల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " BVVHB . ప్రసాద రావుగారి
" సమస్య " జూద్ మాడు వారు సుజన వరులు "
---------------------------------
ఈతి బాధ లందు నీతిని మరువంగ
మదిని శాంత పరచి నటన చేయ
జాయ సుతుల తోన సంతసిం చగలేక
జూద మాడు వారు సుజన వరులు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " BVVHB . ప్రసాద రావుగారి
" సమస్య " జూద్ మాడు వారు సుజన వరులు "
---------------------------------
ఈతి బాధ లందు నీతిని మరువంగ
మదిని శాంత పరచి నటన చేయ
జాయ సుతుల తోన సంతసిం చగలేక
జూద మాడు వారు సుజన వరులు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆకాశవాణి వారి సమస్య " మేదిని మండనమ్ములగు మెండుగ నిండుగ మండు టెండలే "
-------------------------------------
కాదను వారలెవ్వరట కాంచన సౌరుల కల్పవృక్షముల్
గాదెలు నిండగా సిరులు కాకలు దీరిన భూపతుల్ గనన్
గాదిలి ధారుణీ సతిని గాంచగ చుంబన పారవశ్యమున్
మేదిని మండనమ్ము లగు మెండుగ నిండుగ మండు టెండలే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శనివారం [9.3.18.] న ఆకాశవాణివారు చదివిన సమస్య " వచ్చె నుగాది పర్వమిల, భాద్రపదాన చిగుళ్ళు వేయగన్ "
-------------------------------------
పచ్చని సోయగం బులను పంచగ కోరుచు పారవశ్య మున్
వచ్చెను గాది పర్వమిల , భాద్రపదాన చిగుళ్ళు వేయగన్
నచ్చెన టంచుగౌరి సుతు డాడుచు వేడుక మీరగా మదిన్
మెచ్చగ పిండి వంటలను మిక్కిలి ప్రీతిగ నారగించ గన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi
సొగసులు చిందు మేఘములు చుక్కల మించెడి నట్టి యందమున్
యుగముల నుండిమారని శుభోదయ వేళల నాకశంబులో
నగణిత రూపముల్వెలయు నాజుకు బొమ్మల సృష్టి జేయగా
గగనము నందు చేఁప కడు గంతులు వేసెను చిత్ర మెట్లగున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi
--------------------------
స్నిగ్ధ సుమనోహరం బగు సీత మదిని
యడవి కేగెడు సమయాన కడలి మించు
ఘోరోత్తుంగ తరంగ ఘోష యనగ
దుగ్ధ సాగరమున రేగె దుమ్ము లెన్నొ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి సమస్య
" చంద్రుని గాంచి యేడ్చెఁ గంజాత హితుడు
---------------------------
తారల నడుమ సరసంపు ధన్య జీవి
వలపు వెన్నెల వెలుగుల కులుకు మదిని
కలువ భామల కౌగిలి కరుగు నట్టి
చంద్రునిం గాంచి యేడ్చెఁ గంజాత హితుడు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
గజలుమహలు తోటలోన తిరగాలని ఉన్నదిలే
పూలబాల లందరినీ కలవాలని ఉన్నదిలే

పరిమళాల సోయగాలు కనువిందులు చేయునంట
మదిమురిసిన మైకములో ఆడాలని ఉన్నదిలే

కలలువిరిగి కడలిలోన అలలందున కలిసిపోయె
గగనమంత మిన్నువిల్లు విరియాలని ఉన్నదిలే

మంచిమనసు తోనజనులు మేలుకోరి కృషిజేస్తె
జగతినిండ నందనవని పూయాలని ఉన్నదిలే

యెదనుపొంగు ఊహలన్ని పదిలముగా మూటగట్టి
కుమ్మరించి వనమందున మిగలాలని ఉన్నదిలే
-----------------------------------------
లక్ష్మీ ఈ గజల్ చూడు బాగుంటే పొస్ట్ చేస్తాను
మళ్ళీ మొదలు పెట్టరుగా .










రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi
మితిమీరు సరసమున రఘు
పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్
జతకూడె ననిమురి పెమున
వెతలను మైమరచి తాను వేడుక నొందెన్
-------------------

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కన్నులు లేనివాడు కనగల్గెను లోకము కన్ను విందుగన్ [ఆకాశ వాణి వారి సమస్య }
---------------------------------------
మిన్నుల నంటు సౌఖ్యములు మెండుగ ధాత్రిని చిందు లేయగా
వన్నెల చిన్నెలం దునను వారిజ నేత్రులు తాండవిం చుచో
సన్నని భావముల్ మదిని చక్కిలి గింతల ముంచి తేల్చగన్
కన్నులు లేనివాడు కనగల్గెను లోకము కన్నువిం దుగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య
" చైనాలో తెలుగు నేర్చి చక్కగ బ్రతికెన్ "
-------------------------------

ఐనా యెందుకు తొందర
వైనము తెలియని పలుకులు వ్యర్ధము గాదా
వీనుల విందగు భాషని
చైనాలో తెలుగుఁ నేర్చి చక్కగ బ్రదికెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పద్య కవనం వారి సమస్య
" పలుకుల మరలేని వాడు పరమాత్ముండే "
--------------------------------
వలపుల కోయిల బిలిచిన
సలలిత ముగచెంత జేరి సంతస ,మొందన్
ఫలితము గగనం బంటిన
పలుకుల మరలేని వాడు పరమాత్ముండే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

GAJAL
గగనానికి నిచ్చెనలే వేయలేరు ఎవరైనా
మగువమనసు భావాలను కొలవలేరు ఎవరైనా

వినువీధుల విహరించెడి అందమైన హరివిల్లును
చిత్రగుప్త కుంచెతోన గీయలేరు ఎవరైనా

వలపువలల చిక్కుముడిని విప్పలేరు ఎన్నటికీ
కడవరకూ కలతబడుతు నిలువలేరు ఎవరైనా

నాదినాది అనుకొంటూ నరకమందు మునుగుటేల
భగవంతుని వినోదమని తెలియలేరు ఎవరైనా

కర్మఫలము తెలుసుకొన్న కాచునేమొ దైవమంట
అదితెలియని మానవులే చేరలేరు ఎవరైనా
-------------------------------



రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" మల్లియ తీవియకుఁ గాసె మామిడి కాయల్ "
---------------------------------
తెల్లని మల్లెలు విరిసెను
మల్లియ తీవియకుఁ , గాసె మామిడి కాయల్
వెల్లువగ మురిసి తోటను
కల్లయె గాదంచు కులికె గర్వము తోడన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఇంకేమి వింతలుం డునొ
సంకర జాతులు పుట్టు సంబర మందున్
వంకర టింకర యుగమిది
వంకాయన చెఱకు రసము వడివడిఁ యుబికెన్
sujanaranjani vaari samasya

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " గుఱ్ఱం సీతాదేవి గారి సమస్య
" వడియము లెండెను విడువని వానల లోనన్ "
--------------------------
గడియ కొకచినుకు చొప్పున
దడదడ పడినంత నేల తడియా రకనే
వడివడి గద్యుమణి వెలుగగ
వడియము లెండెను విడువని వానల లోనన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " గుఱ్ఱం సీతాదేవి గారి సమస్య "
" వడియము లెల్ల నెండినవి, వాన లవారిత రీతిగాఁ బడన్ . "
------------------------------------------
వడలను వండి వేడిగ విభావరి యందున జంట గాతినన్
దడదడ వాన కోయిల లుదారుల వెంబడి బారు తీయగా
గడబిడ లేక యుల్లము నకారణ మెంచక వేడి గాలికిన్
వడియము లెల్ల నెండినవి , వాన లవారిత రీతిగాఁ బడన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" ద్రౌపది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి "
------------------------------
కన్ను గానని మదమేమొ మిన్ను ముట్టె
దుస్స సేనుడు సభలోన దుష్టు డగుచు
ద్రౌపది వలువ లూడ్చెఁ , దత్సభఁ గిరీటి
సిగ్గు జెందిన భ్రాతలు శిరము లొంచె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" చెడు వానిన్ గొల్వ దీరు చిరు కామ్యంబుల్ "
--------------------------------
ఇడుముల పాలౌట నిజము
చెడు వానిన్ గొల్వఁ , దీరు చిర కామ్యంబుల్
పడిగాపులు బడి కొలిచిన
గుడి ముంగిట సాగిల బడ గోవిందునకున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" ఒక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె
-------------------------------
ధర్మ సంస్ఠాప నార్ధమై తనరు మదిని
రక్క సులజంపి జగతిని రక్ష జేసి
దేవ లోకము మించిన దైవ మనగ
ఒక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆకాశవాణి వారి సమస్య
" పగలే వెన్నెల నాట్యమాడ విరిసెన్ పర్వమ్ము లెన్నో మహిన్ "
----------------------------------------
సగమౌ మేనున సోయగంబు లెటులౌ సంతోషమున్ పొందగా
గగనం బంటిన వెండికొండ నెలవై గంధర్వ గానంబులున్
రగిలే కోర్కెల రాగమా లికల సారాంసంబు నేమందువో
పగలే వెన్నెల నాట్యమాడ విరిసెన్ పర్వమ్ము లెన్నో మహిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆకాశవాణి వారి సమస్య
" పగలే వెన్నెల నాట్యమాడ విరిసెన్ పర్వమ్ము లెన్నో మహిన్ "
----------------------------------------
సగమౌ మేనున సోయగంబు లెటులౌ సంతోషమున్ పొందగా
గగనం బంటిన వెండికొండ నెలవై గంధర్వ గానంబులున్
రగిలే కోర్కెల రాగమా లికల సారాంసంబు నేమందువో
పగలే వెన్నెల నాట్యమాడ విరిసెన్ పర్వమ్ము లెన్నో మహిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " అవధాని ముద్దు రాజయ్య గారి సమస్య
" పండుగ నాఁడు లభించెఁ బ్రాఁత మగండే "
-------------------------------------
వండిన వంటలు తినుటకు
మెండుగ సంతసము నంది మీరిన కోర్కెన్
పిండార బోసె వెన్నెల
పండుగ నాఁడును లభించెఁ బ్రాఁత మగండే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " అవధాని ముద్దు రాజయ్య గారి సమస్య
" పండుగ నాఁడు కూడఁ గనఁ బ్రాఁత మగండె లభించె నయ్యయో "
----------------------------------------------
ఉత్పల మాల .
వండితి పిండి వంటలను బాగుగ తీయని బాదుషా లటన్
మెండుగ జంతికల్ మిగుల మీగడ నిండిన పాయసం బులున్
నిండుగ రంగులీను తగు నీలపు చీరను గట్టియుం డగా
పండుగ నాఁడు కూడఁ గన బ్రాఁత మగండె లభించె నయ్యయో

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుమండి శ్రీ బాబు దేవదాసు గారి సమస్య
" సరసమాడఁగఁ దగవు కృష్ణా ! ముకుంద !
----------------------------------
నొచ్చు నేమోవితా నము గుచ్చు కొనగ
సత్య దన్నిన డాకాలు చక్క బరచి
చెలుల ప్రేమను ముదమందు చిలిపి దొంగ
సరస మాడఁగఁ దగవు కృష్ణా ముకుంద

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కంద యాగం " సమస్య .కలతలు తీర్చంగ నేడు కాలము లేదే "
---------------------------
విలువలు తెలియని వారలు
పలురీ తిగపరి హసించు పరభాష లకై
వెలవెల బోయిన తెలుగును
కలతలు తీర్చంగ నేడు కాలము లేదే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi " Samkarayya gaari samasya
----------------------------------
వీలుగ సూదులన్ జొనిపి భేషుగ దండల నల్లగా మమున్
హేలగ గుండెలం దునను మేలము లాడుచు గొంతుకో యగా
మాలలు కొప్పులోన నిడిమాలిమి భర్తకటంచు ప్రీతిగన్
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకము నందునుం దురే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" పూలు ధరింప నిష్టపడు ముగ్ధలు లోకము నందు నుందురే "
------------------------------------
వీలుగ సూదులన్ జొనిపి భేషుగ దండల నల్లగా మమున్
హేలగ గుండెలం దునను మేలము లాడుచు గొంతుకో యగా
మాలలు కొప్పులోన నిడిమాలిమి భర్తకటంచు ప్రీతిగన్
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకము నందునుం దురే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి సమస్య " మోదము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచే "
----------------------------------
ఏదీ కుదరని ఆంక్షలు
ఖేదము గలిగించు శిక్ష కోరి యిడగనా
యాదర ముగప్రీతి కురియగ
మోదము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాహరణము నుండి " శ్రీ శంకరయ్య గారి సమస్య
" పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో "
--------------------------------------
హలమును కదిపిన చాలును
పొలమును దున్నగను పుత్రి పుట్టుట యెటులో
కలమును బట్టగ కావ్యము
చెలువము తోవ్రాయు నంట శ్రీరాముని కై

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " శ్రీ శంకరయ్య గారి సమస్య
" పొలమును దున్నినంత సుత పుట్టుట యెట్టుల సాధ్య మమ్మరో "
చంపకమాల
---------------
వలపుల రాజు మోహమున భామిని కూడగ చోద్య మేమనన్
హలమును బట్టి దున్నగను నాగలి చాలుకు సీత గాంచగా
కలమును చేత బూనగను కావ్యము లల్లుట వింత గాదటన్
పొలమును దున్నినంత సుత పుట్టుట యెట్టు లసాధ్య మమ్మరో

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

గజల్
అడగకనే ఇచ్చినచో అలుగుతుంది నీవలపే
సడిచేయక ఎదలోతుల ముడుచుకొంది నీవలపే

నింగినంటు తారలలో తళుకులీను నీసొగసే
గగనకుసుమ మైమదినే కుదుపుతుంది నీవలపే

పీయూషపు పాత్రజూపి పలకరించి పోతావూ
మోహినివై సురలోకము చేరుతుంది నీవలపే

గుండెపగుల గొట్టకుమా సిరివెన్నెల మైకములో
తేనెలొలుకు మధుపాత్రను కోరుతుంది నీవలపే

లక్షలిచ్చి కొనలేవూ క్షణికమైన జీవితాన్ని
ముచ్చటైన నాకమందు ముంచుతుంది నీవలపే

లక్ష్మీ ఇదిచూడు .




రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆకాశవాణి వారి సమస్య
" మదులకు భారమయ్యె మధుమాసపు కోకిల గానమాధురుల్ "
----------------------------------------------
చంపక మాల
ఎదలను మీటినంత రవితేజపు సౌరులు పొంగు లీనగన్
ముదముగ పద్మ కన్నియలు మోదము నొందుచు పారవశ్యమున్
కదలిక లేక మౌనముగ గారవ మందున నిండి యుండగా
మదులకు భారమయ్యె మధుమాసపు కోకిల గానమాధురుల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" సతిసతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్ "
---------------------------
కందము .
మితిమీరిన విజ్ఞానము
కతలెన్నో మార్పు జేసి కలతలు రేపన్
మతిమాలిన క్రియ గాదట
సతిసతి క్రీడింపఁ బురుష సంతతి గల్గెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
దత్తపది " కుండ , దుత్త , చెంబు, గరిటె "
----------------------------------------------
తేట గీతి .
నిండు సభలోన శిరముల నెత్త కుండ
దుష్ట దూరుని గాంచని దుత్త మంబు
గడువు దాటిన కీచకుని గరి టెక్కి
విరిచి నడచెం బురవీధి వెఱఁగు బడుచు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
తెలివెన్నెల సౌరులన్ని నెలరాజుకె అనుకున్నా
విరజాజుల అందాలట మురిపించును అనుకున్నా

చుక్కలన్ని పరవశించి చక్కనైన నృత్యాలతొ
మక్కువైన మామచుట్టు తిరిగాయని అనుకున్నా

విరహమంటు తెలియకుండ అనునిత్యము నీవలలో
చిక్కిపోయి నీరసించి సోలినవని అనుకున్నా

మధురమైన వలపులన్ని మనసుగదిని దాచిఉంచి
మదిమెచ్చిన గిలిగింతలు కావాలని అనుకున్నా

నీలినీడ ఏటిదరిని అలుపెరుగక అభిసారిక
అనురాగపు మధువులనే గ్రోలాలని అనుకున్నా


రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజన రంజని వారి సమస్య
" వంకాయన చెఱకు రసము వడివడిఁ యుబికెన్ "
------------------------------------
ఇంకేమి వింత లుండునొ
సంకర జాతులు పుట్టు సంబర మందున్
వంకర టింకర యుగమిది
వంకాయన చెఱకు రసము వడివడిఁ యుబికెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
" సమస్య " హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్ "
--------------------
కందము .
కానల కేగక రయమున
మౌనము గాతపము జేసి మోక్ష మటంచున్
మానాభి మానములు విడి
హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి వి.వి .హెచ్.బి ప్రసాద రావుగారి సమస్య
నాల్గు రెండయ్యెనట నల్లనయ్య కౌర "
తేట గీతి.
రెండు మనసులు కలసిన నిండు ప్రేమ
రాధ నొడిజేరి మురియగ రాస లీల
కనులు కన్నులు కలసిన కవన మలరె
నాల్గు రెండయ్యె నట నల్లనయ్య కౌర

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పద్య కవనం వారి సమస్య
" కయ్యానికి కాలుదువ్వ కలుగు సుఖమ్ముల్ "
--------------------------
కందము .
నెయ్యము చేయక పతితో
కయ్యానికి కాలు దువ్వ కలుగు సుఖమ్ముల్
దయ్యమువలె భయబెట్టుచు
సయ్యాట లనగ దార సరసం బన్నన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " మద్దూరి రామ మూర్తిగారి అవధాన కళ్యాణి " గ్రంధము నుండి " సమస్య " ధవుఁడె కారకుండు తనయు మృతికి "
-----------------------------------
ఆట వెలది
పిండి బొమ్మ జేసి దండనాధు డవంచు
ప్రాణ బిక్ష పెట్టె బాలు నకును
తల్లి మాట వినిన తనయు డడ్డుపడగ
ధవుఁడె కారకుండు తనయు మృతికి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆకాశవాణి వారి సమస్య
" తలపువ్వుల్ వికసించి నప్పుడె కదా ధన్యత్వ మీజన్మకున్ "
---------------------------------------------
మత్తేభము
కలలో నైనను ఊహకం దనిది యేకాంతా లలామల్ వినన్
విలపిం పన్మది భాగదే యమున శోభిల్లంగ సంతోషమున్
తిలకిం చన్మన భారతీయ వనితల్ బండారు కుంకంబులన్
తలపువ్వుల్ వికసించి నప్పుడెకదా ధన్యత్వ మీజన్మ కున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆకాశవాణి వారి సమస్య
" తలపువ్వుల్ వికసించి నప్పుడె కదా ధన్యత్వ మీజన్మకున్ "
---------------------------------------------
మత్తేభము
కలలో నైనను ఊహకం దనిది యేకాంతా లలామల్ వినన్
విలపిం పన్మది భాగదే యమున శోభిల్లంగ సంతోషమున్
తిలకిం చన్మన భారతీయ వనితల్ బండారు కుంకంబులన్
తలపువ్వుల్ వికసించి నప్పుడెకదా ధన్యత్వ మీజన్మ కున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి వి.వి.హెచ్.బి. ప్రసాద రావుగారి సమస్య
" దేహము విడనాడి చూడు ధీరత్వము నన్ "
----------------------------------------
కందము.
హాహా కారము జేయక
దేహము విడనాడి చూడు ధీరత్వమునన్
మోహపు తిమిరము తొలగగ
సాహసమున పొందవచ్చు సంతస మెపుడున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి వి.వి.హెచ్.బి.ప్రసాద రావుగారి సమస్య
" దేహము విడనాడి చూడు ధీరత్వమునన్ "
--------------------------------------
రాతను మార్చుకొ నంగను
నీతిగ బ్రతుకంగ కోరి నియమము తోడన్
చేతన మందున బిగి ని
ర్భీతిన్ మున్ముందు కేఁగ విజయము గల్గునన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
దేవేంద్రుడు పంపినట్టి దిగివచ్చిన భామవో
తపోభంగ మొనరించగ మునిమెచ్చిన భామవో

మేనకవే నీవైతే వేచెనులే గాధిజుడె
వలపుదారి వెదకినంత అలిసొచ్చిన భామవో

గంధర్వులు కింపురుషులు వేచిరంట నీకొఱకె
ప్రేమలేక లంపుటకై తరలొచ్చిన భామవో

కలభాషిణి కంటెమిన్న వన్నెచిన్నె లున్నవిలె
చందమామ మోదమంది మనసిచ్చిన భామవో

నింగివెలుగు తారలన్ని తొంగిజూచు చున్నవట
సరిపోలని రంభయైన మదిమెచ్చిన భామవో

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " శ్రీ వి,వి.హెహ్.బి. ప్రసాదరావు గారి సమస్య " కలుషాత్ముల కెల్ల కవు లకారణ మిత్రుల్ "
కందము .
నలుగురు కలిసిన చాలును
కలతలు పుట్టంగ వేగ కయ్యా లనగన్
మలినపు మనసుల కడుగగ
కలుషాత్ముల కెల్ల కవు లకారణ మిత్రుల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gaja
ఉలికిపడిన మయూరమే వింతచూపు చూస్తోంది
మరుగుపడిన మబ్బుతునక దొంగచూపు చూస్తోంది

సోగకనుల ప్రియురాలె అధరమ్ముల అలజడికి
గుండెలదర బిగపట్టిన బెదురుచూపు చూస్తోంది

సెలఏరుల గలగలలో ఎదసవ్వడి వినరాక
గుండెలపై చెవినిగుచ్చి విరహచూపు చూస్తోంది

వనమునందు ఏకాంతపు విరులసొగసు గిలిగింత
పరవశించు పుడమికాంత వాలుచూపు చూస్తోంది

కందర్పుని ప్రణయసీమ గిలిగింతల మైకములొ
కదలలేక బందీగా వలపుచూపు చూస్తోంది.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
మనసుమనసు సృతిగలిపీ గెలిచినావు నామనసును
తనువుతనువు గతితప్పగ మరచినావు నామనసును

మరలమరల మిగలదోయి మధురమధుర మనుభూతీ
వరమనుకొని మెలగకనే కొసరినావు నామనసును

ప్రేమవిందు కానుకగా పొందినావు వినోదమున
నట్టనడుమ సంద్రమందు ముంచినావు నామనసును

మలయపవన వీచికలో మత్తుగొలుపు బాసలందు
గిలిగింతల కలలనడుమ దించినావు నామనసును

అంతులేని పయనంలో వేగుచుక్క కనుపించక
మసకబారు బంధనాలు పెంచినావు నామనసును



రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

AkaaSa vaaNi vaari samasya
chamka maala
పరువపు కొంటె వాయువులు పర్విడి మేనును తాకి నంతనే
విరియును మాన సంబునను వేయి విధమ్ముల భావ వీచికల్
పెరిగిన నాగ రీకమున ప్రేమల మించిన వింత పోకడల్
తరువుల గూల్చినప్పుడె గదా జగమందు సుఖంబు పెంపగున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పద్యాల సవ్వడి " సమస్య "
" మలముల విహరించు హుండె మధుపము భళిరా "
----------------------------------
కందము .
కలలను తేలుచు ప్రియసఖి
చెలువము తోపిలిచె నంట చెలికాని గనన్
జలమున వికసించగ మది క
మలముల విహరించు చుండె మధుపము భళిరా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" మలమును గనినంత ముక్తి మార్గము దోఁచున్ "
కందము .
ఇలలో భవబం ధములను
వలలో జిక్కుకొ నగపలు బాధలు మరువన్
కలగన భగవ ద్రూపము
మల మును గనినంత ముక్తి మార్గము దోఁచున్ .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కడలిదరిని చేరగనే కెరటమంటి నామనసును
చిరునగవులు ముదమారగ కుదిపినావు నామనసును

ఉల్లమందు విరిజల్లులు వెల్లివిరిసి కురిసెనంట
పట్టరాని సంతోషము నింపినావు నామనసును

వినువీధిని మెరుపులన్ని మైకమందు ముంచునంట
మబ్బుతెరలు వాలకనే ఒదిగినంత నామనసును

మాయజగతి మంత్రాలకు మెలికతిరిగి మదనపడక
అందమైన జీవితాన తేనెలొలుకు నామనసును

పండగంటి వెన్నెలంత పరవశించి ఎదమీటిన
కదలలేని కాలమంత కరిగించవె నామనసును








రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అంచయాన అందమంత పోతబోసి మలచెనేమొ
తేరుకోని మైకమందు రాతరాసి మలచెనేమొ

కుందనంపు బొమ్మవంచు కోరికోరి మురియునంట
ప్రకృతేమొ సిగ్గుచెంది ఏతమేసి మలచెనేమొ

పంచవన్నె లున్నచిలుక పంజరాన ఇమడదంట
అందమంత రంగరించి ధారపోసి మలచెనేమొ

చెలివలపును పొందకున్న అడవిగాచు వెన్నెలంట
ఎడారిలో తళుకులీను మెరుపుజూసి మలచెనేమొ

సెలఏరుల తరుసొగసులు అంబరచుం బితములంట
నెలరాజుకు కానుకగా బాసచేసి మలచెనేమొ

ఏతము = చిత్రవర్ణము.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్ "
---------------------------------
కందము.
నిజమిది వినుటకు వింతట
గజమునకు ఖరమ్ము పుట్టి గంతులు వేసెన్
భజనలు జేయగ దివిజులు
సుజనుల సృష్టింతు రంట శుభములు కలుగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" దూరమున నుంచగఁ దగదు ధూర్త జనుల "
----------------------------------------
తేట గీతి
--------------
కపట బుద్ధిని గలిగిన చపల మైత్రి
హాని కలిగించు ననియెంచి లేని పోని
దూరమున నుంచగఁ , దగదు ధూర్త జనుల
బరువు బాధ్యత లనుపంచి బాధ పడక

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి నా కవిత్వమున్ "
------------------------------------------
ఉత్పల మాల .
కన్నియ మానసం బునను గాఢపు కోర్కెలు పొంగిపో వగా
వన్నెలు చిన్నెలే యుచును పాటల గంధిని తాననం గనే
నన్నయ తిక్కనాదులె ఘనంబని మెచ్చిరి , నా కవిత్వము
న్నెన్నగ లేనివా రలట నేరుగ బల్కిరి భేషుభే షనన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" అంది యందని యందమే విందొసంగు "
---------------------------------
తేట గీతి .
విరిసి విరియని మమతలు వేన వేలు
తెలిసి తెలియని ప్రేమకే విలువ మిన్న
కనులు కన్నులు కలసిన కలత పడగ
అంది యందని యందమే విందొ సంగు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " శ్రీ శంకరయ్యగారి సమస్య
" ఎలుకయె కడు విక్రమించి ఏనుఁగుఁ జంపెన్ "
-----------------------------
కందము .
తలుపులు బిగించి కొట్టిన
బలహీన పుపిల్లి కూన బరుకును జనులన్
కలికాలము వింతలు గన
నెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి ' శ్రీ శంకరయ్యగారి సమస్య
" దత్తపది " కామ , భామ , మామ , రామ ,"
పై పదాలను అన్యార్ధంలో ప్రయోగిస్తూ భారతార్ధంలో మీకు నచ్చిన ఛందస్సులో వ్రాయండి
----------------------------------
కందము .
ఏమా మయసభ యందము
కామన చేయంగ వింత కవనము లల్లన్
రామకపు సొగసు లున్నవి
భామము భాసిల్లు నట్టి భవనం బనగా

రామకము = సంతోష పఱచునది
భామము = కాంతి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" శునకమ్మయ్యెను మురారి సురలు నుతింపన్ "
------------------------------------
కందము .
వినుమా వింతలు జగతిని
కనుపించని దైవ మంట కనికట్టు లనన్
వినువీధిని పరికించుచు
శునకమ్మ య్యెను మురారి సురలు నుతింపన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" కనక కశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్ "
----------------------------------
ఉత్సాహ
వినుము నాదు పలుకు హరిని వీడి కొల్వు మంటి నే
మనకు దైవ మనగ నెపుడు మదన రిపువు గాన నో
పుత్ర రత్న మాయ టంచు బొగడి నయము గావునన్
కనక కశిపుఁ బూజయే జగమ్ముఁ బ్రోచు నెప్పుడున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్ "
--------------------------------------
కందము .
రాలకు మ్రొక్కుచు పూజలు
మేలని నిరతమ్ము జేయ మిక్కుట ముగనే
మాలిమి సతితో ప్రియముగ
స్త్రీలకు మ్రొక్కిన ధనమును శ్రేయముఁ గల్గున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ గరికిపాటి వారు పూరించిన సమస్య
" పద్యము రాదనెన్ గరికిపాటికిఁ గోపము హద్దు మీరగన్ "
ఉత్పల మాల
మధ్యము త్రాగివ్రా సెదరు మాన్యులు పెద్దలు పండితో త్తముల్
చోద్యము గాదటంచు మరి సొంపుగ ధూమము పానమం దునన్
గద్యము వ్రాసినన్ గనగ గారవ మందున ప్రీతిపొం దుచున్
పద్యము రాదనెన్ గరికపాటికిఁ గోపము హద్దు మీరగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal

తిరిగిరాని పసితనమే నిలిచిపోతె బాగుండును
అమ్మఒడిని ఆదమరచి నిదురపోతె బాగుండును

ప్రియునిఒడిని కలలజగతి కరిగిపోతె బాగుండును
కౌముదిలో ప్రేమనౌక సాగిపోతె బాగుండును

చుప్పనాతి చుక్కలన్ని తొంగితొంగి చూసేనట
కనుసైగల మలుపులన్ని దాటిపోతె బాగుండును

మబ్బుకన్నె లన్నికలసి మీటింగులు పెట్టెనంట
కుండపోత కురియకుండ మరలిపోతె బాగుండును

చందమామ అందాలకు ఆశపడిన కలభాషిణి
పొందుకోరి పరవశాన మునిగిపోతె బాగుండును



రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆకాశవాణి వారి సమస్య
" రణమే ప్రాణము పోయి పద్య కళయై రాణించు సద్గోష్టులన్ "
------------------------------------
గణముల్ వాసిగ కూడివ్రా యగను నాకావ్యమ్ము శోభిల్ల గా
పణమున్ బెట్టిన పండితో త్తములు శాభాషంచు కీర్తిం చినన్
వ్రణముల్ లేకను పద్య గద్యములు ప్రాభావిం చగానెంచి మా
రణమే ప్రాణము పోయి పద్య కళయై రాణించు సద్గోష్టులన్
వ్రణముల్= దోషములు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ గరికపాటి వారు పూరించిన సమస్య
" శుకయోగికి నల్లుఁడయ్యె సురనది కొడుకే "
-----------------------------------
పికమది కాకికి సరసన
బకముండును హంస వోలె బహు సుందరమౌ
పికబకము లెవరి కెవరట
శుకయోగికి నల్లుఁడయ్యె సురనది కొడుకే
------------------------------

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " శ్రీ గరికిపాటి వారి అవధానము నందలి సమస్య "
చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్ "
----------------------
కందము
సవతిని తెచ్చిన మగడట
వివరించగ జాయ తోన వేదన వలదే
జవదాటని తోడు నీకని
చెవిఁ బువ్వులఁ బెట్టువాఁడె శిష్టుఁడు జగతిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆకాశవాణి లో ప్రసారమైన సమస్య
'" స్వరములు లేని గీతములు శ్రావ్యములయ్యెను లోకులెన్నగన్ "
----------------------------------------------------
వ రమట గానమందునను వాద్యము లేకనె సొంపుగన్ వినన్
మురిపె మటంచు మంచిశృతి మోదము నొందు చుమైక మందునన్
కరములు మోడ్చి భక్తిగల కావ్యరసాను భవంబులన్ నిలన్
స్వరములు లేని గీతములు శ్రావ్యము లయ్యెను లోకులెన్నగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
---------
దివినుంచి భువిపైకి దిగివచ్చి నావటే భామినీ
మబ్బుతేరు లపైన పయనించి నావటే భామినీ

ఇంద్రసభ నందుండి తొలగిపో యితివేల అప్సరా
మత్స్యలో కముగాంచ మనుసుపడి నావటే భామినీ

కపటించు జనులుండు కల్లలే మిగులునట కోమలీ
ఘోరనరక మటంచు వెతలబడి నావటే భామినీ

అందాలు చిందేటి అచ్చరా లేమవై ఓచెలీ
కష్టముల పాలబడి శేషమై నావటే భామినీ

విలపించ పనిలేదు విధిరాత లకువంగి ప్రేయసీ
ఘనమైన ప్రేమనే కలబోసి నావటే భామినీ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నీమనసు నామనసు దూరాతి దూరాలు
ప్రియముగా మురిపించి కలిపేది సాగరం

కడలిలో కలవంట రతనాలు మణులెన్నొ
తనలోన దాచుకొని కులికేది సాగరం

గంభీర మైవచ్చి పాదాలు తడుపంగ
పాపాలు తొలగించి నిలిపేది సాగరం

చక్రవాక పుజంట కవులమది మెరుపులై
రసరమ్య కావ్యాలు పలికేది సాగరం

భావాల భోగాలు మధురాతి మధురాలు
మంచిమన సుకుదారి చూపేది సాగరం

gajal

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజన రంజని వారి సమస్య
" పందిని కౌగలించు కొని పంకజలోచన సంతసించెరో "
----------------------------------------------
ఉత్పలమాల .
నందిని పూజజేసి శివ నామము త్రాణగ భక్తిమీ రగన్
సందియ మేమిలేక మది చల్లని భావము పొంగు చుండగా
వందనమో యటంచు తలవంచి మహామహితాత్ముడే యనన్
పందిని కౌగలించు కొని పంకజ లోచన సంత సించెరో

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజన రంజని వారి సమస్య " నిషిద్ధాక్షరి " క. చ. ట. త. ప. లు " -----------------------------------
కందము.
వేసవి యందమె విందులు
దోసిలి నిండిన సుమములు దోహద మిడగ
న్నీసున బాలల సొగసులు
మోసము లేదనగ నిజము మోదము నిండన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
ఈజీవిత పయనంలో నిజమేదీ దొరకలేదు
కనులనీరు నిండినంత సుఖమేదీ దొరకలేదు

మసిబారిన మమతలన్ని వినోదాల మునిగిపోయె
ఆధునికపు బాటలందు చోటేదీ దొరకలేదు

ధనమదాంద కైపులోన పెడదారుల వెతలునిండ
కలలతేలు భావాలకు మనసేదీ దొరకలేదు

విషనాగుల కోరలలో చిక్కిపోయె వింతజగతి
మధురమైన ప్రేమవిందు తలపేదీ దొరకలేదు

ఆటవిడుపు అనురాగము అందకుండ ఎగసిపోయె
సారహీన మైనమదికి కొలతేదీ దొరకలేదు







రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శంకరయ్య గారి సమస్య
" సరములు జీవులకుఁ గన నసహ్యము లయ్యెన్ "
-----------------------
కందము .
సరసీ రుహముల సొగసులు
కరువాయెను నేడు గాంచ కల్లగ మిగిలెన్
పరుసము నింపగ జనులట
సరములు జీవులకుఁ గన నసహ్యము లయ్యెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ పోచిరాజు కామేశ్వర రావుగారి సమస్య "
పరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్ "
------------------------------------
వరములు బొందిన యసురులు
కరవాలము చేత బట్టి కాఠిన్య ముగన్
నిరతము జనులను జంపుచు
పరమేశుఁ గొలువ నఘములు పండవె కరమున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" వెలది యురమ్మున నొక వటవృక్షమ్ము మొల్చెన్ "
-----------------------------------------
కందము
కలియుగ వింతలు వినగను
కలకల ములురేపు నంట కల్లలె యైన
న్నుల్లము జల్లను వార్తలు
వెలది యురమ్మున నొక వటవృక్షము మొల్చెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆకాశవాణి వారి పూరణ
సమస్య " నరునకు వానరునకు నిల నాలుగు కాళ్ళే "
-----------------------------------------
కందము
వరుసలు గలిసెను గావున
పరిసరములు వేరు వేరు బహు చిత్రంబౌ
వరమట మర్కట పోలిక
నరునకు వానరునకు నిల నాలుగు కాళ్లే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె "
--------------------------------
ఉండి లేనట్లు బ్రమలోన నుందు రెపుడు
కష్ట కాలము నందున ఖచ్చి తముగ
భక్తి కొలిచిన దైవము పలుక కున్న
దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

గజల్
కొలనులోని కలువలన్ని కనులవిందు చూసేను
కన్నెమనసు తెలియలేక క్రిందుమీదు చూసేను

చెలిగత్తెల విరహమంత చెరువుదరిని కలబోయగ
జాలిపడిన అలలకాంతి మెరుపులందు చూసేను

ప్రేమలేని లోకమంత సూన్యమై కనుపించును
రసరమ్యపు వలయాలను గగనమందు చూసేను

వాకిలిలో వేచివేచి వేసారిన మనసుకంత
సంతసించ తరుణమెటుల అగుపించదు మిధ్యయంట

కలతనిండు లోకమందు కలలతేలు రారాజును
వలపుతేరు సారధిగా మెరుపులందు చూసేను

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ వారం ఆకాశవాణిలో ప్రసారమైన నా పూరణ
సమస్య " పున్నమి రేయిలో గలిగె పూర్ణత మంబటు చూడ ముచ్చటన్ "
-----------------------------------------
ఉత్పలమాల .
సన్నని మారుతం బుమది సంతస మొందగ నూయలూ గుచున్
చిన్నది లేడిపిల్ల వలె చిందులు వేయుచు నాటపా టలన్
వెన్నెల సోయగం బులను వేడుక మీరగ గ్రోలుచున్ గనన్
పున్నమి రేయిలో గలిగె పూర్ణత మంబటు చూడ ముచ్చటన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" పురుషార్ధములన్ గణింప మూఁడని తెలుపన్ "
-----------------------------------
సరియగు వివరణ దెలియక
పరుసముగా పలుకు చుంద్రు ప్రతినలు జేయన్
తరచిప రికించ తుదకట
పురుషార్ధములన్ గణింప మూఁడని తెలిపెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " దమయంతిని పెండ్లియాడె దశరధ సుతుడే "
------------------------
విమలుడు నలభూ పాలుడు
దమయంతినిఁ బెండ్లియాడె , దశరధ సుతుఁడే
రమణీ మణిసీత నుగని
మమకారము పొంగె నంట మాలిమి తోడన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య "
" పాలం గనినంత బిల్లి భయపడి పాఱెన్ "
---------------------------
మేలము లాడుచు నేస్తము
హేలగ కవ్వించె నంట నెలుకను తినకే
కాలిన మీసము తలుచుకు
పాలం గనినంత బిల్లి భయపడి పాఱెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...


రాజేశ్వరి నేదునూరిఆగస్టు 15, 2018 5:59 AM
రాజ కీయము నందున రచ్చ రచ్చ
లేదు మహిళకు రక్షణ రేయి బవలు
ప్రజల బాధలు తీరవు బరువు బ్రతుకు
స్వేచ్చ వచ్చెఁ దెగవు దాస్య శృంఖ లములు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆకాశ వాణిలో ప్రసారమైన నా పూరణ
సమస్య " రెక్కలు రానిపక్షి యెగిరెన్ విను వీధిని రివ్వు రివ్వనన్ "
ఉత్పల మాల .
చక్కని పద్యసం పదను సంతస మొప్పగ పూరణ మ్ములన్
మిక్కిలి శ్రద్ధగా కవులు మేధము వోలెస మాప్తిజే సినన్
మక్కువ తోనపం డితులు మానస మందున పొంగిపో వగన్
రెక్కలు రాని పక్షి యెగిరెన్ విను వీధిని రివ్వు రివ్వనన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి గురుమూర్తి ఆచారి గారి సమస్య
" పశ్చాత్తాపము విడి సలుపం దగు నఘముల్ "
------------------------------
కందము.
పశ్చిమ దేశము లందున
పశ్చాత్తాపము విడి , సలుపం దగు నఘముల్
నిశ్చయముగ దెలియ కనే
నిశ్చింత గమెలగు చుంద్రు నీమము లేకన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి " దత్తపది
" కల- తల-మర-వస. "
----------------------------
కలవారి కొత్త కోడలు
తలవాకిట నిలచె నంట తబ్బిబ్బవగన్
వలవిసరిన వరుని వసతి
నెలరాజును మరల మరల నెమ్మిని గాంచన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " ర " నిషిద్ధాక్షరి . రక్షాబంధనోత్షవము గురించి "
తేట గీతి
మమత బెంచును బంద్ధమ్ము మాయ నీక
అక్క చెల్లెళ్ళ కలయిక హాయి నిడగ
అన్న దమ్ముల కానుక లందు కొనుచు
బంధ మునునిల్పు నెదకుసు గంధ మిదియె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" పోతన కావ్య మందు రసపోషణ సుంతయు గానరాదయో "
--------------------------------------------
ఉత్పల మాల .
కోతలు కోయువా రలట కోరిన రీతిగ వ్రాసుకొం దురే
ప్రీతిగ మార్పు జేయుచును భేషని పించుచు మభ్య బెట్టగా
పోతన కావ్యమందు రసపోషణ సుంతయుఁ గానరా దయో
హేతువు జూపుచున్ మిగుల హేళన జేయుదు రాత్మవం చనన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" పోతన కావ్యమ్మున రసపోషణ లేదే "
--------------------------
కందము .
శీతల పానీ యమువలె
నూతన ముగనుండు నంట నోటికి రుచిగన్
చేతనము లేక చదివిన
పోతన కావ్యమ్మున రసపోషణ లేదే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్
-------------------------------
అల్లన గాంచితి మారుని
నుల్లము రంజిల్లు రీతి నుత్సు కమందున్
మెల్లగ కోరితి బంధము
చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమందిరే "
------------------------------------
ఉత్పలమాల
అల్లిన కాయమా నమున నందరి ముంగిట సంతసాన తా
నుల్లము రంజిలన్ మిగుల నుత్సుక తన్ తన దారకో సమై
తల్లడ మల్లడం బగుచు తారక శైలము జేరినం తగా
చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమం దిరే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పద్య కవనవనం నుండి సమస్య
" కడవలం జాఱ విడిచిరి కన్నె లెల్ల "
------------------------------------
తేట గీతి .
మారు డెదురైన మగువల మదిని మెండు
వలపు తలపుల పులకల వలను చిక్కి
అడుగు తడబడి హొయలందు నడుము మెఱయ
కడవలం జాఱ విడిచిరి కన్నె లెల్ల

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

రాజేశ్వరి నేదునూరిసెప్టెంబర్ 13, 2018 6:32 AM
గణప తినికొలిచి నంతట కలుగు శుభము
బంటు రీతిని పూజించి భక్తి మీర
కుడుము లుండ్రాళ్ళు నీకిడి కొలుతు మయ్య
తప్పు లెంచక కరుణించి తనరు మదిని

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ ధిక్కరు లెల్లఁ బాఱెనే "
-------------------------------------------
చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే
దోమకు కుత్తుకం దునను దూరగ నేనుగు వింతయే లనో
మామకు బింబమం దునను మచ్చది కాదని వాదులా డగా
నేమని జెప్పగా నిటుల వింతలు కొల్లలు పొల్లుపో కయున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈరోజు ఆకాశవాణిలో ప్రసారమైన నా సమస్య
" రాధను పెండ్లియాడె రఘురాముడు దేవతలెల్ల మెచ్చగన్ "
-----------------------------------------
శోధన జేయగా దెలిసె శోభిలు నంట సురారులం దరున్
బాధలు లేకయుం డునటు భక్తుల పాలిట ప్రేమ మీరగన్
మాధవు రాసకే ళినిల మానస మందున వేడుకే యనన్
రాధను , పెండ్లియాడె రఘు రాముడు దేవతలెల్ల మెచ్చగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" తాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె "
----------------------------
ధరను పాలించు భూపతి తాత యపుడు
వార సుడుగాన తనతండ్రి పరగ ప్రభువు
తాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె
గౌరి శాపము తలదాల్చు గౌరవ మున

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశవాణిలో ప్రసారమైన నా సమస్యా పూరణ
సమస్య " కారము బెట్టి బంధువుల కన్నులు చల్లగ చేసి రెంతయున్ "
--------------------------------------------
సారము లేనివిం దుకట చాలని భోగపు నోగిరమ్ము లున్
నీరము గీరముల్ కొదువ నేరము లెంచక శాంతబుద్ధి తో
నారడి జేయకుం డగను నైగమ మందున శృంగభం గమౌ
కారము బెట్టి బంధువుల కన్నులు చల్లగ చేసి రెంతయున్
రాజేశ్వరి. నేదునూరి
న్యూజెర్సీ .U.S.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పద్య కవనం వారి సమస్య
" చిన్నప్పటి సంతసమ్ము చిక్కెను మరలన్ "
-------------------------------
కందము .
నిన్నను మలిగిన ముచ్చట
లన్నియు మనసంతు నేడు లవలేశ మ్మైనా
విన్నను కన్నది లేదని
చిన్నప్పటి సంతసమ్ము చిక్కెను మరలన్
మరలన్ = యంత్రములు , మళ్ళీ తిరిగి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" భీముని సతి తారయనుచు వేమన వ్రాసెన్ "
-------------------------------
కందము .
ఏమని జెప్పుదు వింతను
ప్రేమయు పెండ్లియు తెలియని వేదాంతి కటన్
రామా యణమున రాజగు
భీముని సతి తార యనుచు వేమన వ్రాసెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" దత్తపది వన, జన, మన, ధన " అన్యార్ధంలో నచ్చిన ఛందస్సులో "
-----------------------------------
కందము .
జీవన ధాత్రిని సుఖముగ
పావని సీతకు మనుగడ బహుదు ర్భరమౌ
రావణు మనమున మలినము
కావున ప్రాజన ముబోలు ధనక మటంచున్
ధనకము = అత్యాశ
ప్రాజనము = ముల్లు కఱ్ఱ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశవాణిలొ ప్రసారమైన నా పూరణ గురువులు శ్రీ శంకరయ్య గారి గళము నుండి
సమస్య " శంకరు డెత్తె మంచుమల శైలజ భీతిలి కంప మొందగన్ "
---------------------------------------------
ఉత్పల మాల
కింకరు డైనరా వణుడు కేలున కొండను నూయలూ పగా
పొంకము మీరుచున్ మిగుల పూనక మొందిన రాక్షసా ధమున్
కొంకుప డంగనా తనికి కోరిన రీతిగ నేలతా లుపున్
శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొం దఁగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పొన్నాడ వారి పున్నగ వనం నుంచి " వచన కవిత్వం 16 అక్షరాలు
-----------------------
వేదము లెన్ని చదివినను వేయి విధమ్ముల
పండితు డైనగాని సాధు శీలుడగు రాజును
భక్తిమీర కడుమోదము నందు వినయముగా
వెనుకబడి నడచు వారె ఘన విజ్ఞులగున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" ఖరమా జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా "
--------------------------------------------
మత్తేభము
అరయన్ శంకరు డంటవెం డినగ మున్ నాట్యమ్మునే జేయగన్
గిరిజా దేవియు సంతసం బునను బృంగీశున్ సమీపిం పగన్
తిరమౌ నిద్దరు నాట్యమం దునను నుద్వేగమ్ము నన్ చంద్ర శే
ఖరమా జీవన మందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ ఈశ్వర రెడ్డి గారి సమస్య
" కపురము కంటె కన నరకమ్ము గలదె."
==================================
తేట గీతి .
ప్రొద్దు దిరుగుడు మనసున్న ముద్దు గుమ్మ
భర్త నెటులైన హింసించి పరవ సించ
పక్క పైనను ముళ్ళుంచ చక్క నైన
కాపురము కంటె కన నరకమ్ము గలదె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" అల్లుఁ జంపఁ దలఁచె నాహవమున "
ఆట వెలది .
కల్ల బొల్లి సోది కల్పించి జెప్పుచు
వల్ల మాలి ప్రేమ నొలక బోసి
తుదకు మోస గించి దొంగవోలె పాఱు
యల్లుఁ జంపఁ దలఁచె నాహవమున

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" స్నానంబున్ జపనిష్ట లేల మడియన్ జంధ్యంబు నా కేలరా "
------------------------------------------
శార్దూల వృత్తము.
దానంబుల్ పలురీ తులంజరు పుచున్ తాపేరు ప్రఖ్యాతు లున్
భానుండం టినకాం తిరేక వలెకీర్తిన్ పొంగు చున్ తేలగా
ఆనారా యణుడే నుమెచ్చి వరముల్ సంధించి దీవించగా
స్నానంబున్ జప నిష్ట లేల మడియన్ జంధ్యంబు నాకేలరా

«అన్నిటి కంటే పాతది ‹పాతవి   481లో 201 – 400   కొత్తది» సరి కొత్తది»

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase