Pages

9, నవంబర్ 2012, శుక్రవారం

481 కామెంట్‌లు:

«అన్నిటి కంటే పాతది   ‹పాతవి   481లో 1 – 200   కొత్తది»   సరి కొత్తది»
సుభ/subha చెప్పారు...

దీపావళి శుభాకాంక్షలండీ..

dokka srinivasu చెప్పారు...

Rajeswari Nendunuri madam gariki

Namaskaramu. Mee blogu chaalaa chaalaa bagundi.

Rajeswari Nendunuri madam meeku, mee kutumba sabhyulaku mariyu mee snehithulaku naa Deepavali subhakamshalu.


Rajeswari Nendunuri madam idi naa Deepavali sandesamu Lamps of India message (Bhaaratha Desamulo Deepamulu) ni nenu naa Heritage of India bloglo ponduparichitini.


http://indian-heritage-and-culture.blogspot.in/2013/09/lamps-of-india.html


Rajeswari Nendunuri madam meeru naa Lamps of India message ni choosi oka manchi sandesamuni english lo ivvagaluaru.


Alage meeru naa bloguki memberga join avutharu ani aasisthunnanu.

Rajeswari Nendunuri madam meeku naa Lamps of India message nachite danini mee facebook mariyu ithara friends networks lo share cheyagalaru.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

dhanya vaadamulu

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశమంద జేయురా
-----------------------------------------------
రసధుని వంటిబ్లాగు మన లాక్షణికుండగు శంకరార్యులున్
విసుగను మాటలేకను గవేషణ జేయుచు పద్యకావ్యముల్
రసమయ వీధులందునను రాగము చిందుచు సంచరించగా
వ్యసనము వేయిరీతుల శుభప్రదమై యశమంద జేయురా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కపటముతోన మానవులగార డిజేయు చుసంతసంబునన్
నెపములనెంచి జూపుచు నునీతులజెప్పుచు గొప్పభోగముల్
చెపలపుచిత్తమున్ గలిగిజీవితమందున శాంతిలేనియా
కృపణునితోడ దానమునగెల్వఁగ నెవ్వఁడు గల్గునిద్ధరిన్
Samkaraa bharaNamu numDi
samasya " kRpaNuni tODa daanamuna gelwa@mga nevva@mDu galgu niddharin "

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " దనుజుల యిలవేల్పు చక్ర ధరుడగు హరియౌ "
---------------------------------------
మనుజుల భక్తిని మెచ్చగ
మనసిడి దీవించు నంట మాధవు డెపుడున్
వనమున తపమొ నరించెడి
దనుజుల యిలవేల్పు చక్ర ధరుడగు హరియౌ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
" పద్య రచన "
-----------------------
సొగసులు విరియు శకుంతల
గగనము పైదృష్టి నిలిపి కలమును బట్టెన్
మగనికి లేఖను వ్రాయగ
సుగమం బగుపదము లేరి సోయగ మొందన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
" పద్య రచన "
-----------------------------
హస్తి యభిషేక మొనరించి ప్రస్తు తించె
వెలుచ పూజించి తరియించె వేల పూలు
లూత వేదము దెలియక నేత నేసె
కాచి రక్షించు ననగశ్రీ కాళ హస్తి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " నాగశయనుడు విహరించు నంది నెక్కి "
----------------------------------
గగన సీమల దిరుగును గరుడి పైన
నాగ శయనుడు , విహరించు నంది నెక్కి
పరవ శమ్మున పార్వతీ భవుడు కలసి
నిముస మైనను కుదురుగ నిలువ లేక

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " సీతను రాముండె దాచి చిరయశ మందెన్ "
---------------------------------------------
మాతగ శాసించె శిఖియె
జోతలు బెట్టిరి దివిజులు శుభము లటంచున్
ప్రీతిగ తనదరి జేరిన
సీతను రాముండె దాచి చిరయశ మందెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పద్య రచన
--------------
వెండి కొండను పెకలించ మొండి గాను
రావ ణాసురు బలిమిని రవము జేయ
తపము వీడిన శంకరు నెపము నెంచి
బొటన వ్రేలితో నదిమెను భూమి పైన

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " గంగానది యుప్పునీరు గలదై పాఱెన్ "
------------------------------------------
నింగిని నిలచిన దేవత
లింగని శిరమందు నుండి లీలగ భువిపై
సంగమము కోరి సింధువు
గంగానది యుప్పునీరు గలదై పాఱెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " మాట దప్పు వారె మాన ధనులు "
--------------------------------------------
కలియు గంబు నందు కలుషిత మైనట్టి
జగతి నున్న జనులు జాగిల ములు
నీటి మూట లిచ్చి నీతులే వల్లించి
మాట దప్పు వారె మాన ధనులు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " కాకర కాయల రసమ్ము గడుమధుర మగున్ "
----------------------------------------------
శాకము లందున శ్రేష్టము
కాకర కాయల రసమ్ము , గడుమధుర మగున్
పాకమున కూర వండిన
నాకము గనుపించు నంట నళినదళేక్షా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " గాడిదపై నెక్కి హరుడు కాశికి నేగెన్ "
------------------------------------------------------
వీడగ తారక శైలము
బూడిద పూతలను పూసి భూమిని దిరుగన్
చేడియను జేర దలచిన
గాడిదపై నెక్కి హరుడు కాశికి నేగెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
" దత్తపది " తీపు - కారము - పులుపు- చేదు "
-------------------------------------------------
విరటు గొలువున సైరంధ్రి విరియు పులుపు
మది వికారము చెందెను చేదు కొనగ
తనువు తీపున వ్యధచెంది తనివి పొంగి
యలమ టించెను కీచకుం డహ రహమ్ము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " దత్తపది " వ-డ-గా-లి. " నాలుగు పాదాలకి చివరి అక్షరాలుగా వ్రాయాలి . ఆట వెలదిలో .
----------------------------------------------
గ్రీష్మ తాప మనగ గేలిచేసె కలువ
మలయ జంపు సౌరు మనము నిండ
వెన్నె లందు తనరి విరహమ్ము మరువగా
యుల్ల మలరి వీచె చల్ల గాలి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా "
-------------------------------------
అమ్మాయని బిలచిన మది
కమ్మని భావమున పొంగి కరుణిం చునుగా
నెమ్మిని మ్రొక్కగ తల్లికి
రమ్ము జనాళికిఁ గడు మధురమ్మ గునుగదా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య ఆ.ట వెలది " బండ పైన , జొన్న పంట పండె "
------------------------------------
జమ్మి కొయ్య దెచ్చి చక్కగా మధియించ
జ్వాల పుట్టు నంట జగతి వింత
రవిని గాంచి నంత భువికెంత పులకింత
బండ పైన జొన్న పంట పండె
---------------------------------
పంట చేల లోన పక్షిగణములు జేరె
కాపు గాయ వలెను కంచె చుట్టు
మంచె కాడ బిడ్డ మంచమేయు టమాని
బండ పైన జొన్న పంట పండె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని పత్రిక నుండి
" సమస్య రోహిణి కార్తెలో చలికి లోకులు బాధల నొందు రెప్పుడుం "
----------------------------------------
మోహన రాగమం దునను మోజుగ వేసవి లాస్యమా డగా
యూహల తేరుపై జనులు యూగిస లాడుచు సంతసిం చుచో
ఆహిమ బిందువుల్ చిలుక భానుని తేజము చల్లనౌ నటన్
రోహిణి కార్తెలో చలికి లోకులు బాధల నొందు రెప్పుడున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య
" చోరులు మంచి వారనుట చోద్యము కాదదియెంచి చూడగన్ "
-------------------------------------------------
మారిన లోకమందునను మాయలు గాంచగ సాధ్యమేరికిన్
నేరము లెన్నిజేసినను నేరుపు తోడను సాధుశీలతన్
కూరిమి దైవచింతనము గోరుచు మైత్రిని పెంపుజేయగా
చోరులు మంచి వారనుట చోద్యము గాదది యెంచిచూడగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుగున్ "
--------------------------------------
వెతలకు భయపడి నిరతము
మతిలేకను దిరుగు నట్టి మగనికి తానై
హితమును పలుకగ బాధను
పతి విడనాడిన సతికి శుభమ్ములు గలుఁగున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " పద్య రచన "
----------------------------------------------
మరుమల్లెల చిరునవ్వులు
మురిపించగ తనదు ప్రేమ మోదము నొందన్
పెరిగిన గడ్డము మాటున
మరుగున పడిపోవు తల్లి మది ఖణ్డితమై

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
దత్తపది " కాకి-కోయిల-నెమలి-కోడి " అన్యార్ధముతొ భారతార్దమున "
------------------------------------
ఏకాకిగ రమ్మని భీ
మాకీచకుని బిలిచితినె మలినపు బుద్ధి
న్నాకీ గతి యెటకోయిల
కూకటి రత్నము తానై కోడిగ మాడన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
" పద్య రచన "
---------------------
మిక్కిలి రుచికర మైనవి
చక్కిలములు చేత చుట్టె చాతుర్య మునన్
మక్కువగా తిన గోరిన
లెక్కకు మించినవి లేవు లేశము కనగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పరుషోక్తి భాష చూడకు
పరిణామము సుఖము చూడు బ్రతికెద వసువే
స్వర మందు చేదు జూడకు
పెరిగిన తెవులడగ జూడు పెద్ద తనానన్

విభీషణుడు రావణునికి నీతి చెప్పుట
కవి . అయ్యలరాజు రామభద్రుడు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " పద్య రచన "
---------------------------------------
శివకేశవుల కభేదము
భవితవ్యము తీర్చి దిద్దు భగవం తుడనన్
దివినుంచి భువికి నేతగ
భవబంధ మ్ములను ద్రుంచి భక్తుల బ్రోచున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " నిన్నును నినునిన్ను నిన్ను నిన్నును నిన్నున్ "
----------------------------------
నన్నే వలచితి నంటివి
మిన్నంటిన మమత పంచి మీరిన ప్రేమన్
మన్నన సేయుటె ఋజువని
నిన్నును నినునిన్ను నిన్ను నిన్నును నిన్నున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " కలికి పదతాడ నమ్ములే కడు ప్రియములు
-----------------------------------------------
పరవ సించగ శృంగార భావ మందు
కవిత లందున " రా " కొట్ట కవులు బలికె
సత్య భామయె వెన్నుని సరస మాడె
కలికి పదతాడ నమ్ములే కడు ప్రియములు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య " తొలకరి వర్ణన "
------------------------------------
తొలకరి చినుకులు తాకిన
పులకించును ధరణి మురిసి పొంగుచు నెదలో
తొలి ప్రేమ చెలియ పలుకున
కలలం దునతేలు నంట కందర్పు డనన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
" సమస్య "" ముక్తికి మార్గమ్ము మధ్యమును గ్రోలుటయే "
--------------------------------------------
భక్తిని గొలిచిన దైవము
ముక్తికి మార్గమ్ము, మధ్యమును గ్రోలుటయే
శక్తికి మించిన యలజడి
యుక్తము గాదంచు బుధులు నుద్భో దించన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య
" తలలు బోడులైన తలపులు బోడులా "
---------------------------------
వలదు సుఖమ టంచు వెలివేసె వెలదుల
భర్త మరణ మొంద భార్య కిలను
తలలు బోడు లైన తలపులు బోడులా
మగువ బ్రతుకు నణచె మాన్యు లపుడు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " తండ్రు లేవురు గలరండ్రు ధరను బుధులు "
------------------------------------
తండ్రి పెదతండ్రి పినతండ్రి తనయు డనగ
ఉన్న తంబుగ దీర్చును మిన్న గురువు
సతిని చేపట్టు సమయము పతికి మామ
తండ్రు లేవురు గలరండ్రు ధరను బుధులు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

జనుల కెల్ల శుభము సాంఖ్య యోగముదాని
వలన ధర్మ నిష్ట వలన నైన
నంత్య కాలమందు హరిచింత సేయుట
పుట్టువునకు ఫలము భూవ రేంద్ర
----------------------------
శుకుడు పరీక్షిత్తునకు ముక్తి మార్గంబుఁ దెలుపుట

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్ "
-----------------------------------------------------------------
మరణము గోరుచు మనమున
జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్ "
కరుణించి దైవ మతనికి
వరమిచ్చెను రుజను వీడి వాసిగ బ్రతుకన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఎక్కడివాఁడొ ! యక్షుతనయేందు జయంత వసంత కంతులన్
జక్కఁదనంబునన్ గెలువఁ జాలెడు వాఁడు , మహీసురాన్వయం
బెక్కడ? యీతనూ విభవ మెక్కడ ? యేలని బంటుగా మరున్
డక్కఁగొనంగ రాదె యకటా! ననువీఁడు పరిగ్రహించి నన్

అల్లసాని పెద్దన మనుచరిత్ర . ప్రవరుని గాంచిన వరూధిని ప్రణయ వేదన

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్ "
-----------------------------------------
నేనే నీవని తలచుచు
నీనీడను నిలచి యుంటి నీనెల వునకై
నీనా బేధము మదినను
మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " పండితుఁ డన నెవఁడు పరమ పామరుఁడు గదా
--------------------------------------
నిండుగ వినయము గలిగిన
చండా లునికైన గాని చక్కని బుద్ధిన్
దండిగ దర్పము నిండిన
పండితుఁ డన నెవఁడు పరమ పామరుడు గదా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " శ్రీరమణీ లలామనెదఁ జేర్చినవాఁడు శివుండు శంభుఁడే "
------------------------------------
తారిష మందుబుట్టెనట తామర సాక్షికి చింత యేలనో
మారగ రూపురేఖ లవి మానిని మోహన సుందరాం గియై
కోరగ భర్తగా మదిని కోమలి మారుడటంచు శ్రీహరిన్
శ్రీరమణీ లలామ నెదఁ జేర్చినవాఁడు శివుండు శంభుఁడే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " పసిబాలుఁడు పెండ్లియాడి పడసెఁ గుమారున్ "
------------------------------------
నసబెట్టకు నాతోనిక
పసివాడను నీదు యొడిని బానిస నైతిన్
వెసలను దీర్చగ మురియుచు
పసిబాలుఁడు పెండ్లి యాడి పడసెఁ గుమారున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " బాణమ్ములు గ్రుచ్చు కొనఁగ భామిని మురిసెన్
-----------------------------------------
ప్రాణము నీవే నంటిని
త్రాణగ ననుసతిని జేయ తరుణియె కోరన్
వీణియ మ్రోగెను వలపుల
బాణమ్ములు గ్రుచ్చు కొనఁగ భామిని మురిసెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " రక్షా బంధనము సేయఁ బ్రాణము వోయెన్ "
----------------------------------
రక్షించుము ప్రియ సోదర
అక్షయమగు ప్రేమతోడ నాదరమొప్పన్
కక్షను నిండిన దైత్యుల
రక్షా బంధనము సేయఁ బ్రాణము వోయెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " పద్య రచన "
బీటలు వారిన భూమిని
దాటుచు పోవంగ నెంచి దాహము దీర్చన్
నీటిని చేకొను నెపమున
బాటయె కడుదుష్ట మైన బాధను మరచెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్ "
---------------------------
ఇష్టంబుగ పండితుడై
క్లిష్టం బైనను ముదముగ కీర్తిని గెలువన్
నష్టము గాదిది మనసుకు
కష్టం బవధాన విద్య కాదనిరి కవుల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తూగుచు సిరి సంపదలను
వీగుచు స్నేహితుల నడుమ వేడుకలందున్
రోగము లొసంగు జనులకు
భోగము లనుమాని నంత భూరి సుఖమ్ముల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్ "
----------------------------------
గట్రా చూలియె దలచిన
చట్రాతిని నారఁ దీయ! జయ్యన వచ్చున్
పేట్రేగిన సతి తోడను
కాట్రేడున కైనగాని కాదట వశమౌ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య
" గోటితో సరిపోవు దానికి గొడ్డలేటికి వద్దురా "
----------------------------------------------
మాటి మాటికి మాట మర్చెడి మాయలోకము నందునన్
రాటు దేలిన మానవాళికి రాజసమ్ముల భోగముల్
నీటి మూటల బాసలందున నిక్కమేగతి పోరినన్
గోటితో సరిపోవు దానికి గొడ్డ లేటికి వద్దురా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
" సమస్య " ఏనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్ "
-----------------------------------
నేనూ నాదను భావన
ఏనుఁగు , చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్
మానుము చిన్నా పెద్దను
మేనది శాశ్వతము గాదు మీరిన ప్రేమన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి ....... సమస్య
" ఏక దంతుని వాహన మెలుక కాదు "
------------------------------------
పశువు పక్షియు జంతువు పైన దిరుగు
సురలు వరముల నీయగ శుభము లొసగు
ఏక దంతుని వాహన మెలుక కాదు
కాదు కాదను వారిని గాంచ మిలను

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " పద్య రచన "
---------------------------
కలువలు నిండిన తటమున
వెలుగులు విరజిమ్ము నంట వెన్నెల దొరయౌ
కులుకుచు గుసగుస లాడగ
వలపుల వలవేయ నెంచె వయ్యా రమునన్

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

నేదునూరి వారి నెమ్మది పులకించి
వ్రాసినట్లు దోచె పద్యమరయ
కందమంతయు మకరందపు రుచి నిండి
కలువ , కలవరేని వలపు పండె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ధన్య వాదములు రాజారావు గారు .తమరు మళ్ళీ శంకరాభరణము లో రసరమ్య మైన మీ పద్యములను వినిపించ గలరని మనవి

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

తమరి సమాదరణ పూర్వక సూచనకు ధన్యవాదములు రాజేశ్వరి గారూ ,
తమరు పెద్దలు . మన్నించండి . ఐనను ....

కవి వృషభులు విహరించే
బవరమ్ముల బురద గుంట ప్రక్క నిలిచినన్
లవలేశమైన పూయుదు
రవహేళన పంకిలమ్ము లందలి విబుధుల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
" పద్య రచన "
-------------------------
గురుశబ్ధ వాచ్యుఁ డెవ్వడు
పరుసమ్ముగ బలుకువాడు పామరుడె కదా
వరమనుచు కొలుచు వాడట
పరివేదన జేయకుండ పరమేశుడటన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య " క్రుళ్ళిన వంకాయ మేలు కూరకు యెపుడున్ "
---------------------------------------
త్రుళ్ళుచు దెచ్చితి వీవిటు
క్రుళ్ళిన వంకాయ - మేలు కూరకు యెపుడున్
కళ్ళకు గాంచిన నిగనిగ
వెళ్ళుము కూరలను దెచ్చి వేగమె బడికిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " సమస్య "
" యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్ "
-------------------------------------------
ఏసనగ ప్రమద గణమట
యేసును నమ్మినఁ ద్రినేత్రుఁ డిచ్చును సిరులన్
ఏసును నీశుడు నొకటని
వాసిగ తెలిపెదరు బుధులు వాదన లేలా
---------------------------------
పద్య రచన " కమలముల వంటి కన్నులు "
మొదటి పాదము "
---------------------------------
కమలముల వంటి కన్నులు
కమనీయపు రూపు రేఖ గాంచిన చాలున్
విమలము నిండిన మనసున
మమతల సిరులెన్నొ పొంగి మనకిల వేల్పౌ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి { పద్య రచన ]
--------------------------------------
చుక్కలు మిలమిల మెరిసెను
చక్కని చంద్రికల చెంత సరసము లాడన్
మిక్కిలి మురియుచు మామయె
చెక్కిలి మీటుచును కులికె చెంగల్వ దరిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నీతులు జెప్పెడి వారలు
గోతులు ద్రవ్వుచును మిగుల గోప్యము నుండన్
రాతలు మార్చెడి నేరుపు
చేతల యందునను త్రోయు శీవపు కాటున్
--------------------------------------------
శంకరాభరణము నుండి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అటఁ జనికాంచె భూమిసురుఁ డంబరచుంబి శిరస్సరజ్ఘరీ
పటల ముహుర్ముహు ర్లుఠధ భంగ తరంగ మృదంగ నిస్స్వన
స్పుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్

ఇది మనుచరిత్ర లోనిది

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణమును నుండి " శ్రీ గోలి హనుచ్చాస్త్రిగారి సమస్య " లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్ "
------------------------------------
కం.
బంగారపు నగలందున
సింగా రించగ ప్రతిమను సిరులే విరియున్
గంగను మునిగిన మదికుశ
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
" సమస్య " విస్కీ బ్రాండీలవలన విజ్ఞత హెచ్చున్."
---------------------------------------
మస్కా గొట్టగ భార్యకు
విస్కీ బ్రాండీలవలన విజ్ఞత హెచ్చున్
హస్కును గొట్టుచు నేర్పుగ
పుష్కల మగు లాభ మంట పురుషుల కెపుడున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం నుండి
సమస్య " కుసుమము తాఁకఁగనె నుసురు గోల్పడె న్యాయం "
--------------------------------------------
గుసగుస లాడెను మల్లెలు
రుసరుస లాడుచును నవ్వె రోజా పూవుల్
కసికసిగ పలికె నప్పుడు
కుసుమము తాఁకఁగనె నుసురు గోల్పడె న్యాయం

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " సమస్య "
" చను బాలను తండ్రి తీయ సంతస మందెన్ "
-------------------------------
అనువగు నిలయమ్మనుకొని
చను , బాలను తండ్రి తీయ సంతస మందెన్
కనులకు పండుగ జేసెడి
ఘనమగు పుత్రికను ప్రీతి కౌగిలి జేర్చెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య " న్యస్తాక్షరి[ వర్ణన ]
ప్రతి పాదములోని మొదటి అక్షరములు కలిపిన " ద, స ,రా, లు ." రావలెను
-----------------------------------------
దశమి పూజల దుర్గమ్మ తనరు మదిని
సరస సల్లాపముల యందు సంత సముగ
రాస లీలల నృత్యాల రమణు లంత
లుప్త క్షణమందు బతుకమ్మ సప్త పదిని

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం నుండి . శ్రీ శంకరయ్యగారి సమస్య .
" అవధానమ్ముల నుండరాదనె సమస్యా పూరణం బెన్నడున్ "
---------------------------------------------------
నవనీతంబగు కావ్యకన్యకల నానందంబునన్ విందుగా
అవధానమ్ముల , నుండరా దనె ? సమస్యాపూరణం బెన్నడున్
సవరిం చంగను పద్యమందునట సౌజన్యంబనన్ వింటిమే
శ్రవణా నందము నొందనేరముగదా శ్రావ్యంబుగా ధారణన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ కంది శంకరయ్య గారి సమస్య"పామునుఁ దినఁ గోరి కప్పబారెఁడు సాగెన్ "
-------------------------------------
ఏమని జెప్పుదు వింతని
దోమకు హస్తికిని వలపు దూరం బెంతౌ ?
క్షేమము మరచిన లాలస
పామునుఁ దినఁ గోరి కప్ప బారెఁడు సాగెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణము నుండి సమస్య " చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు "
-----------------------------------
వేప తినగ తిక్త వేయిలాభ ములంట
మేను కెంత మిన్న మేల నంగ
కాక రెంత ఘనము పాకమందున వంట
చేఁదు తీయ నగుచు క్షేమ మొసఁగు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
శ్రీ కంది శంకరయ్యగారి సమస్య " మార జనకుఁ డతఁడె మార వైరి "
------------------------------------
సృష్టి జేయు జగతి పుష్టినీయ గలకు
మార జనకుఁ డతఁడె మార వైరి
మసన మందు జనుల భసిత మలదుకొంచు
పాప పున్నె మందు ప్రమద మలరు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " శ్రీ పోచిరాజు కామేశ్వర రావుగారి సమస్య "
" అవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్ "
------------------------------------------
భవనము లందున కులుకుచు
సవనము లనుపేరు బెట్టి చషకము బట్టన్
కవనము లల్లుచు ప్రీతిగ
అవనీశ్వరు లెల్ల కల్ల లాడెడు వారల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి సమస్య " క్రొత్త వత్సరమునఁ గోటి వెతలు "
---------------------------------
నిన్న లోన కలిసె మిన్నంటు వెతలన్ని
వన్నె చిన్నె లన్ని వలస జేసి
చిందు లేసి వచ్చె వందనము లటంచు
క్రొత్త వత్సరమున గోటి వెతలు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని సమస్య " ఒకటి ఒకటి గూడి ఒకటె యగును "
----------------------------------------
ఇతర సంఖ్య లందు మితిమీరి పెరుగుచు
గుణిత మందు హెచ్చు గొప్ప గాను
ఒకటి ఒకటి గూడి ఒకటె యగును వింత
కలిపి జూచి నంత పలుకు రెండు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి సమస్య "
మదిరాపానము చౌర్యమున్ పరసతీ మానాపహారమ్ము...
ఇది పద్య ప్రారంభము. దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని వ్రాయండి
------------------------------------------
మదిరా పానము చౌర్యమున్ పరసతీ మానాపహారమ్ము నన్
సదనం బున్వీడి రేబవళ్ళిదియె నాసౌఖ్యంటన్ మోదమున్
మది కీడెంచక వ్యాధులన్ బడసి తామైకాన బంధం బులన్
మదిలో పొంగిన బాధలన్ దలచి నేవాపోవగా నేటికిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి ఒకానొక అవధానములో శ్రీ నరాల రామారెడ్డి గారి సమస్య " కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ "
-----------------------------------------
అందము చిందెడి పిల్లలు
బంధనములె వరమటంచు బాధ్యత లందున్
చందనము వంటి భర్తను
కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

కుందనపు బొమ్మ , సుమశర
సంధానిత పూలరెమ్మ , సఖియ , సఖునితో
బంధనమున విభుని కర
కుం - దనమును కోంలాంగి కోరదు సుమ్మీ .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మీ పద్యం బాగుంది .ధన్య వాదములు రాజారావు గారు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ ఆంజనేయశాస్త్రి గారి సమస్య " కట్నము గోరిన వరుని జగమ్ము నుతించున్
-----------------------------------
పట్నము నందున కొలువని
పట్నాయ కుపరి ణయమ్ము వరమని యెంచెన్
రాట్నము వలెపని జేయగ
కట్నముఁ గోరిన వరుని జగమ్ము నుతించున్


రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " ముదుసలిం గొట్టువారలె పోటు మగలు ."
-------------------------------------
అదను జూచుచు పక్షిని వ్యాధు డనగ
శరము సంధించి జంపును వరమ టంచు
ముదుసలిం గొట్టువారలే పోటు మగలు
పిరికి తనమందు కొరగాని బేల పలుకు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి పోచిరాజు కామేశ్వర రావు గారి పద్య ప్రారంభము "
---------------------------------------------
కనియెన్ రాముడు లంకలోనగల యాకాంతా లలామన్ మదిన్
వినిసంతో షమునందునన్ బొగిడి యావీరాంజనేయున్ హితున్
వనమున్ వేడుకమీర కేకివలె భావావేశమున్ బొందుచున్
వినువీధిన్ విహరించెనే యెదను నేవేవో సుమాళిం చినన్
---------------------------------------
శ్రీ శంకరయ్య గారి సమస్య " హరిని హరి హరించె హరి కనంగ "
------------------------------
హరిని గాంచి కలువ విరిసె ముదముగాను
గగన మందు తొలగె కమల ధరుడు
నయము గాను పాట హరికంఠ మునవిందు
హరిని హరి హరించె హరి కనంగ
--------------------------
మొదటి హరి = చంద్రుడు
కమలధరుడు = సూర్యుడు[హరి]
హరికంఠము = కోకిలకంఠము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " వనిత కామింప నొల్లని వాఁడు గలఁడె "
---------------------------------------
లలిత లావణ్య సొగసరి వలపు లందు
మలయ మారుత వీచికల్ వలను చిక్కి
మధుర భావాల మల్లెలే యెదను పొంగి
వనిత కామింప నొల్లని వాఁడు గలఁడె ?
----------------------------
పచ్చ చేమంతి యందాల నెచ్చెలి తన
వలపు సంకెళ్ళు బిగియించి కలత రేపి
జిలుగు వెన్నెల సౌరులు చిలక రించ
వనిత కామింప నొల్లనివాఁడు గలఁడె ?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ పోచిరాజు కామేశ్వర రావుగారు పంపిన పద్య ప్రారంభము
--------------------------------------------
చేసిన వన్ని తప్పులని చింతిల నేమి ప్రయోజనంబు తా
జేసిన పాపముల్ గడకు జీవిత మంతయు భీతిచెం దకన్
దోసమటంచు నిప్పుడిక దు:ఖము నొందక మార్గ మెంచుచో
వాసవు పాదముల్ గనిన పావన మైమది మోక్షమొం దునే.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " పద్య రచన
----------------------------
రామ రాజ్యము నేలిన ప్రేమ మూర్తి
తల్లిమాటను తలదాల్చు తనయు డపుడు
తరిగె తనయుని మమతల బరువు బ్రతుకు
బిడ్డ ప్రేమను కొనలేని బిచ్చ గత్తె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

విపరీతము గాదు నేడిల
నుపచర్యలు జేయరంట నుత్తమ వనితల్
నెపమెన్నక వారి కొఱకు
అపరాధము కాదు తల్లి నాశ్రమ మంపన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

గజల్ మిత్రులకు చిన్న మనవి
వ్రాయాలన్న ఉత్సుకతతో వ్రాసానే గానీ నాకేమి రాదు ఇది నామొదటి ప్రయత్నం.పొరబడిన మన్నించ గలరు
నాకు ఉత్సాహమును కలిగించిన రాయవరపు లక్ష్మి గారికి ధన్య వాదములు
------------------------------------------------
అందమొలికే చందమామను పొంద కోరని దెవ్వరు ?
సొగసులీనెడు సుందరాంగుల వలపు లేరని దెవ్వరు
చంటిపాపల బోసినవ్వుల పుకరింతల హయిలో
మైక మందున పొంగిపోవుచు ముదము చేరని దెవ్వరు ?
తల్లిదండ్రుల ప్రేమలందున తన్మయములో మునిగినా
యవ్వనములో జంటతోడుగ నడక మారని దెవ్వరు ?
వలపు సీమలతేలి యాడుచు ప్రేమ సుధనే గ్రోలగా
పరిణయమ్మను పదము పాడుచు కలల పోరని దెవ్వరు ?
సృష్టిలో గలప్రేమ బంధము మించినది యేమున్నది
మధురమైనా వలపుధారల తడిసి ఆరని దెవ్వరు ?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారిచ్చిన పద్య ప్రారంభము " పతిపరదేశం బేగిన "
---------------------------------------
పతిపర దేశం బేగిన
సతితన బాధ్యత యనుకొని సంసారమునన్
గతుకుల వెతలను దాటుచు
యతివలె తానుండి భర్త నారాధించున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " హృద్రోగము మేలుసేయు నెల్లజనులకున్ "
---------------------------------
భద్రాద్రి రాము గొలిచిన
హృద్రోగము మేలుసేయు నెల్లజనులకున్
ముద్రిక జేకొని హనుమయె
భద్రముగా జేరె నంట భగవతి సీతన్







రాజేశ్వరి నేదునూరి చెప్పారు...


గజల్
పల్లెసీమల సౌరులన్నీ మేనివంపులు ఒలకబోసెను
వెండివెన్నెల జిలుగులన్నీ తళుకు సొంపులు ఒలకబోసెను

కొమ్మకొమ్మను మావిచివురులు కొసరికొసరీ మెక్కెనేమో
పరవసించిన గండుకోయిల వగరుకెంపులు ఒలకబోసెను

మంచిముత్యపు చిప్పలన్నీ కనులబాసల నింపగా
గండదర్పణ తలములందున వలపుతూపులు ఒలకబోసెను

పొందుకోరుచు నిండుమనమున కలలతేలితి వెఱ్ఱినేనై
మధువునిండిన హృదయవీణయె చిలిపితలపులు ఒలకబోసెను

పరునిదారగ నిన్నుచూపీ వలపుహేలగ కన్నుగీటితె
జాలిగొలిపీ బూదికుప్పలు జాలిచూపులు ఒలకబోసెను

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " నన్నయ తిక్కనాది కవినాధులు సెప్పినదే కవిత్వమా ?
-----------------------------------------------------
నన్నయ తిక్కనాది కవినాధులు సెప్పినదే కవిత్వమా ?
చెన్నుగ మంచిభా షణము చిక్కని భావము ప్రోదిజేయుచున్
వెన్నుని గాధలన్ దెలిపి వేలకు వేలగు పండితోత్తముల్
మిన్నగ వ్రాసినంతనిల మేలొన గూర్చెడి కావ్యమౌ గదా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి పద్య రచన
-----------------------------
గర్వము గలిగిన వారలు
సర్వము గోల్పోవు నంట సహనము లేక
న్నుర్విని భక్తిగ గొలిచిన
సర్వుని గెలువంగ వచ్చు సౌదా మినియై
-------------------------------------------
సత్య దలచెను ధనమంత చక్క బెట్టి
పతిని తూచగ కొదవేల వెతను బడగ
దైవ లీలలు తెలియక తనరు మదిని
సవతి గెలువంగ భక్తిని సన్ను తించె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ గోలి హనుమచాస్త్రి గారి సమస్య " గుడ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్ "
--------------------------------------
ఉండ్రాళ్ళను గణపతికని
బండ్రాయిని బియ్యముంచి బరబర ద్రిప్పన్
గుండ్రముగ రవ్వ జుట్టగ
గుండ్రాతికి నోరువచ్చి గొల్లున నేడ్చెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సమస్యా పూరణం
--------------------
ఇదియేమి చిత్రమో మరి
అదిగోద్వారక యనఁ గననయ్యెను ఢిల్లీ
యిదివిష్ణు మాయ గావున
విదళించగ తరము గాదు వేవురు కైనన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
మధువునిండిన వలపుతెమ్మెర చెఱకుగడయై గుచ్చు తోంది
కలతచెందిన కన్నెమదినే గుండెదడయై గుచ్చుతోంది

పూలతోటను నడచి నడచీ ముళ్ళబాటలు అడ్డుకుంటే
వొళ్ళుతెలియని మైకమందున పూలజడయై గుచ్చుతోంది

వెండిమబ్బున నిండుజాబిలి కనులకింపుగ కదులుతుంటే
పలుకరించని గండుకోయిల బరువుమెడయై గుచ్చుతోంది

ఈసుజెందిన మేఘమాలిక తెరలుతెరలుగ దాటుతుంటే
మురిసిమెరిసే తీపికలలను కులుకుజడయై గుచ్చుతోంది

చెలునిప్రేమకు దూరమైతె జగతినిండుగ శూన్యమే
ప్రియునికన్నుల వేదనేమో మనసుయెడయై గుచ్చుతోంది

















రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య "
అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వగన్ "
------------------------------------------
పొంగుచు వ్రాయగో రితిని భూరిగ ఛందము నింపి పద్యమున్
మ్రింగుడు గాకపో యెనిది మేలగు పాదము బూర్తి జేయగన్
నింగిని నేలకున్ గలుపనేర దిదెంతటి కష్టమో యనన్
అంగదుఁ డాగ్రహించి దమయంతినిఁ దిట్టెను గర్ణుఁ డేడ్వగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
వలపు వాకిలి తెరవలేదని అలిగినావా ప్రేయసీ
మల్లెమాలలు అల్లలేదని తొలగినావా ప్రేయసీ

సాగుబడనీ బీడుగుండెని వదలిపోయితి వేమొగానీ
మనసువీణను మీటిపోవగ కదలినావా ప్రేయసీ

కోటిదివ్వెల కాంతినీవని కలలుగంటిని వెఱ్ఱినేనై
మమతపెంచీ మనసుదోచీ మరలినావా ప్రేయసీ

గగనమంటిన ప్రేమనాదని తెలుసుకొని మనమంటినే
విరహవేదన పెంచిగుండెను దొలిచినావా ప్రేయసీ

క్షణికమే మదినిలుపుకున్నామక్కువేగద చుక్కగా
దివ్వెదివ్వెకు వెలుగునేనని తలచినావా ప్రేయసీ



రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారి సమస్య " నాచెంతకు జేరినావు న్యాయమ చెలియా "
---------------------------------
ఏచెంత నుంటి వోమరి
నాచెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా
నీచెంత నుండు వారలు
నీచింతన మందు మునిగి నిస్త్రాణు లగున్
---------------------------------------
జూచితి నిన్నొకనాడని
నాచెంతకుఁ జేరినావు న్యాయమ చెలియా
నాచెంత నున్న సతిగని
నీచెంపలు వాయగొట్టు నిక్కము సుమ్మీ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి మంతా భానుమతి గారి సమస్య " ద్రౌపది కొక్కఁడే పతిగదా యని చెపిన మెచ్చి రెల్లరున్ "
-------------------------------------

తాపసి యైనద్రో వదట తాపము నందున నీశుకో రగా
శాపము నొందినా డనగ శంకరు సాసన మంచునిం ద్రుడే
రూపము లైదుగా మరలి రూఢిగ నొక్కడె మర్త్యుడౌ నటన్
ద్రౌపది కొక్కఁడే పతిగదా యనిచెప్పిన మెచ్చి రెల్లరున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
ఇంద్రధనుసు మనప్రేమకి మెరవబడెను అటు చూడు
తెల్లమబ్బు మనకోసమె పరవబడెను అటు చూడు

వికసించిన కలువలన్ని గుసగుస మంటున్నాయి
తారలన్ని నునుసిగ్గులు ఒలకబడెను అటు చూడు

ఆలసించిన అమృతమే విషజ్వాలగ ఎగసిపడును
క్షణములన్ని పదేపదే కలచబడెను అటు చూడు

దారితప్పి సోయగాలు ఏపొంతను దాగినవో
గుబులుబుట్టు సెగలురేగి వెలగబడెను అటు చూడు

మబ్బుపట్టు గగనానికి అలముకొన్న చీకటిలో
మగమనసులు తాకట్టున వెతలబడెను అటు చూడు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

గజల్
మల్లెపూలు వసివాడని సందెలంటె కడుమోహం
చందమామ వెల్లివిరియు విందులంటె కడుమోహం

మలయానిల వీచికలకు మేనుపులక రించునంటి
గులాబీల పరిమళాల చిందులంటె కడుమోహం

అనురాగము లొలికించెడి ప్రేయసితెలి నగుమోమున
విరహమందు మైమరచెడి పొందులంటె కడుమోహం

లేతమేని వంపులందు అజంతాల అందాలకు
చిరుసవ్వడి గిలిగింతల అందెలంటె కడుమోహం

విరహతాప మందుమునిగి అభిసారిక నీవైతే
రేరాజును గెలిపించే పందెమంటె కడుమోహం

గెలిచిఓడి మురిపెమంటె నీకెంతటి వినోదమో
ఓడిగెలిచి సాధించెడి చందమంటె కడుమోహం





రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
బిగికౌగిలి ఒదిగిపోవు ప్రేమొక్కటి చాలదా
ప్రణయనౌక సాగిపోవు పదమొక్కటి చాలదా

పిడికెడంత గుండెలోన పదిలపరచు మమతలకై
కడివెడంత పాలపుంత మెరుపొక్కటి చాలదా

వికసించే విరజాజుల పరిమళాల సౌరులందు
సేదతీరి అలిగినంత విరుపొక్కటి చాలదా

విశ్వమంత ఏలుచున్న రేరాజువు నీవైతే
రేరాణిగ మదినిండిన గెలుపొక్కటి చాలదా

ఝల్లుమన్న పేదగుండె పిడికెడంత ప్రేమతప్ప
ఏమిచ్చును తీరిపోని బాధొక్కటి చాలదా




రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మావితోట తోపులోన మెరుపేదో మెరిసె నంట
చిన్నదాని గుండెలోన తలపేదో విరిసె నంట

వస్తాననీ నారాజూ రాలేదే ఇంతవరకు
వేచివేచి విరహమందు కనులనీరు కురిసె నంట

విరులవనము నుండిపరిమ ళించుగాలి వలపుమోజు
రెచ్చగొట్టి నామదినే ఎగతాళిగ మురిసె నంట

ఎదసవ్వడి వినిపించగ పొదమాటున దాగెనేమొ
వగరుమేసి కోయిలమ్మ పొగరుచూపు మరిసె నంట

తోటకంత నీరుపోసి పాటలందు ప్రేమతెలిపె
ఎగసిపడిన భావలహరి పూలవాన దిరిసె నంట













రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
చేనుమేసే కంచలుండిన రక్షణెక్కడ జగతిలోన
పెరిగిపోయిన స్వార్ధముంటే మనసులెక్కడ జగతిలోన ?

మిటనంటిన ధరలముంగిట చంటిదానికి పాలుకరువే
కరువుజీతపు బడుగుజీవికి శాంతమెక్కడ జగతిలోన ?

మోసగించిన వలపురేనికి శృంఖలంబులు వేయరెవ్వరు
కన్నెమనసును కృంగదీయని వారలెక్కడ జగతిలోన

మూడుముడులకు ప్రాణమిచ్చెడి సతినివీడుచు పోదురెటకో
మమతపెంచే పసిడిపిల్లల పితరులెక్కడ జగతిలోన

వలపువానలు చిలకరించీ బాసలందున ముంచితేల్చీ
తోకముడిచీ వెన్నుజూపెడి సాధువెక్కడ జగతిలోన ?








రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " సంపత్ కుమార్ శాస్త్రి గారి సమస్య "
తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్ "
-------------------------------------
తత్పరతయె లేకున్నను
తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్
సత్పురుషు లనెడి వారలు
నుత్పలముల పూజజేయ నుత్తమ మనుచున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్ "
--------------------------------------------------
చోద్యము నీయుగం బునను సూక్తులు చెప్పెడి వారలన్ గనన్
మద్యముఁ ద్రాగువారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్
పద్యము గద్యమున్ నుడువ భక్తిని దైవము గొల్చువారలున్
విద్యను నేరుపున్ చదువ వేడుక మీరగ నెందరుం దురే ?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " ధర్మసత్ర నిర్మాణముల్ దగని పనులు "
---------------------------------
ధనము వెచ్చించి నిర్మించ ఘనము గాదు
భక్తి వినయము లేనట్టి ప్రజల కొఱకు
ధర్మ సత్రనిర్మాణముల్ దగని పనులు
బ్రతుక సుఖముగ నేతలు బాగు పడగ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
మబ్బుతెరల మాటునుండి వలపుపిలుపు ఆపలేవు
కంటికొసల దొంగనవ్వు చిలిపికులుకు ఆపలేవు

ఊగిఊగి తెరచాపట కడలియంచు ముద్దులిడగ
అలసియలసి కదలనంటె కలతమలుపు ఆపలేవు

వెండిమబ్బు తెల్లదనం మదినిండుగ చల్లదనం
నీమమతల ప్రేమవనం విరులతలపు ఆపలేవు

అలలుపొంగి విరహమందు గుండెబరువు మోయలేక
గిలిగింతల సరసాలకు సిరులవొలుకు ఆపలేవు

ప్రియునివొడి జేరుటకని దూరమునే కొలిచికొలిచి
తాపమింక తాళలేక మరులబలుపు ఆపలేవు









రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " కాకర బెల్లమ్ము వోలెఁ గడు పులుపు కదా !
-----------------------------------
భీకరమగు చేదందురు
నీకొఱకై పులుసు గలిపి నేర్పుగ వండన్
శాకమునందు నగుడమును
కాకర బెల్లమ్ము వొలెఁ గడు పులుపు గదా !

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

రాకేందువదన బెల్లపు
పాకములో పులుపు గలిపి వండెను , భళిరా !
'కాకర' రుచి నేమందును ?
కాకర బెల్లమ్ము వోలె కడు పులుపు గదా !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

dhanya vaadamulu raajaaraavu gaaru

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య
" దేశ భాష లందు తెలుగు లెస్స "
-------------------------------------
మంచు జిలికి నట్లు మధుర రాగము లీను
జీవ మొలుకు నంట జిలుగు వెలుగు
నితర దేశ మందు మితిమీరి పొగడంగ
దేశ భాష లందు తెలుగు లెస్స

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
చెలిమనసును తెలుసుకొనుచు నడచుకున్న వారెవరో
కలతబడక జీవితమే తెలుసుకున్న వారెవరో

ఆడదంటె అంగడిలో ఆటబొమ్మ కాదటంచు
తెలిసికూడ వనితమనసు పంచుకున్న వారెవరో

సంసారపు సాగరాన ఎదురీదుచు నిలచినంత
అలలతేలు ప్రేమనౌక అడ్డుకున్న వారెవరో

ప్రేయసిగా ప్రేమగీతి పాడిపాడి అలసిపోయి
జీవితమే పంచుసతిని హత్తుకొన్న వారెవరో

మకరందపు ప్రేమఝరిలొ మైకమందు ఆదమరచి
వికటించిన ప్రేమవిరుపు నింపుకున్న వారెవరో

గుండెబరువు తాళలేక జ్ఞాపకాలు వీడలేక
రాజీపడి బతుకుబండి నడుపుకున్న వారెవరో






రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " అప్పులున్న వారె గొప్పవారు "
అప్పు జేసి నంత యాడిగెలువ వచ్చు
రేసు లందు మిగుల కాసు లొచ్చు
కలల తేలి తుదకు కష్టాల కడలిని
అప్పు లున్న వారె గొప్ప వారు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ కందులవరప్రసాద్ గారి సమస్య " కలవారలకున్ గరళము గావలెను సుమీ "
-----------------------------------------
అలరించు వేల్పు నైనను
కలిమిన్ మఱిలేమి నైన కలలో నైనన్
చెలిమిని గోరుచు సరసన
కలవారలకున్ గరళము గావలెను సుమీ !

గరళము = అమృతము, మందు , మధురము ,రసము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
మబ్బుకన్నె అలిగిందా నీలిజల్లు కురిసింది
గగనమెంత మురిసిందో వలపుజల్లు కురిసింది

కడలికెంత ఆనందం అలలువెల్లు వైనాయి
పాదాలను ముద్దుబెట్టి ప్రేమజల్లు కురిసింది

గుండెమండు బాధలన్ని గాలిలోన కలసిపోయి
దిక్సూచిగా వెలుగురేఖ మెరుపుజల్లు కురిసింది

జ్ఞాపకాల తెరలుపొంగి ఎదనుగాయ మౌతుంటే
పదేపదే మరవాలని మంచుజల్లు కురిసింది

మొగ్గలోనె రాలినట్టి మధురభావ వలయాలకు
గుండెరాయి చేసికొనగ చేదుజల్లు కురిసింది

వెక్కిరించు కాలమంత ఎదుటనిలచి నవ్వుతుంటె
కసికసిగా రోషమందు ఈసుజల్లు కురిసింది

కరుడుగట్టు తీపికలలు కరగలేక మొరాయిస్తె
నిస్పృహతో నిట్టూర్పుల వేడిజల్లు కురిసింది






రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
మధురమైన జీవితాన మరపురాని ఆరోజులు
అందమైన చెలిమిపంట తిరిగిరాని ఆరోజులు

వోణీలను విడిచిపెట్టి చీరలనే కట్టికట్టి
సొంపులతో సింగారపు నడకలందు ఆరోజులు

భువినేలెడు రాణులవలె గగనానికి నిచ్చెనేసి
విహంగాల విహరించెడి నిజంకాని ఆరోజులు

కొసరుకొసరు చూపులతో కసరివిసరు వాలుజడలు
వలపుగెలుపు దొరకనీక కనులలోని ఆరోజులు

చెలిమంటే జీవితమని ఎన్నటికీ విడిపోమని
ప్రమాణాలు చేసుకున్న దరికిరాని ఆరోజులు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " చంపకమాలకు గణములు సభరన మయవల్
-------------------------------------
ఇంపట నజభజ జజరలు
చంపక మాలకు గణములు,సభరన మయవల్
సొంపుగ నమరిన చాలును
వంపులు దిరిగిన కరమది మత్తేభ మనన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
కూలిపోవు పేకమేడ లేకడుతూ ఉంటానూ
రాలిపోవు జీవితాన కలబడుతూ ఉంటానూ

అందమంత నాదేనని రాయంచను నేనేనని
కులుకువంపు లొలకబోసి తెగబడుతూ ఉంటానూ

మదినిపూయు విరజాజుల మాలలెన్నొ కట్టికట్టి
వాడిపోవు విరహమందు దిగబడుతూ ఉంటానూ

పగలంతా కసరివిసరు ఇనబింబము వెంటతరిమి
రేరాజును కలువనెంచి వెశబడుతూ ఉంటానూ

నిన్నలోన కలసిపోవు కంటికొసల కలవరింత
ఎన్నడేని తీరునంచు ఒడిబడుతూ ఉంటానూ

ప్రేమపూల వర్షమందు తడిసితడిసి అలసిసొలసి
మమతలందు మదినినిలిపి వెలిబడుతూ ఉంటానూ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " త్రాగు బోతు గొప్ప తత్త్వ వేత్త "
-----------------------------
సాధు వేష మేసి బోధజే యునునీతి
త్రాగుఁ బోతు గొప్ప తత్త్వ వేత్త
కలిని కుదిపి జూడ తెలుపును కధలెన్నో
జగతి గాంచి నంత ప్రగతి వెలుగు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్ "
----------------------------------
బెదరక నేర్వగ వచ్చును
పదిలము గాపండితుల మ్రోల పరిణతి నొందన్
సుధలూరెడి కవనములను
మధువును గ్రోలెదరు దైవ మందిర మందున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
దూరదేశ మేగితివే వెలపదిలము జాగ్రత
మదిచెదిరీ వలపుపొంగు కలపదిలము జాగ్రత

నన్నుమరచి మాటకలిపి వసంతాలు గడచిపోయె
చట్టుచేమ గాలితెరల అలపదిలము జాగ్రత

శ్రావణమిది పెండ్లియని మదినెత్తురు మరుగుతుంటె
కలబోయని మూగదైన శిలపదిలము జాగ్రత

దొరసానుల రాజ్యంలో నీవుదొరవు కాబోకుము
ప్రియురాలి మదినెరుగుట ఇలపదిలము జాగ్రత

రాజీపడి బతకలేను నినుమరచుట వశముకాదు
నావాడే రేరాజను నెలపదిలము జాగ్రత

పారావా రములుదాటి పరుగిడితివి శిరివెంటను
మరుజన్మకు నైనగాని మిలపదిలము జాగ్రత

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ పోచిరాజు సుబ్బారావు గారి సమస్య" వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్
-------------------------------------
సాధువు వలెనటి యించుచు
వేధించగ భార్య నెపుడు వేశ్యల వెంటన్
సాధించు భర్త కంటెను
వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " పద్య రచనకు గణయతి ప్రాస లేల "
--------------------------------
పండి తులయిన వారలు పదిలము గను
నెటుల వ్రాసిన చెల్లున దెంత మాట
పద్య రచనకు గణయతి ప్రాస లేల
యనుచు వ్రాసిన మనకంత ఘనత రాదు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి .శ్రీ శంకరయ్య గారి సమస్య " వైరములను బెంచు బంతి కూడు '
-------------------------
నేటి విందు లందు మేటిభోగము లంట
పంక్తి భోజ నంబు పాత మాట
కులము మతమ టంచు కోరితగవు లాడ
వైర ములను బెంచు బంతి కూడు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
వెన్నెల వెలుగులు కడలికి సొంతం
పున్నమి రేయది చెలిమికి సొంతం

వనమున పూవుల సొగసులు ఎవరికి
ఎండిన మోడులు అడవికి సొంతం

దాచిన మదినే దోచిన వారలు
వంచన చేసిన పెదవికి సొంతం

కన్నెల మనసును కోయుట కంటెను
దహనము జేసిన ధరణికి సొంతం

నటనము జేయుచు నెమ్మిని మోసము
నరరూ పముగల నరులకు సొంతం

ఆసిడు వలపులు పిశాచ ములకట
మనసూ మమతా మనిషికి సొంతం



రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
మనసుదోచి మమతనింపి మరలిపోవ న్యాయమా
చురకత్తుల నడుమదింపి తొలగిపోవ న్యాయమా ?

వలపుజల్లు నందుమురిసి గుండెగుడిగ చేసానే
కలువచెంత చెలిమిజేయ కదలిపోవ న్యాయమా ?

వినువీధిని విహంగమై ఎగిరినంత సాటెవరని
రంపముతొ కోసికోసి రగిలిపోవ న్యాయమా ?

చందమామ కౌగిలనీ మల్లెపూల లోగిలనీఎ
సంపంగుల సోయగాన సోలిపోవ న్యాయమా ?

పీయూషము ద్రావిద్రావి చషకమునే విసరివేసి
ముసుగుచాటు మైకమందు తూలిపోవ న్యాయమా ?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండిశ్రీ పోచిరాజు సుబ్బారావు గారి సమస్య " ధర్మజునకుఁ గన్న తల్లి ద్రౌపది యందున్ "
---------------------------
మర్మము తెలియని కుంతియె
ధర్మజునకుఁ గన్నతల్లి , ద్రౌపది యందున్
ధర్మసతి పాండవులకట
నిర్మలమగు మనసు తోడ నెమ్మిని కొలువన్ !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
తపముజేసి గెలిచానూ మోహించుట తెలియాలీ
వలపుసిరులు పదిలముగా కురిపించుట తెలియాలీ

మాయమర్మ మెరుగనట్టి నవనీతము చెలిమనసట
రవికిరణము సోకకుండ మురిపించుట తెలియాలీ

పొగలుసెగలు తగులనట్టి నెలరాజుని పిలిచితేని
చలచల్లని వెన్నెలంత చిలికించుట తెలియాలీ

విషనాగుల లోకమందు వేచియుండు రాబందుల
కుతంత్రాల మహిమలన్ని పరికించుట తెలియాలీ

పైశాచిక సంకెలలను విరగగొట్టి సాగాలీ
నరకమైన రహదారుల ఝళిపించుట తెలియాలీ

కలిమహిమలు తెలియనెంచ కలవరమా నీకెందుకు
నీమనసును శుద్ధిజేయ నినదించుట తెలియాలీ
------------------------------------

పొరబాట్లను ఎవరైనా సవరించ మనవి







రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య
" ప్రియుడా రమ్మనెను తల్లి ప్రేమగ తనయున్ "
----------------------------------------
నయముగ జెప్పెను సుతునకు
జయమును సాధించ వలెను సాహస క్రీడన్
రయముగ బోవలె షణ్ముఖ
ప్రియుడా రమ్మనెను తల్లి ప్రేమగ తనయున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

1-తెలుగు గజల్ [గగనమంత ]
-------------------------------

మబ్బుకన్నె అలిగిందని చిన్నబోయె గగనమంత
వలపువాన కురియాలని తపనబడెను గగనమంత

ఇల్లుజేరె దారిలేదు వెలుగుబాటె కానరాదు .
సందుచివర అలికిడేదొ వెతలబడెను గగనమంత్

రౌడీలకు సమయమిపుడు రాకుమారు డెవరైనా
అశ్వమెక్కి రాగలడని మెరవబడెను గగనమంత

బాలుడొచ్చి పత్రమిచ్చి పారిపోయె నేదరికో
మెచ్చినోడు దాగెనేమొ కసరబడెను గగనమంత

పరవశించి ఎదనిండిన ప్రేమజల్లు మురిపించగ
వేయివీణ నాదమ్ములు విసరబడెను గగనమంత .

లేఖలోని రాజుఎవడొ దివినుండీ అవనిదిగిన
వేలుపనుచు సంతసమున వెదకబడెను గగనమంత









రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తెలుగు గజల్ [1]
--------------------------
నాతోడుగ నీవుంటే వలకాడను నేనౌతా
నీఊహల కౌగిలిలో వగకాడను నేనౌతా

కలనైనా పరపురాని కలవరింత నీరూపము
దివినేలే దేవకన్య విలుకాడను నేనౌతా

నిలువెల్లా విషమేనట ఈమానవ లోకంలో
నాకమందు వెదకివెదకి చెలికాడను నేనౌతా

ఆయమునా తటినివేచి వేణువునే ఊదుకొనుచు
ఎంతకాల మైనగాని నెఱకాడును నేనౌతా

గోపికలకు కొదవలేదు రాధయెగా నారాణని
జగతిలోన నిలచిపోగ గమికాడును నేనౌతా
-------------------------------------------
తెలుగు గజల్ [2]
--------------------------
దొరకలేదు సుధారసము విశ్వమంత గాలించిన
మరపురాదు నీదుమోము అందమెంత గాలించిన

కనుపించవు చెలియందెల తెలివెన్నెల సొగసులేవి
వినిపించవు చిరుమువ్వల రవములెంత గాలించిన

నీప్రేమకు దాసుడనై దేవదాసు నైపోతిని
నాగుండెల రగులుపొగల మంటలెంత గాలించిన

రాయిలాగ మారావా మౌనరాగ మందునిలచి
ఈదీనుని మదిలోపలి రోదనెంత గాలించిన

తిరిగిరాని కాలానికి కరిగిపోవు స్వప్నాలను
పాతరేసి బతుకుబండి నడవదెంత గాలించిన

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...



తెలుగు గజజ్ [3 ]
-------------------
నీవులేక బతుకలేను క్షణమైనా నినువీడక
ఉండగలను నీసరసన యుగమైనా నినువీడక

కొత్తకొత్త భావాలతొ మదినెంతో పులకించగ
సంతసమున గడపగలను కలనైనా నినువీడక

ప్రేయసినే విడచినంత హాయికలుగు మదిశాంతిగ
పొంగిపొరలు మధురోహల నిముసమైన నినువీడక

మత్తుగొలుపు మధుపానము సురలకెంత ఆనందమొ
చెలి అధరము కంటెమిన్న మధురమైన నినువీడక

ఇంటింటను తన ఇంటను కొలువుండగ నీదుఘనత
కొనియాడగ కాఫీయని నిలయమైన నినువీడక

ఎంతప్రేమ జగమంతట నీదుపేరు అణువణువున
మనలేదట సేవించక ప్రాణమైన నినువీడక

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తెలుగు గజల్ [4.]
------------------
ప్రేమించుట తెలుసుగాని విలపించుట తెలియలేదు
పంచేసిన మదినేమో విరమించుట తెలియలేదు

మొగ్గలోనె తుంచేసిన మమతలన్ని కొడిగట్టెను
వెలిగించగ రారుఎవరు పరికించుట తెలియలేదు

నమ్ముకొంటి నీనీడను కన్నవారి నొదులుకొంటి
కరుణించని కసాయివై మురిపించుట తెలియలేదు

మోడువడిన జీవితాన చిగురించగ ఆశలేదు
మోజులేవి తీరకనే ముగియించుట తెలియలేదు

వేచివేచి వేదనలో మరణించుట చేతకాదు
శకుంతలను కానునేను మెప్పించుట తెలియలేదు

యామినిలో వెదకివెదకి జీవత్సవ మైతిగాని
మిణుకుమన్న వెలుగురేక కనుపించుట తెలియలేదు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తెలుగు గజల్ [5]
-------------------
అందమైన జీవితాన వింతవింత సొగసులంట
మైకమందు కొత్తజంట కొంతకొంత సొగసులంట

నునుసిగ్గుల చెలివలపులు మధురమైన అనుభూతులు
కొసరికొసరి విసరునేమొ ఎంత ఎంత సొగసులంట

లోకమంత ప్రేమమయం లోకాలను ఏలేద్దాం
అతిశయమున తేలిపోవు సుంతసుంత సొగసులంట

వరమైనది తీయనైన విరగబడిన యవ్వనాలు
చరమాంకపు లోగిలిలో చింతచింత సొగసులంట

కలహంసల లోకమందు విహరించిన నందనాలు
తలచితలచి మురిపించగ పులకింతల సొగసులంట


వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ఏమీ తెలుగుం గజలులు
ప్రేమామృత సరసిజములు , ప్రేమిక తను శ్రీ
రోమాంచపు పులకింతలు
సోమ రసాస్వాద మధురసోద్వేగములున్ .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
రాజారావు గారూ !మీ అభిమానానికి ధన్య వాదములు.
ఫేస్ బుకులో గజల్మహల్ చూసి సరదాగా రాయాలనిపించింది. ఆప్రయత్నమే మీ అభిమానం.కృతజ్ఞతలు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

telugu-gazal
చందమామను పొందరాదట ఎందుకేమని అడుగుతున్నా
కులుకుబెళుకుల తారలందరి పొందుకేమని అడుగుతున్నా

నింగినేలను తాకలేదట వంగిభూమికి తరలిరాదట
శివునితలపై నుండిగంగయె చిందులేమని అడుగుతున్నా

తీయతీయని ఫలములీయగ చెట్టుచేమల కేమిఫలితము
త్యాగనిరతికి హద్దులేకను విందులేమని అడుగుతున్నా

ప్రేమవిలువలు తెలుసుకోకనె వలపువీధిని వెతలపాలిట
మమతనిండిన బంధములకే హత్యలేమని అడుగుతున్నా

ఫూలవనిలో చెలియయేదని పూవుపూవును మోదమందగ
మైకమందున కంటికొసలతొ పలకరించని అడుగుతున్నా


రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నాప్రేమయె కెరటములై కదులుతోంది ప్రేమనౌక
నీపలుకుల మధురిమలో తేలుతోంది ప్రేమనౌక

చూడబోవు కలలవిందు మనకోసమె వేచిఉంది
క్షణమేఒక యుగముఓలె నడుపుతోంది ప్రేమనౌక

ఇంద్రధనువు రంగులన్ని కలకలమును రేపుతుంటె
వేచివేచి వేదనలో నలుగుతోంది ప్రేమనౌక

మరలమరల తిరిగిరాదు మనుషజన్మ గొప్పదంట
తమకమందు కొత్తరుచుల మునుగుతోంది ప్రేమనౌక

కలువరేని మెరుపులన్ని కనులవిందు చేస్తుంటే
సొగసులన్ని తాగితాగి కులుకుతోంది ప్రేమనౌక

ఉల్లమునే రంజింపగ వెల్లివిరియు కోరికలకు
హద్దులతో పనిలేదని సాగుతోంది ప్రేమనౌక

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్ "
------------------------------
చిరకాలము యశము మిగుల
పరహితమును కోరువాడు పరమేశు డనన్
నరుడై బుట్టిన పరిణతి
మరణము లేనట్టివాఁడె మర్త్యుఁ డనఁ దగున్ .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " కప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె "
---------------------------
దాన ధర్మ మిడగ ధనమున్న చాలును
తనయు డొకడు లేక తల్ల డిల్ల
దిగులుమాని తుదకు మిగుల భక్తినివెం
కప్ప సంతుఁ గోరి కాళిఁ గొలిచె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " చేతన్ చిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్ "
-------------------------
రాతలు మారిన తరుణము
పాతకములు వెంటనంటి భ్రష్టుని జేయన్
హేతువు లేకనె కర్మకు
చేతన్ జిప్పను ధరింత్రు శ్రీమంతు లిలన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య "రామచంద్రుడు శయనించె రంభ తోడ "
-----------------------------------
విరహ వేదన మందున వరమ టంచు
దలచె సీతను కనుమూసి తనరు మదిని
రామ చంద్రుండు శయనించె రంభ తోడ
పీడ కలగాంచ నాతడు భీతి చెందె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ కంది శంకరయ్యగారి సమస్య "పూలను సిగలోన దురుము పొలతులు గలరే "
--------------------------------
వాలుజ డలందు నేడిల
మాలతి మల్లెల సొగసులు మచ్చున కైనన్
నీలపు కురులే కరువట
పూలను సిగలోనఁ దురుము పొలతులు గలరే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajal
తనువుకేమొ వలపుపూలు ఫూశాయని తెలిసిందీ
చెలికన్నుల మెరుపువలలు ముసిరాయని తెలిసిందీ

మదినందన వనమునందు మమతలెన్నొ పులకించెను
వెన్నెలలో చకోరములు కులికాయని తెలిసిందీ

ఆమనియని కోయిలలే కూసెనేమొ పరవసించి
తరులుగిరులు దాటుకుంటు పిలిచాయని తెలిసిందీ

రేరాజును కలవాలని తారలేమొ తపియించగ
ఈసుజెంది జలధరములు అలిగాయని తెలిసిందీ

మధురమైన అనుభూతులు మరలమరల మిగలవోయి
అడుగడుగులు తడబాటును పొందాయని తెలిసిందీ

భారమైన దూరాలకు బరువుబ్రతుకు తప్పదులే
దరిజేరగ మధురోహలు కరిగాయని తెలిసిందీ








రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శకరయ్య గారి సమస్య " కనికరము జూపఁ దగదు కాంతల పైనన్ "
------------------------------
ధనమును సంపా దించుచు
వినయము లేకుండ మెలగి వేధించ పతిన్
తననే మించున దెవరన
కనికరముం జూపఁ దగదు కాంతల పైనన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా "
-------------------------------
శారద దక్షుని యజమున
నేరకతా వెడలినంత నిర్వేదమునన్
వైరాగ్యము నొంది దలచె
నారికిఁ దన పుట్టినిల్లు నరకమ్ము గదా !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

GAJAL
మనసంతా నీరూపే మరిగిస్తూ ఉన్నదిలే
దరిజేరే దారియేదొ బంధిస్తూ ఉన్నదిలే

అనుకున్నవి జరగకనే అనుకోనివి ఎదురైతే
భరియించక తప్పకనే బాధిస్తూ ఉన్నదిలే

ఒకరేమో నీమదిలో వేరొకరికి నువుప్రాణం
ఎదురీదని అడుగుజాడ కరిగిస్తూ ఉన్నదిలే

ఇరువురినీ కలవనీక అనామకుని జతకలిపీ
ఆటలాడు విధి జాలిగ కవ్విస్తూ ఉన్నదిలే "

కపటమైన జగతిలోన వికటించిన మోహమంత
శృతితప్పిన రాగమేదొ పలికిస్తూ ఉన్నదిలే

ఏకాకీ వాలనట్టి ఏకాకిగ మైకమందు
గగనానికి నిచ్చెనలే తగిలిస్తూ ఉన్నదిలే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

GAJAL
త్రాచువంటి వాలుజడను కొలిచిచూడ కోరితినే
సొగసులీను నడుముహొయలు పట్టిచూడ కోరితినే

కలువకనులు గాంచినంత మెరుపులెన్నొ కనిపించెను
వలపువిరులు అణువణువున విరియచూడ కోరితినే

అందుకొన్న లేఖచదివి దివినేలెడు రారాజని
గగనమంత కలయజూచి నిన్నుచూడ కోరితినే

తేనెలొలుకు నీప్రేమను తనివితీర గ్రోలాలని
భువినంతా పాత్రజేసి నింపిచూడ కోరితినే

నాజీవన తారవనీ నీప్రేమకు దాసుడనని
విశ్వమంత గాలించిన తెలిపిచూడ కోరితినే

పావురాలు హంసలేల పంచభూత ములేసాక్షి
మనసుమనసు పెనవేసిన మమతచూడ కోరితినే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య "వ్రతపీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ బ్రపూజింపఁగన్ "
మత్తేభము.
క్రతువుల్ జేయగ మోక్షమంచు మునులా కార్యంబులన్ శ్రద్ధగన్
జతచే యంగను పుత్తడిన్ మలచి విజ్ఞానమ్ముగా సేవలన్
వ్రతపీఠమ్మునఁ బాదరక్ష లిడుమా భక్తిన్ బ్రపూజింపఁగన్
వెతలన్ బాపగ శోభలన్ విరియు దేవేరుల్ ప్రసిద్ధం బుగన్
----------------------------------------
" వ్రతపీఠ్ము పైనఁ బాదరక్షల నిడుమా "
కందము.
అతివలు పూజలు సేయగ
వ్రతపీఠము పైనఁ బాదరక్షల నిడుమా
సతతము నిలిపెడి తావున
పతనము గాకుండు నంట బహు పుణ్యంబౌ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

GAJAL
సాగిపోవు నీఅడుగులు నేకొలిచిన విరుల ఝరులు
ఎదమీటిన తొలివలపుల ప్రియరాగపు సిరుల ఝరులు

వనమంతా గాలించిన నినుమించిన సుమములేదు
గగనమంటి తారలలో నీనవ్వుల మరుల ఝరులు

కసాయివై వెనుదిరగక గమకముతో తరలిపోతె
దూరాలను కొలవలేక నాకంటికి వెతల ఝరులు

హరివిల్లున నీరూపమె కలువచెలిని నీబింబమె
వెంటనంటు వనమయూర నాట్యాలపు కళల ఝరులు

నింగినేల ఏకమైన బ్రమలందున మునిగితేలు
కలలందున విరిగిపడే తెలినురుగుల అలలఝరులు

మత్తువదలి కనులుతెరచి మంత్రజాల మనితెలిసీ
ఉలికిపాటు తెరలుతొలగి మలయపవన సురల ఝరులు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " మరణ మందు తోడు మాధవు నకు"
----------------------------------
ఆట.వెలది
అసుర జంప నెంచి యానంద మొందుచు
సత్య తోన వెడలె సమర మునకు
తల్లి చేత సుతుడు వెల్లిబోవ నరకు
మరణ మందు తోడు మాధవు నకు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " " రతిపాదాలకు మ్రొక్కియీ కవనసామ్రాజ్యాన పేరొందుమా "
---------------------------------
వెతలన్ బాపగ మోదమొం దగను వేవేలౌ ప్రభంధమ్ము లే
అతిప్రీ తిన్ రచి యింపగా వలయు కావ్యమ్మే వినన్ గాంచినన్
మితమే లేదట గ్రంధముల్ కవులు సామీరేని వ్రాయంగభా
రతిపాదాలకు మ్రొక్కియీ కవనసామ్రాజ్యాన పేరొందుమా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

వియ్యము నొందగా మదిని వేడుక మీరగ మైత్రితో ననున్
నెయ్యము తోనసం తసము నేరము లెంచక కోడలిన్ గనన్
కయ్యము లాడుచున్ చిలిపి గారపు కోర్కెల సోయగం బులౌ
దయ్యమె భార్యయై నపుడు దక్కును భర్తకు సర్వసౌ ఖ్యముల్
-------------------------------------------------
వయ్యారపు విరుపుల సతియే
కయ్యానికి నెదురు జూసి కవ్వింత లతోన్
సయ్యాట లసరసాల కులుకు
దయ్యమ్మే భార్య యయిన దక్కును సుఖముల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi Sree Samkarayya gaari samasya [kumDa-bamDa-damDa-bemDa ] dattapadi
-------------------------------------
మండు టెండన ఛత్రమై మాడ కుండ
అండ దండగ నిలచెడి నాప్త హితుడు
పంట బండగ నీవుమా వెంట నున్న
బింక మందున నినువీడ బెండ గిల్లు

బెండ గిల్లు = బాధ పడు
























రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

gajals = 31

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

31 gajalu
నినుప్రేమగ పలకరించు నేస్తముంది నీలోనే
మధువుచిలుకు రసరమ్యపు భావముంది నీలోనే

కలలవంటి అలలపైన తేలియాడ వలదంటిని
కల్లలైన లోకంలో దొరకనంది నీలోనే

నమ్ముకున్న వారంతా నరలోకపు రక్కసులే
వమ్ముగాదు నామాటలు వెతకమంది నీలోనే

ప్రాణమిడిన పిల్లలైన త్రాణకాదు మనకెప్పుడు
కట్టుకున్న ప్రేమవిలువ మిగలనంది నీలోనే

ఈఒంటరి పయనంలో ఎవరికెవరు ఏమికారు
బ్రమలువీడి ధర్మనిరతి సాగమంది నీలోనే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య .
" మగఁడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె "
----------------------------------------
ఊరువుల నుండి యూర్వశి శౌరి తనయ
పూత మంత్ర మహిమను మాంధాత పుట్టె
నాటి నుండియు మగవారు మేటి యనగ
మగఁడు ప్రసవించి శిశువును మగువ కిచ్చె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" రైకను విప్పి కలిసినది రణనిహతుఁ బతిని "
---------------------------------
భీకర పద్మ వ్యూహము
నేకత ముగనుత్తర పతి నిర్గతి నొందన్
శొకము వెల్లువ లయియే
రై ,కనువిప్పి కలిసినదిరణ నిహతుఁ బతిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" దేవా పాల్గుణమందు వచ్చును గదా దీపావళీ పర్వమే " లేదా
" పాల్గుణమున దీపావళి పండుగ కద "
------------------------------
శిశిర ఋతువంట చలిమంట చెలియ చెంత
పాల్గుణమున , దీపావళి పండుగ కద
కోటి దివ్వెల కాంతులు కురియు జగతి
కొత్త జంటల మదినిండ కులుకు వలపు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" దత్తపది "కన్ను-ముక్కు-చెవి-నోరు"
------------------------------
కన్నుల పండుగ జగతిని
వెన్నెల వెలుగేమొ మింట వేయి విధమ్ముల్
సన్నని ఘాటది ముక్కున
మిన్నంటు రొదకు చెవి నోరు మెలిబడి పోవన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ గుఱ్ఱం జనార్ధన రావుగారి సమస్య "
" సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్ "
=============================
నిగ్గులు వాఱెడి వనితకు
మొగ్గును జూపుచు ముదముగ మోహము నందున్
దిగ్గున మనసీయగ చెలి
సిగ్గెగ్గులు లేని మనుజు సిరి తా వలచున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరాణము నుండి .శ్రీ శంకరయ్యగారి సమస్య
"పెండ్లి కేగుము చంకలో పిల్లితో తోడ "
-------------------------------
పెండ్లి కేగుము చంకలో పిల్లి తోడ
తరలి వత్తురు తమవారు తగుల ములకు
విందు సంబర ములయందు మందు గలిపి
మేళ తాళము లున్నవి వ్యాళ ములకు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శకరయ్యగారి సమస్య "
" భువి వీడితి వేల బాల మురళీ కృష్ణా "
----------------------------------
దివినుండి దిగిన వరముగ
నవరస ములనొలుకు గాన గంధర్వు డవై
అవనిని గారడి జేయుచు
భువి వీడితి వేల బాల మురళీ కృష్ణా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" సానుల పొందు గల్గిననె సత్పురుషుల్ యశమున్ గడింతురే "
-----------------------------------------------
మేనులు రంజిలంగ మదిమోహము నందున దేలియాడగన్
మేనకవంటి యప్సరస మీరిన వంపుల సోయగమ్ములన్
కానక త్రోసిరాజనిన కాంతలు నెంతయు నిచ్చగించరే
సానుల పొందు గల్గిననె సత్పురుషుల్ యశమున్ గడింతురే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్ " లేదా
" బలరాముం డవనీతనూజఁ గని దుర్వారమ్ముగా నవ్వెరా "
------------------------------------------------
కం .
ఇలలో వింతలు మెండట
కలనైనను పలుకరాని కాంతల పలుకుల్
కలతలు నింపగ జనులకు
బలరాముఁడు సీతఁ జూచి ఫక్కున నగియెన్ .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య
" సారాకొట్టుకు సజ్జనాళి వెడలెన్ సాహిత్య గోష్ఠుల్ గనన్ "
-----------------------------------
రారాపోదము దమ్ముకొట్టగను యారాజన్నవీధిన్ కొసన్
సారా కొట్టుకు , సజ్జనాళి వెడలెన్ సాహిత్య గోష్టుల్ గనన్
ధీరోధాత్తులు పండితోత్తములు సందేహింపకన్ వేగమున్
రారాజుల్ కడుప్రీతి నొందగను వీరావేసమున్ వేడుకన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య "
ఇన హిమకర బింబము లుదయించె నొకమొగిన్ "
----------------------------------
" ఇనుడట వెలయగ తూరుపు
వెనువెంటనె పడమటింట వెలుగుల రేడై
కనుపించ జగతి సొగసులు
ఇన హిమకర బింబము లుదయించె నొకమొగిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" అమ్మా రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగఁడే"
--------------------------------
కొమ్మా యెచ్చటి కేగితి
విమ్ముగ నానీడ నుండి యేలుము నన్నే
కమ్మని ప్రేమను పంచెద
నమ్మా రమ్మనుచుఁ బిలిచె నాలినిఁ మగడే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ మిట్టపెల్లి సాంబయ్యగారి సమస్య
"భర్త మరణ వార్తనువిని భార్య మురిసె "
-------------------------------
సతిని వేధించు పురుషుడు సరస మనక
సాని కొంపల దిరుగుచు కాని పనుల
నిత్య నరకము జూపించు నేత పురుగు
భర్త మరణవార్తను విని భార్య మురిసె
-------------------------------
నేత పురుగు = మర్కటము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ పోచిరాజు కామేశ్వర రావుగారి సమస్య
" మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్ "
---------------------------------------
ప్రౌఢిమ గలిగిన భార్యలు
గఢాలింగనము నందు గాదిలి తోడన్
గాఢపు కోరిక తెలుపుట
మూఢాచారము ముదితకు మురిపెము నొసగున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య ."
" నూతన వత్సరమ్మని వినోద విహారము లేల మిత్రమా ?
------------------------------------------
పాతవి మారుటన్ నిజము పాటక లోకము బాధ లందునన్
యాతన బొందుచున్ తుదకు ప్రాణము బోవగ భీతి జెందకన్
చేతికి రానిరొక్క మున చీకటి కోణము రేపవల్ గనన్
నూతన వత్సరమ్మని వినోద విహారము లేల మిత్రమా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారి "సుజనరంజని" వారి
సమస్య " హద్దుల నుంచనేల భువి హక్కుల కోసము మక్కు వేలనో "
-----------------------------------------------------------
సద్దును జేయకుండగను సాహస మందున కబ్జజేయుచున్
పెద్దల వోలె మౌనముగ బింకము జూపెడి దొంగ లుండగన్
హద్దుల నుంచ నేల భువి హక్కుల కోసము మక్కువేలనో
వద్దను వారలెవ్వరిల వారసులుండిన దక్క కుండునే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ గుఱ్ఱం జనార్ధన రావుగారి సమస్య
" సోదరులిర్వురున్ మిగుల శోభిల జేసిరి రెండు గాధలన్ "
--------------------------------------------
బాధలు లేవటంచు బహు భాషల తీరు గనంగ చోద్యమౌ
వాదన లేలచూ డగను భారత మాతకు కొప్పరుల్ గదా
వేధము లందునన్ గురియు వేలకు వేలుగ ధర్మసూత్రముల్
సోదరు లిర్వురున్ మిగుల శోభిల జేసిరి రెండు గాధలన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ పోచిరాజు కామేశ్వర రావుగారి సమస్య
"చను నజ్ఞత వినఁ బలువురఁ జదువది యేలా "
---------------------------------
వినుటకు నీతులు మెండగు
తినినంతనె వేము చాల తీయగ నౌనున్
కనులకు విందగు ప్రమదము
చను నజ్ఞత వినఁ బలువురఁ జదువది యేలా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ పోచిరాజు కామేశ్వర రావుగారి సమస్య "
" కన గంధర్వ పురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా "
------------------------------------------------
వినుమోయీ జగమంత మిధ్య యని నేవేదంబులన్ దెల్పినన్
మనమా మేమను వాంఛలందు మునుగన్ మాయా వినోదంబులే
నినదించన్ సరికాద టంచుమది నానీబేదముల్ వీడకన్
కన గంధర్వ పురమ్ము కాపురము శంకల్ నీకు నింకేలరా .
-------------------------------------
కం. కాంచ గంధర్వ నగరమ్ము కాపురమ్ము
-----------------------------
మెఱుపు తీగలు గగనాన మరుల విరుపు
మింట నంటిన చుక్కల కొంటె వలపు
నలుక వీడిన నెలవంక పులకరింత
కాంచ గంధర్వ నగరమ్ము కాపురమ్ము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య.
" మూషిక మొండు పిల్లిఁ గని మొద్దు లొసంగెను ప్రేమ తోడుతన్ "
---------------------------------------
వేషము మారినంతనె వివేకము లేకను స్వార్ధ చిత్తమున్
శోషిల జేయనెంచ గను సూచన భావము మోసమందునన్
రోషము జూపుచు న్నెదుటి రూపము జూడగ చెక్కగా వుతన్
మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతో డుతన్
--------------------------------------------------
మూషికం బొండు పిల్లిని ముద్దు లాడె "
-------------------------------
పిల్లి పైనను కసిమెండు వెల్లి విరియ
పగను దీర్చగ యదనుకై పరిత పించ
కొయ్య బొమ్మను మురియుచు కోరి నంత
మూషికం బొండు పిల్లిని ముద్దులాడె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మక్కువ మీరగా మదిని మల్లెల సౌరులు నిండియుండగా
చక్కని భావవీ చికలు సంతస మందగ మైక మందునన్
బొక్కను చూడగా మది లబోదిబొ యంచు దపించు చుండెడిన్
నిక్కము సుమ్మినా తనువు నీరస మందున సోలిపో యెనే

బొక్కపెరిడె = ఒకజాతి పాము .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య
" చదవని వాడె పండితుడు సంపద గల్గిన వాడె బీదయౌ "
--------------------------------------------------
చదవక యున్ననేమి భవసాగర మందున బాధ్యతల్ గనన్
విధి కెదురీది నిల్చియు వివేకము నందున బుద్ధి క్లేశమున్
కుదిరిక నుండి దైవమును కోరుచు లోకపు శాంతి భద్రతల్
చదవని వాడె పండితుడు సంపద గల్గినవాడె బీదయౌ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శంకరయ్య గారి సమస్య
" ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే "
---------------------------------------------
ప్రీతిగ రణమున గెలువగ
జూతిగ నేబోద మన్న సూతుడు లేడే
హేతువు తెలుపగ నాతడు
ఖ్యాతినిఁ గన్నట్టి వీరుఁ డన నుత్తరుఁడే

జూతి = వేగము,వడి,జవము,తొందర

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ఏతావత్ సెల్ ఫోనులు
చేతిలొ వాట్సప్ లు నెట్ మెసేజ్ లు వెలిసినన్
రాత సమాచార మిడగ
ఖ్యాతిని గన్నట్టి వీరుడన ' నుత్త 'రుడే .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" దత్తపది." నిధనము,శవము,పాడె,చితి "
---------------------------------
చూచితిని ధనము కొఱకని
వేచితి శైశవము నుండి వేడుక మీరన్
వేచిరి హితముగ పెండ్లికి
తోచిన పాటలను పాడెఁ దొయ్యలి యచటన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" ఆలు లేని మగడు హాయి నందు "
----------------------------------
రమ్ము త్రాగ వచ్చు రమ్మియాడు కొనుచు
వమ్ము జేయ కుండ దమ్ము గొట్టి
బారు లందు మిగుల భక్తిగా దిరుగుచు
ఆలు లేని మగఁడు హాయి నందు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" కులటం గని పిలిచి సీత కురు లల్లమనెన్ "
----------------------------------
వలవేసి వెదకి నంతనె
లలనా మణులకును సాటి లాలిత్యము నన్
పలుచన జేయుట తగదని
కులటం గనిపిలిచి సీత కురు లల్లమనెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" బీరతీఁగకుఁ గాచె మెండుగ బెండకాయలు చూడుమా "
--------------------------------------
సారవంతపు భూమిపై సరసమ్ముగా పెరుగంగనా
కూరలన్ కనువిందు జేసిన కోసివండగ వింతయౌ
బీరతీఁగకుఁ గాచె మెండుగ బెండకాయలు చూడుమా
మారిపో యెనెకా లమింతగ మాయజాలపు లోకమై
-----------------------------------
కం.
" బీరతీఁగకు గాచెను బెండకాయ. "
----------------------------------------
వింత యుగమిది జగతికి సొంత మవగ
మాయ మంత్రము లెన్నియొ మహిమ లంట
అణువు నణువుకు దెలుసట యవని కెపుడు
బీర తీఁగకు గాచెను బెండ కాయ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ గరికపాటి వారి సమస్య "
ముగ్గురు సుందరీమణుల ముద్దుల భర్తయె యాదియోగియౌ "
-----------------------------------------
తగ్గుము డాంబికం బులిక తన్మయ మొందుచు పొంగి పోవుటన్
ముగ్గురు సుందరీ మణుల ముద్దుల భర్తయె యాదియోగియౌ
భగ్గున మండి పోవుదురు భర్తకు మూడవ దేడ నుండెనో
ఎగ్గులు మాని ముందుగను వేరొక రెవ్వరొ పేరు చెప్పుమా ?
---------------------------------------------
ఆ.వె. " ముగురు స్త్రీల మగఁడు మొదటి యోగి "
---------------------------------------
శిరము పైన నొకరు స్థిరముగా నుండెను
సగము దేహ మనుచు సదరు కొనెను
ముద్దు మోము తోన మురిపించి యెటజేరె ?
ముగురు స్త్రీల మగఁడు మొదటి యోగి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి గరికపాటి వారు పూరించిన సమస్య " కొర్నె పాటి విద్యాసాగర్ గారు అందించగా
---------------------
కైవల్యము నిడె భక్తుడు
రావణునకు, బుత్రుఁ డయ్యె రాముఁ డయోధ్యన్
దేవుని వరమున దశరధ
జీవనుడుగ జనక సుతను చేపట్టె నటన్





రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " గరికపాటి వారు పూరించిన సమస్య " శ్రీ కొర్నెపాటి విద్యాసాగర్ గారు పంపిన
" భారత యశ మడఁచు సుమ్ము భావితరములన్ "
------------------------------------
కం.
శారద యనుమాట మరచి
పౌరుల కింగ్లీషు జొరము పట్టిన పీడన్
తీరని కాంక్షల జిక్కిన
భారత యశ మడఁచు సుమ్ము భావి తరములన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ మిట్టపల్లి సాంబయ్య గారి సమస్య
" రైతు విలపించు రాజ్యమ్ము రాణ కెక్కు "
--------------------------------------
వర్ష పాతమె యధికమై కర్ష కునకు
పంట చేలన్ని మున్నీట మింట గలియ
పస్తు లుండగ ప్రాణాలు పరమ పధము
రైతు విలపించు రాజ్యమ్ము రాణ కెక్కు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" న్యస్తాక్షరి [శ్రీ-సి-నా-రె] నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా ఉండాలి. " ఆటవెలదిలొ "
-----------------------------------------
శ్రీకరముగ రచన జేసిగగన మంత
సినిమ సీమ నేలి సిద్ధు డయ్యె
నాక మందు జేరి నవకవ నములల్లి
రెయి బవలు సలుపు రెచ్చి పోయి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" చచ్చె సింహము జింకచే నచ్చె రువుగ "[ఆకాశవాణి నుంచి]
----------------------------------------
వరము పొంది యసురుడు కావరము చేత
భస్మ మొనరించ వెంటాడె భవుని శిరము
సూక్ష్మ బుద్ధియె లేకున్న చోద్య మదియె
చచ్చె సింహము జింకచే నచ్చె రువుగ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" పాకిస్తాన్ ప్రజలు విష్ణు భక్తులు శిస్టుల్ " శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" పాకిస్తాన్ ప్రజలు విష్ణు భక్తులు శిస్టుల్ "
----------------------------
లోకేశుని సేవించుచు
శాకా హారమును ముట్టి శైవులు కాగ
న్నేకాగ్రత పాటించగ
పాకిస్తాన్ ప్రజలు విష్ణు భక్తులు శిష్టుల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi Sree Samkarayya gaari samasya " vamka lEnidamma ramkulaaDi "
---------------------------
జలగ వంటి జనుల సంతసంబు కొఱకు
తనదు ప్రాణ ములను పణము పెట్టి
విలువ లేని బ్రతుకు వెలయాలిగా నెంచు
వంక లేని దమ్మ రంకు లాడి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

padya kavanam numdi
------------------------
తప్పులు జేసెడి వారల
మెప్పును పొందుట కొఱకని మీరిన భక్తిన్
గొప్పని తెలిసియు కులుకుచు
చెప్పులు చెప్పెడి కబుర్లు చెవులకు నింపౌ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi

కల్ల కపట మనక యుల్లము రంజిల్ల
లేత నవ్వు చిలికి ప్రీతి గాను
గుండె నిండ మధువు మెండుగా నింపుశై
శవము మోద మిడుఁ బ్రశస్త ముగను

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" వనితల ఖండించు వాఁడె బల్లిదుఁడగురా "
--------------------------
గనులను శోధన జేయుచు
ఖనిజములను వెలికిదీసి కాల్చగ కొలిమిన్
కనికరము లేక కపటపు
వనితల ఖండించు వాఁడె బల్లిదుఁ డగురా
--------------------------------
" వనితలు అంత కఠిన మైన వారు అని "

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

Sakaraabharanamu numDi " bhaaskaramma gaari samasya. "
" patiki cheera gaTTe sati mudamuna "
---------------------------------
పగటి వేష మనుచు పసివాని జడిపింప
పతికి చీర గట్టె సతి ముదమున
తల్లి దండ్రి నతడు తారుమారు గగాంచి
తెల్ల బోయి తుదకు తల్ల డిల్లె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారిసమస్య
" మాంసాహారమ్మె విప్రమాన్యం బయ్యెన్ "
------------------------------------
హింసించ ప్రాణుల నకట
సంసేవిత మనుచు జనులు సవనము నందున్
సంసార మందు సరసము
మాంసాహారమ్మె విప్రమాన్యం బయ్యెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఘనముగ పెంచకున్నసరి గారముతో మురిపింప నెయ్యమున్
దినమది కూడు గుడ్డలకు దీకొనజాలక స్వాస భారమౌ
మనమున క్షోభనింపికడు మాయలు జేయుచు తాను మైకమున్
జనకుఁడు సచ్చె నంచుఁగడు సంతసమందెను కూఁతు రయ్యెడన్

«అన్నిటి కంటే పాతది ‹పాతవి   481లో 1 – 200   కొత్తది» సరి కొత్తది»

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase