Pages

9, నవంబర్ 2012, శుక్రవారం

481 కామెంట్‌లు:

«అన్నిటి కంటే పాతది   ‹పాతవి   481లో 401 – 481   కొత్తది»   సరి కొత్తది»
రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" శాల్యోదన మిచ్చు నొక్కొ జవసత్వంబుల్ "
================================
కందము .
మూల్యము చెల్లించి తినే
మాల్యము దేవుని గళమున మంగళ మౌగా
కల్యాణ మందు విందుల
శాల్యోదనమిచ్చు నొక్కొ జవ సత్వంబుల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్ "
-------------------------------------
కందము.
బానిస బ్రతుకని కొందరు
కానని గీర్వాణ మందు కౌతుక మొందన్
తానే సతికంటె ఘనమను
సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" అష్టమి నాడె యట్ల తదియన్ జరుపం దగుఁ గాంత లెల్లరున్ "
------------------------------------------------
ఉత్పల మాల
కష్టము కాదటంచు నిల కాంతలు వేకువ ఝామునన్ భళా
యిష్టము తోడభోజ్య మని నెమ్మిని చద్దిని నుల్లిచా రులన్
అష్టమి నాడె యట్ల తదియన్ జరుపం దగుఁ గాంత లెల్లరున్
సుష్టుగ పూజలన్ జరిపి సోయగ మందున నూయలూగు చున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజన రంజని వారి సమస్య
" వరదలు మేలు మేలనుచు పాడుచు నాడిరి కేరళీయులే "
---------------------------------------
చంపక మాల .
సరిగమ పాట పాడుచును సాగర తీరము నందు కేళిలో
మురియుచు మేఘమా లికలు మోదము నందున వెల్గు లీనగన్
సరసపు వీణ నాదమ నిసంతస మొందుచు మైక మందునన్
వరదలు మేలు మేలనుచు పాడుచు నాడిరి కేరళీయులే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" మాతలు మువ్వురైన నొక మాతను కొల్చుట నీకు భావ్యమే "
-----------------------------------------
utpalamaala .
దాతలె యెందరున్న సరి దానము జేయగ సాధ్యమే యటన్
రాతలు మార్చునో యనుచు లక్షల కోట్లను గుమ్మరిం చినన్
నేతలు దోచుకొన్న సిరి నేరుగ దేవుని మ్రోలనుంచి యా
మాతలు మువ్వురైన నొక మాతను కొల్చుట నీకు భావ్యమే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం నుండి శ్రీ శంకరయ్య గారి
సమస్య " తోడ బుట్టువే యన్నకుఁ గీడొనర్చె "
---------------------------------
తేట గీతి .
అన్న దమ్ముల నడుమను మిన్న యనుచు
తోడ బుట్టువే , యన్న కుఁ గీ డొనర్చె
ననుచు పలికెడి వారలు కినుక వలదు
విందు జేసెను యమునికి పొందు కోరి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశ వాణిలో ప్రసారమైన నా పూరణ
సమస్య " లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై "
--------------------------------------------
మత్తేభము.
శయనా గారము నందునన్ మురిపెమౌ సాకారమే కోరికల్
భయమే దానవ రూపమున్ బలుక సౌభాగ్యమ్ము శోషిల్ల గన్
నయమే శోభిలు సంతసం బునను నానారూ పముల్ జూపినన్
లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" మాఘము సంక్ర మించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్ "
------------ --------------------------------
ఉత్పలమాల .
రాఘవు వీక్షణం బునను రాయిని మార్చెను నాతిగా యటన్
లాఘవ మందునన్ జలధి లంకన జేయగ ప్రాభవం బునన్
మేఘము వర్షమున్ కురియ మేలగు నంచును మానవాళికిన్
మాఘము సంక్రమిం చినది మార్గశి రంబునఁ గార్తికం బనన్














































రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్ "
==========================
తర్కము దెలియని బాలుని
అర్కజు డటపాశ మేసి ప్రాణము కోరన్
మర్కట రూపము బోవగ
మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్
---------------------------

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశవాణిలో ప్రసారమైన నాపూరణ
సమస్య " రణములె గద పండితులకు రమ్య క్రీడల్ "
-----------------------------------
పణముగ బెట్టుచు కవనము
గణుతింపగ సభను మెండు గరువము నొంద
న్నణగారిన తెనుగు వెలుగ
రణములె గద పండితులకు రమ్య క్రీడల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం నుండి శ్రీ కుప్పిలి శశిధర్ గారి సమస్య
" రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్ "
========================
కందము
ఇమ్ముగ సింగా రించుకు
రమ్మని తండ్రి పిలిచెఁ దొలి రాత్రికిఁ గూతున్ "
వమ్మగు తడవే యైనను
నెమ్మిని పిలువంగ వలయు నీకై యళియన్
===========================
అళియ = అల్లుడు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " కుప్పిలి శశిధర్ గారి సమస్య
" రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును ప్రేమ మీఱగన్ "
--------------------------------------
ఉత్పలమాల.
సమ్మరు వేళలం దునను సన్నని జాజులు మల్లెలే యటన్
జుమ్మని తుమ్మెదల్ సరస జాగర ణంబొన రించగా నిలన్
గుమ్ముగ సోయగం బునను కోరిన భర్తను చేరుకో వలెన్
రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును ప్రేమ మీఱగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
దత్తపది " మూఁడు- ఆరు-ఏడు-పది " అన్యార్ధంలో ప్రయోగిస్తూ భారతార్ధంలో వ్రాయాలి "
-----------------------------------
కందము
ఏడుగడ యైన సత్యయె
చూడగ పుత్రుని వధించె చోద్యము గాదే
వేడుక గాదట యారును
మూడుడు నరకుని గాలి పదిలము పూర్తిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్ "
--------------------------------------
ఉత్పలమాల
కన్నెల మానసం బునను గారడి జేయుచు మోదమం దగా
వన్నెలు జూపుచున్ మిగుల భాసుర మొప్పుచు తేజరిల్ల గన్
కన్నయ చేయలే నిదట కానిప నేమియ టంచుదెల్పుమా
చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" కాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్ "
-----------------------------------
కందము
రశ్మీ తృణాధి న్యాయము
కశ్మల మునుపార ద్రోలి కలహము వీడన్
భశ్మాసుర హస్తముల దృంచ
కాశ్మీరపు టలజడి జన కల్యాణ మిడున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్
---------------------------------
కందము .
గోత్రము తెలియని వానిని
ఆత్రముగా వలచి మురిసి యభిమా నించెన్
ధాత్రిని వింతలు కొల్లలు
పుత్రా ! రమ్మనుచుఁ బిలిచె బొలఁతియె మగనిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" రసమయ కావ్యము జనుల విరక్తులఁ జేయన్ "
--------------------------------
కందము.
మసనము శివునికి నెలవట
పసరము తిరుగంగ వలయు పచ్చిక బైలున్
పసతెలి యని పామరులకు
రసమయ కావ్యము జనుల విరక్తులఁ జేయన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశవాణి వారు చదివిన నాపూరణ
సమస్య " కొట్టెడు పతినిష్ట పడరె కోమలు లెల్లన్ "
----------------------------------
కందము.
పుట్టెడు ప్రేమను పంచుచు
పట్టెడు పచ్చడి మెతుకులు పరమా న్నముగా
పెట్టగ మోహము నందున
కొట్టెడు పతినిష్ట పడరె కోమలు లెల్లన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" రమణి పాపమ్ము గద పాశురములఁ జదువ "
----------------------------
రంగ నాధుని సేవించి పొంగి పోవు
రమణి, పాపమ్ము గద పాశురములఁ జదువ
నియమ నిష్టలు పాటించ భయము లేని
పల్లె వారము మముగాచు నుల్ల మలర

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" కనుల నీరు నింపి కట్టె దాళి "
-----------------------------
ఆ.వె
మమత పెంచి మదిని మనువాడ కోరిన
కలల రాణి వీడి కలత బడుచు
దుష్ట శక్తు లన్ని దోహద పడినంత
కనుల నీరు నింపి కట్టెఁ దాళి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూ గళమ్మునన్ "
------------------------------------------
ఉత్పల మాల .
సన్నని యొంపుసొం పులను చక్కని వాల్జడ సంతరిం చగా
నున్నని చెక్కిలింపు గను నూతన తేజము మత్తుజల్లి నన్
పన్నుగ నన్నుకోరు కొని ప్రాణమ టన్నను వీడగా దగున్
కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూ గళమ్మునన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ ధనికొండ వారి చిత్రమునకు "
-------------------
కందము
దినకరుని గంప నిడుకొని
వనలక్ష్మియె బయలు దేరె భార మ్మనకన్
మనమున సంతో షించగ
ఘనముగ బిడ్డను పెంచి గరువము నొందన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పద్య కవనం వారి సమస్య
" ఏడు మారె ఘడియ గోడు వినక "
------------------------------
ఆట వెలది
కాల మాగె నేని కలుషితం బగునేమొ
బీడు వారు భూమి పండ గోరి
శుభము లిడగ జగతి శోభల నందించ
ఏడు మారె ఘడియ గోడు వినక

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పద్య కవనం వారి సమస్య
" కనగ నరుడు చతుష్పాద గామి యయ్యె "
------------------------------
తేట గీతి.
ఘోర కలియందు కోర్కెలు మీరి పోవ
మంచి చెడులకు తావేది మచ్చు కైన
సొంత లాభము నాశించు మంద భాగ్యు
కనగ నరుడు చతుష్పాద గామి యయ్యె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

గజల్ .
వసంతాలు పూయించగ వనములనే పెంచాలీ
సంతసాలు నింపగోరి మనసులనే వంచాలీ

నిండుమనము సందడించి కాలమంత గడపాలీ
బాధసాధ లన్నిమరచి బరువులనే తుంచాలీ

కపటస్నేహ కాలుయశము కరుణరసము కురిపించగ
శక్తినీయ పరమేశుని శరణమునే వేడాలీ

అక్రమాల వక్రబుద్ధి అడుగులలో పడనీయక
సమసమాజ నిర్మితమగు నాకమునే చూపాలీ

నూతనాది వత్సరమున మారిపోవు సుంతయైన
ఆశలతో వేచివేచి నేతలనే వేడాలీ











రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నేడు ఆకాశవాణి వారు ప్రసారం చేసిన నా పూరణ
" సమస్య " కరి నినుడాక్రమణ జేసె కాంక్షలు హెచ్చన్ "
కం .
పరిణతి చెందని మనమున
సరితూ గనిభావ మందు చంచల మతియై
పరిపరి విధముల వేగుచు
కరి నినుడాక్ర మణ చేసె కాంక్షలు హెచ్చన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi Sree Samkarayya gaari samasya
kukka gaDDini maamsamun gOvutinunu "
tE .
కలియు గంబున వెలయును కధలు వెతలు
వెఱ్ఱి గంతులు వేయును వేయి తలలు
స్త్రీలు పురుషులు గామారు స్వేఛ కోరి
కుక్క గడ్డిని మాంసమున్ గోవు దినును

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" దీపము పైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షితమ్ముగా "
-----------------------------------------
చేపల కూరచేయ మనె చిక్కుడు జేసితి వేలనే సఖీ
మాపటి కైనగాని మరి మాటను దప్పక వండకున్న చో
రేపటి నాదుకోప మున రెక్కలు రాలిన శలభ మౌదువే
దీపము పైన నీఁగ కడు ధీరత వ్రాలె సురక్షి తమ్ముగా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" వనమునన్ సంచరింప వైభవము దక్కు "
----------------------------------
తే.గీ .
వనమ యూరపు నృత్యము ఘన మటంచు
మనసు వీణను సరిజేయు మల్లె సౌరు
గాన గంధర్వ మందున లీన మగుచు
వనమునన్ సంచరింప వైభవము దక్కు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య .
" వనమున సంచరింప దగు వైభవముల్ మదిగోరు వారికిన్ "
----------------------------------------
" చం .
ఘనమగు పూల తోట యది గాంచిన చాలును మేను జల్లనన్
మనమున పొంగు భావములు మౌనము నందున తేలి పోవగా
వనితల కోరికల్ విరియు భాసుర మొప్పగ సంత సంబునన్
వనమున సంచరింపఁ దగు వైభవముల్ మదిఁ గోరు వారికిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్
-------------------------------
కం .
భోగము లందున మునుగుచు
రాగము రంజిల్ల మదిని రారాజు వలెన్
సాగర తీరమ్ము నమరి
యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదము ననన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజన రంజని వారి సమస్య
" శివరాత్రిన నిదుర బోవఁ చింతలు దీరున్ "
---------------------------
కం .
దేవికి ప్రియమట పూజలు
నవరాత్రులు విభవ మొంద నవదుర్గ లుగా
శివునికి నీటను ముంచిన
శివరాత్రిన నిదురఁ బోవ చింతలు దీరున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజన రంజని వారి సమస్య
వే. లం . టై . ను " ఈ నాలుగు అక్షరములూ మొదటి అక్షరములుగా రావలెను "
------------------------------
తే.గీ ,
వేయి జన్మల కైనను వేచి వేచి
లంక బిందెలు దెఛ్చినే లక్ష ణముగ
టైము గమనించి నినుజేరి మోము గలిపి
నుంకు జేసెద ననునమ్ము మంకు మాని

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య .
" పద్యముల లోన యతులేల ప్రాస లేల
-------------------------
తే.గీ
రసభ రితమైన కావ్యము రాగ మందు
విందు జేయును వీనుల వేయి విధుల
పద్య ములలోన యతులేల ప్రాస లేల
మతులు బోవును చందస్సు మాని నంత

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చల్లని గాలికి హాయిగ
మెల్లగ మల్లెల జల్లు మెరుపుల దాడిన్
ఉల్లము రంజిలు రీతిగ
నల్లన స్నేహము ననింతి నయమౌ గాదే [గోలీ]
గోలి వారి [సరదా పూరణ ]

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆకాశవాణి వారు ప్రసారం చేసిన నా సమస్య "
" చైత్రము నందు వచ్చు రధసప్తమి గొల్వ వలెన్ గణేశునిన్ "
-------------------------------------
ఉ.
గోత్రము లన్నిజెప్పు కొని కొండల రాయుని నాలపిం చినన్
స్తోత్రము జేయుచున్ మదిని సోమర సంబును గ్రోలు చుండగా
మైత్రిని గోరియా తడట మైకము నందున బల్కెనీ విధిన్
చైత్రము నందువచ్చు రధసప్తమి గొల్వ వలెన్ గణేశునిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశవాణిలో ప్రసార మైన నా పూరణ .
" దత్తపది కరి, గిరి,దరి, సిరి . అన్యార్ధములో దేశ భక్తిని ప్రభోదిస్తూ "
తే. గీ
-------------------------
మంచు కొండల మాటున మరచి సతిని
గుండె నిండిన బాధలు గుచ్చి దరిమి
కరిగి వర్షించు కన్నీటి కనుల దుడిచి
పట్టు గాసిరి గిరికీలు కొట్ట కుండ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశ వాణిలో ప్రసారమైన నా పూరణ
సమస్య " బెదరుచుఁ కార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లడన్ "
---------------------------------------------------
చం .
చెదరని కార్యదీ క్షతను చేకొని ముందుకు సాగి పోయినన్
వదలని బంధముల్ మిగుల బాధను ముంచిన సాహసం బునన్
ముదముగ భోగ భాగ్యముల మోహము నందున మోసమే యగున్
బెదరుచు కార్యముల్ విడుటె విజ్ఞత కల్గు జయంబు లెల్లెడన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య
"నూతన వత్సరము గురించి శుభములు పలుకుతూ "
-------------------------------------
కం.
చల్లని వెన్నెల విరియగ
మల్లెల సౌరులను పంచి మానస వీణై
యుల్లము జల్లని పించగ
కల్లలు లేనట్టి ప్రేమ కావగ రమ్మా
” [ నూతన వత్సరమా ” ]

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabharaNamu numDi
పోరున మరణము పొందిన
వీరుడ వనిపేరు పొందు వేయి విధమ్ముల్
కారణ మేదైన తగును
క్రూరుని మార్గమ్మె మనకుఁ గూర్చును ముక్తిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పదిలము పదియవ వంతట
సదమల హృదయమ్ము తోన సౌరులు కురియన్
పదుగురు పంచుకు తినగను
మధురము గానుండు నంట మహనీయు లనన్
padya kavana vanam vaari samasya

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశ వాణిలో ప్రసారమైన నా పూరణ
సమస్య " పరమేశుంగని వేదభాగములు సంప్రాప్తించగా వ్యాసుడే
-----------------------------------------------
మ .
పరమే శుంగని వేదభా గములు సంప్రాప్తిం చగా వ్యాసుడే
వరమౌ భారత గాధ వ్రాసెను గదా, వాల్మీకి ధన్యాత్ముడై
సురలో కంబున దేవతా గణము లేశోభిల్ల గారామునిన్
హరుడే మానవ రూపమం దిలను సాక్షాత్కా రమందెన్ గదా

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

PADYA KAVANAVANAM VAARI SAMASYA
" kallapitOnE jalakammu layyen "
imdra vajra
తెల్లారి పోయింది మదీయ మిట్టన్
చల్లాలి రంగారు వసంత సోన
న్నిల్లాలి కోపంబు పన్నీరు గాకన్
కల్లాపి తోనేజల కమ్ము లయ్యెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈమాసం సుజనరంజని వారి సమస్య "
" వరదలు మేలు మేలనుచు పాడుచు నాడిరి కేరళీయులే "
చం .
సరిగమ పాట పాడుచును సాగర తీరము నందు కేళిలో
మురియుచు మేఘమా లికలు మోదము నందున వెల్గు లీనగన్
సరసపు వీణ నాదమ నిసంతస మొందుచు మైక మందునన్
వరదలు మేలు మేలనుచు పాడుచు నాడిరి కేరళీయులే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి . శ్రీ శంకరయ్యగారి సమస్య
" తల్లికిం దిండి నిడుట వ్యర్ధమ్ము సుమ్ము "
---------------------------
తే. గీ .
సేద దీర్చును సతియని మోద మలర
బ్రమను మునిగిన పతియట వలను చిక్కి
క్రొత్త లోకమ్ములో మున్గి గొణుగు చుంద్రు
తల్లికిం దిండి నిడుట వ్యర్ధమ్ము సుమ్ము

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశవాణి లో ప్రసారమైన నా సమస్యా పూరణము
సమస్య " దత్తపది " పికము , శుకము , బకము ,వృకము "
------------------------------
కం.
పికముల పేరో లగమున
శుకములు సంతసము నొంది శోభను గూర్చన్
బకములు వికారి వృకములు
మకరపు కన్నీరు గార్చె మనుజుల వోలెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" సినిమా దేవతఁ గొల్చిన చేకూరు సిరుల్ "
--------------------------------
కం .
ఘనమే దైనను గలదే
వినువీ ధినివిహ రించు విహగము వోలెన్
మనమున ప్రేమను చేకొని
సినిమా దేవతఁ గొల్చిన చేకూరు సిరుల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశవాణి లో ప్రసారమైన నా పూరణ
సమస్య " దీపము లేనియింట నవదీప్తులు నిండె మనోహ రంబుగన్ "
---------------------------------------------------
ఉ .
గోపిక లందరున్ గలసి గోకుల మందున రాసక్రీ డలన్
మాపటి వేళలం దమరి మచ్చిక జేయుచు పారవశ్య మున్
తాపము తీరగా తనరి తాండవ మాడుచు వెల్గులీ నగా
దీపము లేనియింట నవదీప్తులు నిండె మనోహరం బుగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

భరత భూమిని వనితకు పరమ పధము
నిండు వస్త్రము చోలము మెండు ధనము
రవిక యేచాలుఁ గదచీర రమణి కేల
రక్ష జేయును చోరుల కాంక్ష నుండి
-------------------------------------------
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య .
" రవికయే చాలుఁ గద చీర రమణి కేల ? "

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ధనికొండ వారి సమస్య " మార్చి యూహలన్ని మార్చి వైచె "
-------------------------------
ఆ.వె
ఏర్చి కూర్చి మార్చి యెటకేని పోవంగ
పధక మేయ నెంచి పతిని కోరి
వీలు పడదు నాకు వేవేల పనులందు
మార్చి యూహ లన్ని మార్చి వైచె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈరోజు ఆకాశ వాణిలో ప్రసారమైన నా పూరణ.
సమస్య " హృదయము లేని మానవులె యీ మహనీయ మహీ ప్రకాశముల్ "
చం .
ముదముగ పాన మందున ప్రమోదము నొందుచు నెల్ల వేళలన్
సదనము మాట మైమరచి సాగిల మ్రొక్కుచు మందు బాబులై
కదనము ద్రొక్కు చున్ పరు లుగాసిలి పోవగ సంత సంబునన్
హృదయము లేని మానవులె యీ మహనీయ మహీ ప్రకాశముల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణం నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య ,
" పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వ్పు రీతి సజీవులో యనన్ "
--------------------------------------------
ఉత్పల మాల .
గొఱ్ఱెల మందవోలె గుమి గూడుచు చోద్దెము జూడబో వగన్
వెఱ్ఱిగ మానవుండు తన వేగిర పాటును నెంచకుండ గన్
పుఱ్ఱెలు మాటలాడె తమ పూర్వపు రీతి సజీవులో యనన్
గుఱ్ఱపు స్వారివం టిదట గూడును వీడుచు సాగి బోవుటన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్ "
--------------------------------
కందము .
ఎఱ్ఱని భానుడు పడమట
సఱ్ఱున యుదయించె నేని సాహస మౌనా ?
వెఱ్ఱిగ యోచన జేసిన
పుఱ్ఱె లవియె మాటలాడెఁ బూర్వపు రీతిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" గాడిద కాల్పట్ట మోక్షగతి లభ్య మగున్
--------------------------------------
కందము
ఏడికి బోయెద జముడా
వేడుక మీరగ వరమని ప్రియుడే బ్రతుకన్
నేడిట నిలలో సాధ్వికి
గాడిద కాల్పట్ట మోక్ష గతి లభ్యమగున్
1

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య .
" మూఢమె శుభకార్య ములకు ముద్దనిరి జనుల్ "
---------------------------------------
కందము .
రూఢిగ జెప్పిన చాలదు
గూఢముగా నుండు నంట గొంగళి వలెనే
మూఢులు పలికిన చోద్యము
మూఢమె శుభకార్య ములకు ముద్దనిరి జనుల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశవాణిలో ప్రసార మైన నా పూరణ
సమస్య " రణమే శాంతికి మూలమౌ ననుచు ధర్మజ్ఞుండు బుద్ధుం డనెన్
----------------------------------------------
మత్తేభము .
ప్రణయం బందున దంపతుల్ కలహమే భాసిల్ల గన్మోదమున్
గణుతిం చంగను దేవతల్ మురిపెమున్ కాంక్షిం చగాకోరికల్
గుణమే ముఖ్యము మానవుల్ జగతిలో గోపాద ముందాకినన్
రణమే శాంతికి మూలమౌ ననుచు ధర్మజ్ఞుండు బుద్ధుం డనెన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సుజనరంజని వారి సమస్య
" శివరాత్రిన నిదురఁ బోవ చింతలు దీరున్ "
----------------------------
కందము .
దేవికి ప్రియమట పూజలు
నవరాత్రులు విభవ మొంద నవదుర్గ లుగా
భవునకు నీటను ముంచిన
శివరాత్రిన నిదురఁ బోవ చింతలు దీరున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" రంగాచారి నమాజు జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్ "
-------------------------------------
శార్దూలము .
సింగారిం చుకుసంత సంబున వడిన్ చేరంగ ప్రార్ధించు టన్
బంగారం బునలం కరించు కొనిసౌ భాగ్యమ్ము గాపొంగుచున్
రంగేళీ యువకుండు మోహ మునతా రాచెంత నేతేలుచున్
రంగాచారి నమాజుఁ జేసె నతుఁడై రంజాను పర్వమ్మునన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్
------------------------------
ఉత్పల మాల
ఏమది వింతగాదు కద యేమరు పాటున జేయగా పనుల్
నీమము వీడిపో వగను నెయ్యము కయ్యము గాదటన్ గనన్
పాముకు పాలుపో సినను పాపము నెంచక కాటువేయునే
చీమ పరాకునన్ గఱచె సింహ బలుండు గతించె వింతగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశవాణిలో ప్రసారమైన నా పద్యం
దత్తపది " పూవుల్, తావుల్ , మావుల్ , ప్రోవుల్ "
----------------------------------------
శార్దూల వృత్తము .
పూవుల్ గోసితిమాల లల్ల గనునే మోదంబునన్ వేదికన్
తావుల్ జూడగ సంతసంబు నగనన్ తాటంకినీ చేడియల్
మావుల్ దాగిన మంచు సోయ గమటన్ మాసీత సౌభాగ్య మే
ప్రోవుల్ సంతతిప్రోగు జేసిన నిధుల్ పొంగారు సింగార మే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ మధెని శంకరయ్యగారి సమస్య "
సమస్య " జాలిగ గబ్బిలము వెదకె జాషువ కొఱకై "
----------------------------------
కం .
హేలగ వ్రాసెను కవియట
మేలని యొకకావ్య మంట మీరిన సౌరున్
చాలని సంతస మొందుచు
జాలిగ గబ్బిలము వెదకె జాషువ కొఱకై

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిన్న శనివారం ఆకాశవాణి వారి సమస్య [నా పూరణ చదవలేదు కానీ మీతో పంచుకోవాలని]
సమస్య " పలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్ "
చంపక మాల .
----------------------------------
పలుకుల తల్లి మోదమున వాక్కు నొసంగగ సంత సంబునన్
విలువగు మాతృభాష యనవేడుక బుట్టెను కావ్య మల్లగన్
ఫలిత మునీయ వమ్మమది వాంఛిత మైన యభీష్ట సిద్ధికై
పలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

SamkaraabhaeaNau numDi
kam
భారము బ్రతుకుట నేడిల
సారము లేనట్టి భుక్తి సరసపు ధరకై
కోరిన హాయిగ నుండుట
కారాగృహ సుఖము దక్కఁ గలదే బయటన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశవాణి వారి పద్యం
--------------------------------
చంపక మాల
రసధుని వంటి బ్లాగు మన లాక్షణి కుండగు శంకరార్యులున్
విసుగను మాట లేకను గవేషణ జేయుచు పద్య కావ్యముల్
రసమయ వీధు లందునను రాగము చిందుచు సంచరించగా
వ్యసనము వేయి రీతుల శుభప్రద మైయశ మందఁ జేయునే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి జిలేబి గారి సమస్య
" పూరణఁ జేయఁ గాఁ బలుకుఁబోఁడికి బ్రమ్మకు నైన సాధ్యమే
--------------------------------------
ధారణ జేయువా రలకు ధాత్రిని ఖ్యాతిని తెచ్చిపెట్టునే
పారణ జేసిజేసి పలు భాషల రీతుల కావ్యమల్లగన్
నేరము లెంచకుం డగను నీమము తోడుత పద్యసౌ రులున్
పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రమ్మకునైన సాధ్యమే

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆకాశవాణి వారి సమస్య " పరమాత్ముని సేవ జేయ పాపము కలుగున్ :
-------------------------
వరమిడని రాయిని గొలువ
సురలో కముమెచ్చ దంట శుభముల నీయన్
మరిగిన లంచపు టాశగు
పరమాత్ముని సేవ చేయ పాపము కలుగున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

" శంకరాభరణము నుండి" సమస్య " అప్పులేని నరుడు వ్యర్ధుడు గద
------------------------------
గొప్ప కొఱకు మెండు గోతులు త్రవ్వుచు
చిక్కు లందు బడును మిక్కు టముగ
కలియు గంబు జూడ కాసుల కెరవంట
యప్పు లేని నరుడు వ్యర్ధు డుగద

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ "
----------------------------
అమ్మను కొలువగ భక్తిని
నెమ్మిని వరమీయ నెంచి నీకోరికలన్
కమ్మని లెక్కల జెప్పుచు
తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవమా నంబుల నెన్నిదా టితివొ నాకంబం దునన్ హాయిగా
స్తవనీ యంబగు జీవనం బునను ప్రాశస్త్యం బుగాతోచినన్
కవనం బల్లుచు కీర్తికా ముకుడ వైకావ్యం బులేవ్రా యగన్
శవమా సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్య శశ్శాలివై
SamkaraabhraNamu numDi Sree Samkarayya gaari samasya

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఆకాశవాణిలో ప్రసారమైన నా పూరణ
----------------------------------
కులము మతంబు లెంచక సగోత్రు లటంచు నుదార బుద్ధితోన్
చెలిమిగ జేర దీయుచు నుచెంత నుప్రీతిగ నాద రించుచో
వెలయు నతండు వాసిగను పెంపిరి బోవగ చెంగ లించుచున్
కలిమి తొలంగి నప్పుడె సుఖంబు లభించు నుమాన వాళికిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " భామ కంటె చిన్న దోమ మిన్న "
ఆ. వె .
వలపు వలను విసిరి కలలందు తేలించి
చిలిపి నవ్వు లెన్నొ చిలక రించి
మనసు దోచి తుదకు మనువాడు నన్యుని
భామ కంటెఁ జిన్న దోమ మిన్న

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మత్త కోకిల .
ప్రేమలీ కలికా లమందు నవెఱ్ఱి గంతులు వేయగన్
కోమలం బగుభావ జాలము కోయి లైరొద బెట్టగా
నీమముల్ గతిదప్పి మేను లెనెమ్మి సోయగ మొందగా
భామ కంటెను జిన్నదోమ ప్రభావ మెక్కువ సూడ్ఁగన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" మేడ నెక్కగ దిగవలె మూఁడు మెట్లు "
తే.గీ
జాడ తెలుసుకు మనవలె జంగ మయ్య
వాడ వాడల తిరుగుచు మేడి వలెను
పాడి గాదట బ్రతుకంగ పగను బూని
మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య
" మేడ నెక్కగ దిగవలె మూఁడు మెట్లు "
తే.గీ
జాడ తెలుసుకు మనవలె జంగ మయ్య
వాడ వాడల తిరుగుచు మేడి వలెను
పాడి గాదట బ్రతుకంగ పగను బూని
మేడ నెక్కఁగ దిగవలె మూఁడు మెట్లు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శనివారం ఆకాశవాణిలో ప్రసారమైన నా పూరణ
సమస్య " నిదురను mungu వారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్ "
చంపక మాల .
కదలక దీక్ష లేటికని కాదని హాయిగ సంత సంబునన్
వదలక విందు భోజనము వాసిగ మెక్కుచు నూరు వాడలన్
ముదితల ప్రేమ కోసమని మోదము నొందుచు చింత లేకతా
నిదురను మున్గు వారలకు నిశ్చల సంపద లబ్బు నెన్నగాన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

వందే మాతర మనుచును
బంధము లనుపెంపు జేసి బహురీతు లటన్
డెందమున దుష్ట బుద్ధిని
వందనమో తల్లి యనిన వధియింప దగున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మణులను కురిసిన దేశము
గణుతింపగ పుణ్య భూమి కలుషిత మవగా
పణముగ ప్రాణము లొడ్డిన
గణతంత్ర దినోత్సవమునఁ గలతలు రేఁగున్
samkaraabharanamu numdi

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య.
" మూషిక మొండు పిల్లిఁ గని మొద్దు లొసంగెను ప్రేమ తోడుతన్ "
---------------------------------------
వేషము మారినంతనె వివేకము లేకను స్వార్ధ చిత్తమున్
శోషిల జేయనెంచ గను సూచన భావము మోసమందునన్
రోషము జూపుచు న్నెదుటి రూపము జూడగ చెక్కగా వుతన్
మూషిక మొండు పిల్లిఁ గని ముద్దు లొసంగెను ప్రేమతో డుతన్
--------------------------------------------------
మూషికం బొండు పిల్లిని ముద్దు లాడె "
-------------------------------
పిల్లి పైనను కసిమెండు వెల్లి విరియ
పగను దీర్చగ యదనుకై పరిత పించ
కొయ్య బొమ్మను మురియుచు కోరి నంత
మూషికం బొండు పిల్లిని ముద్దులాడె

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఇంటి దీప మంట యిల్లాలి సొగసులు
ఇద్ద రున్న చాలు యుద్ధ మేను
కోరి తగవు లాడి మారుకా పురమన్న
సవతి యున్న సతికి సౌఖ్య మబ్బు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

nEDu aakaaSavaaNilO prasaaramaina naa pUraNa

చెన్నెస లారు మోహమున చేడియ జానకి ప్రాజ్ఞుడం చుతా
నెన్నిక చేయకుం డినను నెమ్మిని పెద్దల యాజ్ఞమే రకున్
పన్నుగ వింటిరా సినట వంచిన ధీరుడు మంచివాడు రా
మన్నను పెండ్లి యాడెను మహామహి తాత్ములు మెచ్చగా భువిన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కవనము లల్లెడి రసికులు
భవబం ధమ్ములను వీడి పరవశ మందున్
వివరిం పగనెవరి తరమె
కవితతికిన్ సామ్యతయె మృగములకుఁ గలిగెన్

«అన్నిటి కంటే పాతది ‹పాతవి   481లో 401 – 481   కొత్తది» సరి కొత్తది»

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase