Pages

30, జనవరి 2012, సోమవారం

" కారము వర్ణించు వాడు కాంచెను సుఖముల్ ! "

శారదను పఠియించి మనమున
పూరణ ములు జేయ నెంచి పూరించిన చో !
తీరగ కోరికలు శుభా
కారము వర్ణించు వాడు కాంచును సుఖముల్ !
----------------------------------------------
నో రూరిం చెను గదయని
గారెలనే తినగ నెంచి కాంక్షింఛి మదిన్ !
కోరిక తీరగ యర్ద్ధ్రక్ మిర్చీ
కారము వర్ణించు వాడు కాంచును సుఖముల్ !

28, జనవరి 2012, శనివారం

" దైవ మనెడి పదము తద్భ వమ్ము "

నన్ను గావు మయ్య నాపాలి దైవమై
భక్తి మీర గొలువ ముక్తి నొసగ
శరణు వేడు కొనిన కరినేల కరుణించె
దైవ మనెడి పదము తద్భ వమ్ము !

26, జనవరి 2012, గురువారం

" కడలి నీరంతయును నిండె గడవ లోన "

సాగరమ్ములు మ్రింగిరి యోగ దనులు
గగన మందుండి రప్పించె గంగ భువికి
వింత యేముంది మనదంత వేద భూమి
కడలి నీరంతయును నిండె గడవ లోన !

25, జనవరి 2012, బుధవారం

" విరుగ బండిన చేలను విడువ దగును"

మోస గిం చెడి జనులందు దోస మెంచి
చెడును దూరము జేయుట చేటు గాదు
భుక్తి నీయదు వరి యైన పురుగు బట్టి
విరుగ బండిన చేలను విడువ దగును !

24, జనవరి 2012, మంగళవారం

" కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్ "

కాటేయని వెలుచం గొని
వాటేసితి ముని గళమున ప్రారబ్ధమునన్ !
కాటే సె విధి బలీయము
కోటికి పడగెత్తి కూడ కూటికి వగచెన్ !

23, జనవరి 2012, సోమవారం

" గజ్జెలందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యక లాడరే ? "

ముజ్జగం బుల పోతనార్యుడు పూజనీయుడు పాం డితిన్ !
పద్యమం దునభావ మేమదు ప్రాయమై గద గ్రోలగన్ !
అజ్జభాగము నందు తేనియ నంచి వ్రాసె నొ మోదమున్ !
గజ్జెలందెలు ఘల్లు ఘల్లన కావ్య కన్యక లాడరే !

అజ్జభాగము. = కొన్ని పనసలు గల వేద భాగము

21, జనవరి 2012, శనివారం

" కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రాపులుం గులున్ "

వ్యాకుల పాటులన్ మఱచి వారిజ లోచన గాం చుమీ వనిన్
వేకువ జామునన్ కలసి వేడుక మీరగ మోద మందగా
కోకిల పాటలన్ వినుచు కోటి వసంతము లందు మై కమున్
కాకులు కొంగలున్ మరియు గ్రద్దలు డేగలు రా పులుం గులున్ !

20, జనవరి 2012, శుక్రవారం

" చెడుగులతో దేశ మెల్ల శ్రీకర మయ్యెన్ ! "

పిడికెడు భక్తిని మనమున
కడు మోదముతోడ భవుని గొలిచిన తోడన్ !
విడివడి మైకము మలిగిన
చేడుగులతో దేశ మెల్ల శ్రీకర మయ్యెన్ !
------------------------------------------
అడుగడుగన డాలరులని
కడివెడు కల లందు మునిగి కాంతలు కులుకన్ !
కడ కడ బ్రమలే తొలగిన
చెడుగులతో దేశ మెల్ల శ్రీకర మయ్యెన్ !

18, జనవరి 2012, బుధవారం

" దారను రక్షించు సాదు తతి నండ్రు బుధుల్ "

శ్రీ రామ నామ మన్నను
ఆ రామ స్మరణ జేయ నాశ్రితు డనుచున్ !
వేరేల రాముడను మం
దారము రక్షించు సాదు తతి నండ్రు బుధుల్ !
----------------------------------------------
తారా పధమున యలిగిన
దారను మెప్పించి గెలువ తరమే ధరణిన్ !
చీరెలు సారెలు నగ మం
దారము రక్షించు సాదు తతి నండ్రు బుధుల్ !

12, జనవరి 2012, గురువారం

" ధర్మ విధులకు బూజ్యుడు త్రాగు బోతు "

కుపద మందున దిరిగెడు గుణని ధివలె
పాప కృత్యము లన్నను భీతి లేక
జూద మాడంగ మది కెంతొ మోదమన న
ధర్మ విధులకు బూజ్యుడు త్రాగు బోతు. !

10, జనవరి 2012, మంగళవారం

" విగ్రహ ములతో నిండెను వీదు లెల్ల "

పండితోత్తమ సంపద పగుల గొట్టి
కోట్లు మ్రింగిన గ్రహముల కంచు ప్రతిమ
నీతి బోధలు చేయుచు ప్రీతి మాలి
విగ్రహ ములతో నిండెను వీదు లెల్ల !

9, జనవరి 2012, సోమవారం

" వందన మిడి భక్తి మీర భర్గుని కొసగెన్ ! "

సుందర మందారము గని
అందముగా కనుల విందు నాహా యనుచున్ !
డెందము చిందులు వేయగ
వందన మిడి భక్తి మీర భర్గుని కొసగెన్ !

7, జనవరి 2012, శనివారం

" పూల పానుపు కాదది ముండ్ల బాట "

వాలు చూపుల వయ్యారి వలను చిక్కి
ఏలు కొనియెద ననుకొన్న మేలు గాదు
వారిజాక్షుల చిత్తమ్ము భ్రాంతి గొలుపు
పూల పానుపు కా దది ముండ్ల బాట !

6, జనవరి 2012, శుక్రవారం

" మారు బూజింతు దైత్య సంహారు దీరు "

ఆది సూ కరమై నిల్పె నవని నతడు
కై ట భాసురు జంపిన ఘనుడు కాదె ?
మూడడుగు లాక్రమిం చిన ముంజి యతడు
మారు బూజిం తు దైత్య సంహారు దీరు !

4, జనవరి 2012, బుధవారం

" శివుని పూజింతు రేకాదశీ దినమున "

తులసి పూజించ క్షీరాబ్ది ద్వాదశి యన
దుర్గ పూజలు నవరాత్రి దినము లందు
విష్ణు పూజించు నిరతము వై ష్ణ వుండు
శివుని పూజింతు రేకాద శీ దినమున

3, జనవరి 2012, మంగళవారం

" పంది మిగుల చొక్కె సుంద రాంగి "

చంద మామ వంటి యందాల వలరేడు
వలపు విరులు విసురు వల్ల భుండు
డెంద మందు చిందు లేనగవు పిలు
పంది మిగుల చొక్కె సుంద రాంగి !

2, జనవరి 2012, సోమవారం

" పండితులను దిట్టు వారు పావన చరితుల్ ! "

" పోచి రాజు సుబ్బారావు గారి సమస్య "
-----------------------------------------
పండితులము మేమనుచును
దండిగ డంబములు పలికి తనరెడు వారిన్ !
మెండుగ కొం డె డి వారగు
పండితులను దిట్టు వారు పావన చరితుల్ !
 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase