Pages

12, సెప్టెంబర్ 2012, బుధవారం

" వంక యున్న వాడు శంక రుండు "

వెండి కొండ పైన వేవేల నృత్యాలు
మసన మందు దిరుగు మహిమ లనగ
గళము నందు పాము గంగ చెంతన చంద్ర
వంక యున్న వాడు శంక రుండు

8 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " పద్య రచన "
----------------------------------------
గరికపాటి వారి కావ్య వనము నందు
పద్య సుమము లేరి పరవశించి
యవధ రించి మదిని హాస్య రసము గ్రోల
గగన వీధు లంత పగటి వెలుగు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...


శంకరాభరణము నుండి " సమస్య "
చీర గట్టు కొనుము శ్రీనివాస "
----------------------------------
సురలకు యసురులకు సోద్దె మరయురీతి
అమృత మును పంచ నాది దేవ
వాలు జడను వేసి వయ్యార మొలికించ
చీర గట్టు కొనుము శ్రీనివాస

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " పద్య రచన "
----------------------------------------
బాణము వేసె నిషాదుడు
ప్రాణము గోల్పోయె క్రౌంచ పక్షి నా
శోణితము గనిన మునియట
వాణిని శాపముగ విడచె వాల్మీకి యనన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి
సమస్య " సిరికి మగడు చంద్ర శేఖ రుండు "
--------------------------------------
శేష తల్ప మందు శయనించు విష్ణుండు
సిరికి మగడు , చంద్ర శేఖ రుండు
వెండి కొండ పైన వేలగణము లందు
నటన మాడు నట్టి నర్త కుండు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి " పద్య రచన " అంశము
" ప్రవచనములు "
-----------------------------------
ప్రవచన ములువిని నంతనె
భవబంధము లన్ని మరచి భగవం తునికై
సవరణ జేయుచు బ్రతుకును
వివరించును మనసు నిండ వేయి విధమ్ముల్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " పాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్ "
=================================
బీటలు వారిన భూమిని
నేటికి నెదురీది బలిమిగ నెవ్విధి నైనన్
తోటలు వేయుచు పంటకు
పాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్ "
--------------------------------
పాపా లనుతొల గించగ
దీపాలంకృత గృహమునఁ,దిమిరము నిండెన్
కోపించె నేమొ రాతిరి
శాపపు సుడిగాలి వీచె శాంభవి మాయన్

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య "
"నీరు జల్లి నంత నిప్పు రగిలె "
--------------------------
చక్క నైన జంట మక్కువగా నుండె
చూచి యోర్వ లేని చుప్ప నాతి
జేరి పలికె నకట చేదువంటి విషపు
నీరు జల్లి నంత నిప్పు రగిలె

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 
Copyright 2010 సాహిత్య దీపిక. Powered by Blogger
Blogger Templates created by DeluxeTemplates.net
Wordpress by Wpthemescreator
Blogger Showcase