మదిలోని ఊసులన్నీ మాటల అలలైన వేళ...
శంకరాభరణము నుండి " పద్య రచన " ---------------------------------------- గరికపాటి వారి కావ్య వనము నందు పద్య సుమము లేరి పరవశించి యవధ రించి మదిని హాస్య రసము గ్రోల గగన వీధు లంత పగటి వెలుగు
శంకరాభరణము నుండి " సమస్య " చీర గట్టు కొనుము శ్రీనివాస " ----------------------------------సురలకు యసురులకు సోద్దె మరయురీతి అమృత మును పంచ నాది దేవ వాలు జడను వేసి వయ్యార మొలికించ చీర గట్టు కొనుము శ్రీనివాస
శంకరాభరణము నుండి " పద్య రచన " ----------------------------------------బాణము వేసె నిషాదుడు ప్రాణము గోల్పోయె క్రౌంచ పక్షి నా శోణితము గనిన మునియట వాణిని శాపముగ విడచె వాల్మీకి యనన్
శంకరాభరణము నుండి సమస్య " సిరికి మగడు చంద్ర శేఖ రుండు " --------------------------------------శేష తల్ప మందు శయనించు విష్ణుండు సిరికి మగడు , చంద్ర శేఖ రుండు వెండి కొండ పైన వేలగణము లందు నటన మాడు నట్టి నర్త కుండు
శంకరాభరణము నుండి " పద్య రచన " అంశము " ప్రవచనములు " ----------------------------------- ప్రవచన ములువిని నంతనె భవబంధము లన్ని మరచి భగవం తునికై సవరణ జేయుచు బ్రతుకును వివరించును మనసు నిండ వేయి విధమ్ముల్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " పాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్ " =================================బీటలు వారిన భూమిని నేటికి నెదురీది బలిమిగ నెవ్విధి నైనన్ తోటలు వేయుచు పంటకు పాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్ "--------------------------------పాపా లనుతొల గించగ దీపాలంకృత గృహమునఁ,దిమిరము నిండెన్ కోపించె నేమొ రాతిరి శాపపు సుడిగాలి వీచె శాంభవి మాయన్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య ""నీరు జల్లి నంత నిప్పు రగిలె " --------------------------చక్క నైన జంట మక్కువగా నుండె చూచి యోర్వ లేని చుప్ప నాతి జేరి పలికె నకట చేదువంటి విషపు నీరు జల్లి నంత నిప్పు రగిలె
Cheap Travel System
8 కామెంట్లు:
శంకరాభరణము నుండి " పద్య రచన "
----------------------------------------
గరికపాటి వారి కావ్య వనము నందు
పద్య సుమము లేరి పరవశించి
యవధ రించి మదిని హాస్య రసము గ్రోల
గగన వీధు లంత పగటి వెలుగు
శంకరాభరణము నుండి " సమస్య "
చీర గట్టు కొనుము శ్రీనివాస "
----------------------------------
సురలకు యసురులకు సోద్దె మరయురీతి
అమృత మును పంచ నాది దేవ
వాలు జడను వేసి వయ్యార మొలికించ
చీర గట్టు కొనుము శ్రీనివాస
శంకరాభరణము నుండి " పద్య రచన "
----------------------------------------
బాణము వేసె నిషాదుడు
ప్రాణము గోల్పోయె క్రౌంచ పక్షి నా
శోణితము గనిన మునియట
వాణిని శాపముగ విడచె వాల్మీకి యనన్
శంకరాభరణము నుండి
సమస్య " సిరికి మగడు చంద్ర శేఖ రుండు "
--------------------------------------
శేష తల్ప మందు శయనించు విష్ణుండు
సిరికి మగడు , చంద్ర శేఖ రుండు
వెండి కొండ పైన వేలగణము లందు
నటన మాడు నట్టి నర్త కుండు
శంకరాభరణము నుండి " పద్య రచన " అంశము
" ప్రవచనములు "
-----------------------------------
ప్రవచన ములువిని నంతనె
భవబంధము లన్ని మరచి భగవం తునికై
సవరణ జేయుచు బ్రతుకును
వివరించును మనసు నిండ వేయి విధమ్ముల్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్య గారి సమస్య " పాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్ "
=================================
బీటలు వారిన భూమిని
నేటికి నెదురీది బలిమిగ నెవ్విధి నైనన్
తోటలు వేయుచు పంటకు
పాటుబడిన వారికెట్లు ఫలితము దక్కున్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య " దీపాలంకృత గృహమునఁ దిమిరము నిండెన్ "
--------------------------------
పాపా లనుతొల గించగ
దీపాలంకృత గృహమునఁ,దిమిరము నిండెన్
కోపించె నేమొ రాతిరి
శాపపు సుడిగాలి వీచె శాంభవి మాయన్
శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య "
"నీరు జల్లి నంత నిప్పు రగిలె "
--------------------------
చక్క నైన జంట మక్కువగా నుండె
చూచి యోర్వ లేని చుప్ప నాతి
జేరి పలికె నకట చేదువంటి విషపు
నీరు జల్లి నంత నిప్పు రగిలె
కామెంట్‌ను పోస్ట్ చేయండి